Home /News /business /

DO YOU KNOW WHY RENT AGREEMENTS FOR 11 MONTHS PREFERRED IN INDIA UMG GH

Rent Agreements: రెంట్‌ అగ్రిమెంట్‌లో మీకూ ఈ అనుభవం ఎదురైందా..? దీని వెనుక అసలు కథ తెలుసుకోండీ..!

హౌస్ రెంట్‌ అగ్రిమెంట్‌లో నిబంధనలు ఇవే.

హౌస్ రెంట్‌ అగ్రిమెంట్‌లో నిబంధనలు ఇవే.

రెంటల్‌ అగ్రిమెంట్‌ (rent agreement)ను రెన్యువల్‌ చేసుకునే అవకాశం ఉన్నా సరే.. ఇండియా (India)లో దాదాపు అందరు ఇంటి (House) యజమానులు రెంటల్‌ అగ్రిమెంట్‌పై 11 నెలలకు సంతకం చేయమని కోరుతారు. ఇంటిని రెంట్‌కు తీసుకున్న వారికి ఈ అనుభవం ఎదురై ఉంటుంది.

ఇంకా చదవండి ...
రెంటల్‌ అగ్రిమెంట్‌ (rent agreement)ను రెన్యువల్‌ చేసుకునే అవకాశం ఉన్నా సరే.. ఇండియాలో దాదాపు అందరు ఇంటి యజమాను (House Owner)లు రెంటల్‌ అగ్రిమెంట్‌పై 11 నెలలకు సంతకం (sign) చేయమని కోరుతారు. ఇంటిని రెంట్‌కు తీసుకున్న వారికి ఈ అనుభవం ఎదురై ఉంటుంది. అయితే రెంటల్‌ అగ్రిమెంట్‌పై 11 నెలలకే సంతకం చేయమని ఎందుకు కోరుతారో తెలుసుకోండి.

న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారతదేశంలో చట్టాలు అద్దెదారులకు అనుకూలంగా ఉన్నాయి. అగ్రిమెంట్‌ ప్రకారం ఇంటిని లీజుకు ఇచ్చినా, లేదా ఇంటిని అద్దెకు ఇచ్చినా.. వివాదాలు తలెత్తిన సందర్భాల్లో అద్దెదారులతో ఇంటిని ఖాళీ చేయించడం చాలా కష్టం. ఇలాంటి సందర్బాల్లో విధానపరమైన జాప్యాలు/లోపాల కారణంగా యజమానికి న్యాయం జరగడానికి సంవత్సరాలపాటు న్యాయ పోరాటం చేయాలి. అప్పటి వరకు అద్దెదారులు ఆస్తిని అనుభవిస్తూనే ఉంటారు.

దీని గురించి ఎస్‌ఎన్‌జీ అండ్‌ పార్ట్నర్స్‌లో భాగస్వామి సాధవా మిశ్రా మాట్లాడుతూ.. ‘అద్దెదారులను ఖాళీ చేయించడానికి సంవత్సరాలపాటు న్యాయపోరాటం చేసే పరిస్థితిని తప్పించుకోవడానికి, ఆస్తి యజమాని లీజు అగ్రిమెంట్‌, లైసెన్స్ అగ్రిమెంట్‌ (మహారాష్ట్ర రాష్ట్రంలో మాత్రమే వర్తిస్తుంది) పదకొండు నెలలకు మించకుండా చేసుకుంటారు. పదకొండు నెలల లీజు అగ్రిమెంట్‌ చేసుకోవడానికి మరో కారణం ఉంది. ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1908లోని సెక్షన్ 17(డి) ప్రకారం, ఒక సంవత్సరం కంటే తక్కువ కాలానికి చేసుకున్న లీజు అగ్రిమెంట్‌ను రిజిస్టర్‌ చేయాల్సిన అవసరం లేదు. అగ్రిమెంట్‌ చేసుకోవాలని తప్పనిసరి నిబంధన కూడా లేదు. అటువంటి అగ్రిమెంట్‌లు నోటరీ చేసినప్పటికీ వివాదాల సందర్భంలో సాక్షంగా న్యాయస్థానంలో స్వీకరిస్తారు.’ అని చెప్పారు.

