వాహనాలు (Vehicles) ప్రమాదాలకు, దొంగతనాలకు గురైన సందర్భంలో వాహనదారులకు రక్షణ కల్పించేందుకు బీమా సదుపాయం (Insurance facility) అందుబాటులోకి తీసుకువచ్చారు. సహజంగా వాహనాలకు నష్టం వాటిల్లినా, మ్యాన్ మేడ్ కలామిటీస్ ద్వారా నష్టం జరిగినా బీమా కవరేజీ (Insurance coverage) అందుతుంది. మోటార్ వెహికల్స్ యాక్ట్- 1988 ప్రకారం.. వాహనాలకు బీమా చేయడం తప్పనిసరి. అయితే వాహన బీమా (Vehicle insurance) పరిహారానికి కూడా పరిమితులు ఉంటాయి. వాహనాల అన్ని రకాల నష్టాలకు బీమా పరిహారం అందదు. కారులో ఒక ప్రత్యేకమైన భాగాలను మార్చినప్పుడు పైనల్ బిల్లు (Final bill)లో స్పేర్ పార్ట్స్ తో పాటు, సర్వీస్ ఛార్జీ (service charge)ల కవరేజీ ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలో ఇన్సూరెన్స్ యాడ్ ఆన్స్ (Insurance add on) చేసుకోవడం ద్వారా కవరేజీ పెంచుకోవచ్చు. బేస్ మోటార్ పాలసీ (Base motor policy)కి ఇది అదనం. వాహనదారులకు అవసరమయ్యే ముఖ్యమైన యాడ్ ఆన్ కవర్స్ చూద్దాం.
డెయిలీ అలవెన్స్ కవర్ (Daily allowance cover)
సొంత వాహనంలో ప్రయాణించేప్పుడు అది రిపేర్ (repair)కు గురికావచ్చు. రిపేర్ చేయడానికి కొన్ని రోజుల సమయం పట్టవచ్చు. అలాంటి సమయంలో క్యాబ్, ఇతర వాహనంలో ప్రయాణించాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలో డెయిలీ అలవెన్స్ కవర్ (daily Allowance cover) ఉంటే రోజుకు రూ.500 అలవెన్సు, రెండు వారాల పాటు లభిస్తుంది. వాహనదారులు ఈ యాడ్ ఆన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
* లాస్ ఆఫ్ పర్సనల్ బిలాంగింగ్స్ (Loss of personal belongings cover)
మనం ప్రయాణించే వాహనానికి బీమా కవర్ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మన కారులో తీసుకెళుతున్న విలువైన వస్తువులు కూడా దొంగల (theft) పాలుకావచ్చు. అలాంటి సమయంలో ఈ కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ (Comprehensive car insurance) కవర్ ద్వారా పోయిన వస్తువులకు కూడా పరిహారం పొందవచ్చు. యాడ్ ఆన్ కవర్ (Add on cover) ద్వారా కారులో పోయిన మొబైల్ కు గరిష్ఠంగా రూ.25000, ల్యాప్ టాప్ కు గరిష్ఠంగా రూ. 50,000 వరకు పరిహారం పొందవచ్చు.
* కీ రీప్లేస్మెంట్ కవర్ (Key replacement cover)
తొందరపాటులో ఒక్కోసారి కారు తాళాలు పోతూ ఉంటాయి. హై ఎండ్ కార్లలో కంప్యూటర్ కోడ్ తో కీ అనుసంధానం చేసి ఉంటుంది. ఇలాంటి కార్ల తాళం చెవులు (keys) పోతే వాటిని మళ్లీ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. స్థానిక డీలర్లు ఇలాంటి వాటిని తయారు చేయలేరు కూడా. ఆ కారు తయారీదారులను ఆశ్రయించాల్సి ఉంటుంది. కీ రేప్లేస్మెంట్ కవర్ (Key replacement cover) ద్వారా తాళం చెవులు పోయినప్పుడు బీమా పరిహారం లభిస్తుంది. కొత్త కీ తయారీకి అయ్యే ఖర్చులు మొత్తం బీమా కంపెనీ భరిస్తుంది.
* టైర్లకు కవరేజీ ఇచ్చే యాడ్ ఆన్ (Tire protector motor cover)
వాహనదారులందరికీ టైర్ ప్రొటెక్టర్ యాడ్ ఆన్ (Tire protector motor add on) తప్పనిసరి. ప్రయాణాల్లో ఒక్కోసారి టైర్లు, ట్యూబులు పేలిపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో టైర్లు, ట్యూబులు రీప్లేస్ చేయడంతోపాటు, లేబర్ చార్జీలు, వాహనాన్ని తరలించడానికి అయ్యే ఖర్చులు కూడా ఈ యాడ్ ఆన్ ద్వారా పొందవచ్చు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.