Home /News /business /

DO YOU KNOW THE BENEFITS OF FILING INCOME TAX RETURNS EARLIER OR EARLIER THAN THE STIPULATED DEADLINE PRV GH

IT Return: పన్ను చెల్లిస్తున్నారా? అయితే సకాలంలో పన్ను చెల్లిస్తే కలిగే టాప్ 5 బెనిఫిట్స్ ఇవే.. తెలుసుకోండి  

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిర్దేశించిన చివరి గడువు కంటే ముందస్తుగా లేదా సకాలంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఆస్వాదించొచ్చు. ఆ ప్రయోజనాల్లో ఐదు ఉత్తమ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

చాలా మంది పన్ను (Tax) చెల్లింపుదారులు ప్రతియేటా ప్రభుత్వం చెప్పిన సమయానికి పన్ను రిటర్నుల (Income tax returns)ను దాఖలు చేస్తుంటారు. కొందరు మాత్రం ఐటీ రిటర్న్‌ను దాఖలు చేయకుండా చివరి నిమిషం వరకూ వాయిదా వేస్తుంటారు. నిజానికి నిర్దేశించిన చివరి గడువు కంటే ముందస్తుగా లేదా సకాలంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల చాలా ప్రయోజనాలు (benefits) ఆస్వాదించొచ్చు. ఆ ప్రయోజనాల్లో ఐదు ఉత్తమ ప్రయోజనాలు (best benefits) ఏమిటో ఇప్పుడు చూద్దాం. కొత్త టాక్స్ ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక లోపాల (technical problems) కారణంగా ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖల గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించిందని పన్ను చెల్లింపుదారులు గమనించాలి.

సకాలంలో ఐటీఆర్ (IT Return) దాఖలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:

1. వడ్డీ ఆదా..

సకాలంలో ఐటీఆర్ (ITR) ని దాఖలు చెయ్యని పక్షంలో పన్నుపై వడ్డీ (interest) చెల్లించాల్సి వస్తుంది. 234A, 234B సెక్షన్ల లోని నిబంధనల ప్రకారం మీరు ఐటీఆర్ ని సకాలంలో దాఖలు చేస్తే, చెల్లించాల్సిన పన్నుపై వర్తించే వడ్డీని ఆదా చేసుకోవచ్చు. ఐటీఆర్ ఆలస్యంగా దాఖలు చేసే పన్ను చెల్లింపుదారుల నుంచి ప్రభుత్వం ఆలస్య రుసుము (late fee) వసూలు చేస్తుంది. ఇన్‌కమ్ టాక్స్ రూల్ (Income tax rule) ప్రకారం, పన్ను చెల్లింపుదారులు ముందస్తుగా పన్ను చెల్లించకపోయినా.. లేదా చెల్లించాల్సిన పన్నులో 90% కంటే తక్కువ చెల్లించినా.. సెక్షన్ 234B కింద నెలకు 1% లేదా కొంత భాగానికి వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ అనేది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేంతవరకు చెల్లిస్తూనే ఉండాలి.

2. రూ. 10 వేల వరకు జరిమానా (fine) నుంచి తప్పించుకోవచ్చు..

ఆలస్యమైన ఐటీఆర్ (Late ITR) ని దాఖలు చేయడానికి అదనంగా రుసుము (extra fine) చెల్లించాల్సి ఉంటుంది. గడువు తేదీ తర్వాత ఐటీఆర్ దాఖలు చేసిన వారు ఇన్‌కమ్ టాక్స్ నిబంధనల ప్రకారం రూ. 10 వేల వరకు జరిమానా కట్టాల్సి రావచ్చు.

3. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసును నివారించొచ్చు..

గడువు తేదీకి ముందు ఐటీఆర్ దాఖలు చేయని పక్షంలో ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు పంపవచ్చు. ఇది కొత్త తలనొప్పులకు దారితీస్తుంది. కాబట్టి ముందస్తుగా ఐటీఆర్ ఫైల్ చేసి ప్రశాంతంగా ఉండటం ఉత్తమం.

4. రుణాలు వెంటనే పొందొచ్చు..

ఐటీఆర్ సకాలంలో దాఖలు చేసేవారికి రుణాలు చాలా వేగంగా మంజూరవుతాయి. ఎందుకంటే మీరు రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు.. బ్యాంకులు ఇన్‌కమ్ స్టేట్‌మెంట్ ప్రూఫ్ గా మీ ఐటీఆర్ స్టేట్‌మెంట్ కాపీని అందించాలని కోరుతాయి. ఒకవేళ అందించకపోతే లోన్ అప్రూవల్ ఆలస్యమవుతుంది. రుణాలు మంజూరు కావడానికి సబ్మిట్ చేయాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఐటీఆర్ నివేదిక కూడా ఒకటి అనేది చెల్లింపుదారులు గుర్తుంచుకోవాలి. మీరు భవిష్యత్తులో రుణం పొందాలని భావిస్తే.. మీ రిటర్నులను సకాలంలో దాఖలు చేసుకోండి.

5. నష్టాలను తదుపరి సంవత్సరాలకి వాయిదా వేయొచ్చు..

ఇన్‌కమ్ టాక్స్ నిబంధనల ప్రకారం, గడువు తేదీకి ముందు ఐటీఆర్ ని దాఖలు చేయడం ద్వారా మీ నష్టాలను తదుపరి సంవత్సరాలకు కూడా పొడిగించవచ్చు. భవిష్యత్తులో మీ ఆదాయంపై పన్ను భారం తగ్గించడంలో ఈ నిబంధన మీకు బాగా సహాయం చేస్తుంది. ఈ 5 ప్రయోజనాలతో పాటు ఐటీఆర్ ని ముందస్తుగా దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులు ఇతరులకన్నా వేగంగా ఇన్‌కమ్ టాక్స్ రిఫండ్ పొందుతారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: BUSINESS NEWS, Income tax, TAX SAVING

తదుపరి వార్తలు