ఇదీ చదవండి: మానవత్వం పరిమళించింది.. కుక్క కోసం ఏకమైన ఓ గ్రామం.. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ..!


రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది. ఎక్కువ సమయం తీసుకుంటుంది. రిజిస్టర్ చేసుకోవడానికి ఇరు వర్గాలకు చెందినవారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ముందు హాజరు కావాలి. అందువల్ల రిజిస్ట్రేషన్ అవాంతరాన్ని నివారించడానికి యజమాని పదకొండు నెలల అగ్రిమెంట్‌, లైసెన్స్ అగ్రిమెంట్‌ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దీన్ని రిజిస్టర్‌ చేయాలనే నిబంధన లేదు, బదులుగా నోటరీ చేయవచ్చు.

పదకొండు నెలల లీజు అగ్రిమెంట్‌, లైసెన్స్ అగ్రిమెంట్‌కు ప్రాధాన్యం ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. స్టాంప్ డ్యూటీ చిక్కులు, రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం తగ్గుతుంది. లీజు అగ్రిమెంట్‌ ఒప్పందం ఒక సంవత్సరం కంటే తక్కువ ఉంటే, ఎక్కువ కాల వ్యవధికి లీజుతో పోలిస్తే చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ తక్కువగా ఉంటుంది. 11 నెలల అగ్రిమెంట్‌ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు కాబట్టి, రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అందువల్ల వివాదాలు, రిజిస్ట్రేషన్‌ అవాంతరాలు, స్టాంప్ డ్యూటీని ఆదా చేయడం కోసం ఎక్కువ మంది లీజు అగ్రిమెంట్‌ను పదకొండు నెలలకు చేయించడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ గడువు ముగిసిన తర్వాత రెన్యువల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.



అయితే మహారాష్ట్రలో లీవ్, లైసెన్స్ అగ్రిమెంట్‌ గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. అగ్రిమెంట్‌లో పేర్కొన్న విధంగా మాత్రమే అద్దెదారులు ఆస్తిని వినియోగించుకోవాలి. ఆస్తిని అనుభవించేందుకు అద్దెదారులకు పరిమిత కాలానికి మాత్రమే హక్కులు ఉంటాయి. ఢిల్లీలో దీర్ఘకాల లీజులకు బదులుగా 11 నెలల లీజు అగ్రిమెంట్ పద్ధతినే ఉపయోగిస్తారు. భారతదేశంలోని అనేక ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే పద్ధతిని పాటిస్తారు.

విదేశాల్లో రెంటల్‌ అగ్రిమెంట్‌ చట్టాలు
ఇలాంటి రెంటల్‌ అగ్రిమెంట్‌లను యూకేలో పాటించరు. ఈ చట్టాలు ఆయా దేశాలను బట్టి మారుతుంటాయి. ఇంగ్లాండ్‌లోని చట్టాలు స్కాట్‌లాండ్‌లోని చట్టాలకు భిన్నంగా ఉంటాయి. దీనిపై మిశ్రా మాట్లాడుతూ.. ‘విదేశాల్లో అగ్రిమెంట్లు ఎక్కువ కాలానికి చేసుకుంటారు. నియమ నిబంధనలు, గడువు ముగిసే తేదీలను స్పష్టంగా పేర్కొంటారు. యూఎస్‌లో హోల్డోవర్ రూల్ అనే చట్టాన్ని చాలా రాష్ట్రాలు రద్దు చేశాయి. హోల్డోవర్ రూల్ అంటే వెంటనే అద్దెదారుడిని ఇంటిని ఖాళీ చేయించే లేదా అధిక అద్దెను వసూలు చేసే అధికారాన్ని యజమానికి కల్పిస్తుంది.’ అని మిశ్రా చెప్పారు.
Published by:Mahesh
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు