హోమ్ /వార్తలు /బిజినెస్ /

Nominee: నామిని అంటే ఏంటో తెలుసా.. మీ ఫైనాన్సియల్ విషయాల్లో నామిని చేయకపోతే ఎంత నష్టపోతారంటే..?

Nominee: నామిని అంటే ఏంటో తెలుసా.. మీ ఫైనాన్సియల్ విషయాల్లో నామిని చేయకపోతే ఎంత నష్టపోతారంటే..?

నామిని అంటే ఎంతో తెలుసా.. మీ ఫైనాన్సియల్ విషయాల్లో నామిని చేయకపోతే ఎన్నినష్టాలు ఉంటాయంటే ?

నామిని అంటే ఎంతో తెలుసా.. మీ ఫైనాన్సియల్ విషయాల్లో నామిని చేయకపోతే ఎన్నినష్టాలు ఉంటాయంటే ?

ఏదైనా ఫైనాన్షియల్ అసెట్ విషయంలో అసలు నామినీ(Nominee) పాత్ర ఏంటి? క్లెయిమ్‌(Claim) చేసుకోవడంలో కలుగుతున్న సమస్యలు ఏంటి? నామినీని లబ్ధిదారుడిగా ఎందుకు పేర్కొనకూడదో తెలుసుకుందాం.

ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ఫైనాన్షియల్‌(Financial) ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నప్పుడు నామినీని తప్పక రిజిస్టర్‌ చేయాలి. సంబంధిత వ్యక్తి ఏదైనా కారణాలతో మరణిస్తే.. స్కీమ్‌కి చెందిన ప్రయోజనాలు నామినీ(Nominee)కి అందుతాయి. ఈ నేపథ్యంలో ఏదైనా ఫైనాన్షియల్ అసెట్ విషయంలో అసలు నామినీ పాత్ర ఏంటి? క్లెయిమ్‌(Claim) చేసుకోవడంలో కలుగుతున్న సమస్యలు ఏంటి? నామినీని లబ్ధిదారుడిగా ఎందుకు పేర్కొనకూడదో తెలుసుకుందాం.

ఆస్తులను అనుభవించడంలో వివిధ సమస్యలు ఉన్నాయి. ఇప్పటివరకు పెద్ద మొత్తంలో నగదును క్లెయిమ్‌ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కి సంబంధించి ఓ యాడ్‌లో క్రికెటర్ కేఎల్‌ రాహుల్.. ‘నామినీని రిజిస్టర్‌ చేయడం మర్చిపోకండి’ అని చెప్పాడు. అదే విధంగా అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(AMFI)..‘మ్యూచువల్ ఫండ్స్ మే నామినేషన్ కర్నా సాహీ హై (మ్యూచువల్ ఫండ్స్‌లో నామినేషన్‌ను పూర్తి చేయడం ముఖ్యం)’ అని సూచిస్తుంది. ఇవి వాటాదారు మరణం సందర్భంలో నామినేషన్, నామినీ పాత్రపై అవగాహన కల్పిస్తాయి. ఓ నిర్ధిష్ట పనిని చేయడానికి అధికారికంగా ఓ వ్యక్తిని సెలక్ట్‌ చేసుకోవడాన్ని నామినేషన్ అంటారు. నామినీగా ఉండే వాళ్లకు ట్రస్టీ, గార్డియన్‌, లేదా ఆస్తుల సంరక్షకుడిగా ఉండే బాధ్యత ఉంటుంది. నామినీ వారసులను సూచిస్తుంది.

చట్టబద్ధమైన వారసులు లేదా లబ్ధిదారులు అవడానికి నామినీల పాత్ర గురించి అనేక తీర్పులు ఉన్నాయి.

నామినీ, వారసుడు ఒకటేనా?

వారసత్వాన్ని పాస్ చేయడానికి మూడో మార్గంగా నామినేషన్‌ను చట్టబద్ధంగా పరిగణించాలని ఇటీవల డిమాండ్‌లు వినిపించాయి. ఈ విషయంలో ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తున్నాయి. మొదట అన్ని ఆస్తులకు నామినీలు తప్పనిసరిగా యజమానులు అయి ఉండాలని కోరుతున్నారు. వారిని చట్టబద్ధమైన లబ్ధిదారులుగా చేయాలని, ఇది సులభమని వివరిస్తున్నారు. రెండో అంశం.. ప్రస్తుతం వారసత్వం అనేది వీలునామా ద్వారా లేదా మరణించిన వ్యక్తి పుట్టిన సమయంలో అతని మతానికి వర్తించే వారసత్వ చట్టాలను అమలు చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇది దీర్ఘకాలంగా సాగే ఖరీదైన ప్రక్రియ కావటంతో, ప్రత్యేకించి వీలునామా శక్తి తక్కువ కాబట్టి వీటిని నిలిపివేయాలి అని పేర్కొంటున్నారు.

క్లెయిమ్ చేయని నిధులు

ఈ వాదనకు ఆధారం క్లెయిమ్ చేయని డబ్బు. దాదాపు రూ.1,59,000 కోట్లు (డిసెంబర్ 31, 2020 నాటికి) క్లెయిమ్‌ చేయని డబ్బు ఉంది. అందులో ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్(రూ.28,800 కోట్లు), అన్‌క్లెయిమ్డ్‌ మ్యూచువల్ ఫండ్స్(రూ.24,000 కోట్లు), అన్‌క్లెయిమ్డ్‌ కార్పొరేట్ డివిడెండ్‌లు(రూ.5,454 కోట్లు), పీపీఎఫ్‌ ఖాతాల్లో క్లెయిమ్ చేయని మొత్తం (రూ.48,000 కోట్లు), UTI పథకాలలో (రూ. 11,700 కోట్లు), బ్యాంకు ఖాతాల్లో క్లెయిమ్ చేయని మొత్తం (రూ.25,860కోట్లు), అన్‌క్లెయిమ్డ్‌ మెచ్యూర్డ్ ఇన్సూరెన్స్‌ పాలసీలు (రూ.15,166 కోట్లు)గా ఉన్నాయి.

ఈ మొత్తాలను క్లెయిమ్ చేయకపోవడానికి నామినీ లేకపోవడం కూడా ఒక కారణం. ఇతర కారణాలలో నామినేషన్ లేకపోవడం, యజమాని కంటే ముందుగా నామినీ మరణించడం, యజమాని లేదా నామినీ అడ్రస్‌ల మార్పు తదితర కారణాలు ఉన్నాయి. క్లెయిమ్ చేయని మొత్తాల పరిమాణం ఎక్కువగా ఉందనే కారణంతో అదంతా నామినీలకు ఇవ్వాలనే వాదన సరికాదు.

సెబీ, ఆర్‌బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

2016 సెప్టెంబర్‌లో ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీని స్థాపించక ముందు.. డివిడెండ్‌లు, షేర్‌ల కోసం క్లెయిమ్‌లు వెల్‌ సెటిల్డ్‌, సిస్టమ్‌ బేస్డ్‌ ప్రక్రియ ద్వారా జరిగాయి. అందులో డీమ్యాట్ షేర్లు 97 శాతానికి దగ్గరగా ఉన్నాయి. ఇటీవల నవంబర్ 3, డిసెంబర్ 14, 2021 SEBI మార్గదర్శకాలు .. KYC, అల్లైడ్‌ కాంప్లియన్సెస్‌ ప్రోత్సాహకరమైన ఫలితాలను అందించింది.

2005 జూన్ 9 నాటి RBI మాస్టర్ సర్క్యులర్‌.. క్లెయిమ్‌(Claim) సెటిల్‌మెంట్‌ ప్రొసీజర్‌ తీసుకొచ్చింది. ఇది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949, సెక్షన్‌ 45 ZA నుంచి 45 ZFతో ముడిపడి ఉంటుంది. దీని ద్వారా నామినీకి క్లెయిమ్ డిశ్చార్జ్ అనేది పటిష్ఠ పద్ధతిలో జరుగుతుంది. ఈ పనులను కాంట్రాక్ట్ గోప్యత కారణంగా బ్యాంకులు పూర్తి చేయాలి. ఆ తర్వాత, డబ్బు సరైన చట్టపరమైన వారసులకు చేరేలా చూసుకోవడం నామినీ బాధ్యత.

ఇదీ చదవండి: Technical Bugs: వామ్మో.. ఆ అమెరికా కంపెనీ సాఫ్ట్ వేర్ లో బగ్.. రెచ్చిపోతున్న హ్యాకర్లు !


వీలునామా ప్రామాణికతను బ్యాంకులు నిర్ధారించలేవు కాబట్టి, మరణించిన ఖాతాదారు సూచించిన నామినీని బ్యాంక్(Bank) గుర్తిస్తుంది. నామినీకి డబ్బును అందజేయడం ద్వారా, బ్యాంక్ ఒక విధంగా.. మీకు డబ్బును అందజేస్తున్నాం, వీలునామాలో పేర్కొన్న దాని ప్రకారం చట్టబద్ధమైన వారసులకు అప్పగించడం మీ పని అని చెబుతుంది. వీలునామా ప్రకారం నామినీ వారసుడు లేదా లబ్ధిదారుడు కాకపోతే, వారసత్వ చట్టాల ప్రకారం అతను/ఆమె ఆదాయాన్ని చట్టబద్ధమైన వారసులకు అప్పగించాలి. 10 సంవత్సరాల పాటు పనిచేయని ఖాతాలలోని డబ్బు డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (DEAF)కి బదిలీ అవుతుంది.

ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లు

ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ల విషయంలో.. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడంలో సమర్థతను నివేదించింది. థర్డ్-పార్టీ అడ్మినిస్ట్రేటర్‌లు(TPA) కీలక పాత్ర పోషించారు.

నామినీలు చట్టబద్ధమైన వారసులయ్యే ప్రమాదాలు

ఓ వృద్ధుల జంటను ఉదాహరణగా తీసుకుంటే.. వారిలో ఎవరో ఒకరిని నామినీగా గుర్తించి ఉండవచ్చు. అయితే, వీలునామాలో లేదా వారసత్వ చట్టాల ప్రకారం కూడా, వారి పిల్లలను వారసులుగా పేర్కొని ఉంటే.. వారే లబ్ధిదారులు అవుతారు. ఇక్కడ, ఒక నామినేషన్ కేవలం కొన్ని పరిపాలనా అవసరాలను తీర్చడానికి మాత్రమే ఉంటుంది. నామినీలు యజమానులుగా మారితే, పిల్లలకు నష్టం కలుగుతుంది.

పై సందర్భంలో, దంపతులు తమ ఎస్టేట్ మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు లేదా ఛారిటీకి విరాళంగా ఇవ్వాలనుకుంటే, అది సంస్థలు/ NGOల వల్ల సాధ్యం కాదు. ఇలాంటి సంస్థలను నామినీలుగా నమోదు చేయలేరు. నామినీ తప్పనిసరిగా లబ్ధిదారుగా మారాలని సూచించడం దారుణం. నామినేషన్ అనేది వారసత్వం కోసం ఒక ఏర్పాటు కావచ్చు. నామినీ ఏ విధంగానూ లబ్ధిదారుని లేదా యజమాని స్థానాన్ని పొందలేరు.

Published by:Mahesh
First published:

Tags: Banks, Claim, Nominee, Rbi

ఉత్తమ కథలు