హోమ్ /వార్తలు /బిజినెస్ /

Savings Account: సేవింగ్స్ అకౌంట్లపై ఎక్కువ వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంకులు ఇవే..

Savings Account: సేవింగ్స్ అకౌంట్లపై ఎక్కువ వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంకులు ఇవే..

కరోనా సమయంలో ప్రభుత్వ బ్యాంకులు సర్వీస్ చార్జీలను సమీప భవిష్యత్తులో పెంచబోవని ఆర్థిక శాఖ హామీ ఇచ్చింది. 60.04 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లపై ఎలాంటి సర్వీస్ చార్జీ ఉండదని... జన్‌ధన్ ఖాతాలకు కూడా ఇది వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

కరోనా సమయంలో ప్రభుత్వ బ్యాంకులు సర్వీస్ చార్జీలను సమీప భవిష్యత్తులో పెంచబోవని ఆర్థిక శాఖ హామీ ఇచ్చింది. 60.04 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లపై ఎలాంటి సర్వీస్ చార్జీ ఉండదని... జన్‌ధన్ ఖాతాలకు కూడా ఇది వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Interest on Savings Account: ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే సేవింగ్స్ అంకౌంట్లలో దాచుకున్న డబ్బుపై అధిక వడ్డీని అందించే కొన్ని చిన్న బ్యాంకులు, కొత్త ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి.

సాధారణంగా ఉద్యోగాలు చేసేవారు జీతాలను సేవింగ్స్ అకౌంట్లోనే దాచుకుంటారు. ఇదే అకౌంట్ నుంచి పెట్టుబడులు, లోన్లకు అప్లై చేసుకుంటారు. కానీ ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే ఇలాంటి సేవింగ్స్ అకౌంట్లలో దాచుకునే డబ్బుపై తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే సేవింగ్స్ అంకౌంట్లలో దాచుకున్న డబ్బుపై అధిక వడ్డీని అందించే కొన్ని చిన్న బ్యాంకులు, కొత్త ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. మనకు అత్యవసరంగా డబ్బు కావాల్సి వస్తే సేవింగ్స్ అకౌంట్ నుంచి సులభంగా తీసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇలాంటి సౌకర్యం ఉండదు. అందుకే సేవింగ్స్ అకౌంట్లపై ఎక్కువ వడ్డీని చెల్లించే బ్యాంకులు, వడ్డీ రేట్లపై అవగాహన పెంచుకోవాలి.

కొత్త ప్రైవేట్ బ్యాంకులే మేలు

తాజా సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను పరిశీలిస్తే.. కొత్త ప్రైవేట్ బ్యాంకులైన బంధన్ బ్యాంక్ 7.15 శాతం, ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఏడు శాతం వడ్డీరేట్లను అందిస్తున్నాయి. ఇతర ప్రైవేట్ బ్యాంకులు మాత్రం 6.75 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. ప్రముఖ ప్రైవేటు, పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ఈ వడ్డీ రేట్లు ఎక్కువ. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి పెద్ద ప్రయివేటు బ్యాంకులు కేవలం మూడు నుంచి 3.5 శాతం వడ్డీ రేట్లనే సేవింగ్స్ అకౌంట్లపై ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇది మరీ తక్కువగా ఉన్నట్లు బ్యాంక్ బజార్ సంస్థ తాజా గణాంకాలు చెబుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.70 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 2.75 శాతం మాత్రమే వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

మినిమమ్ బ్యాలెన్స్ ఎక్కువ

ఉద్యోగాలు చేసే మధ్యతరగతి ప్రజలు, సెల్ప్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ను ఆకట్టుకోవడానికి ప్రైవేటు బ్యాంకులు ఆసక్తి చూపుతాయి. సాధారణంగా సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ ఎక్కువ అందించే బ్యాంకులు కనీస నిల్వలు (మినిమం బ్యాలెన్స్) ఎక్కువగా ఉంచాలనే నిబంధనలు విధిస్తాయి. ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకుల పొదుపు ఖాతాల్లో రూ.500 నుంచి రూ.10,000 వరకు మినిమం బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధన ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువ మొత్తంలో మినిమం బ్యాలెన్స్ నిబంధన ఉంటుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో మినిమం బ్యాలెన్స్ రూ.10,000 ఉండాలి. బంధన్ బ్యాంక్ దీన్ని రూ.5,000కు పరిమితం చేసింది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీల్లో రూ.2,500 నుంచి రూ.10,000 వరకు మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. ఐసీఐసీఐ బ్యాంకులో ఇది రూ.1,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది.

ట్రాక్ రికార్డు చూడాలి

ఎక్కువ సేవింగ్స్ వడ్డీ రేట్లను అందించే బ్యాంకుల జాబితాలో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న వాటినే ఎంచుకోవాలి. నగరాల్లో లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డ్ ఉన్న బ్యాంకులు, ఉత్తమ సేవలందించేవి, ఎక్కువ బ్రాంచ్లు, పెద్ద మొత్తంలో ఏటీఎమ్ సెంట్లరు ఉండేవాటిని ఎంచుకోవడం మంచిది. సేవింగ్స్ అకౌంట్లపై మనకు వచ్చే అధిక వడ్డీలను బోనస్గా భావించాలి.

First published:

Tags: Bank account, Savings

ఉత్తమ కథలు