Gold sales: కరోనా ఎఫెక్ట్.. బంగారాన్ని అమ్ముకుంటున్న ప్రజలు.. ఏ స్థాయిలో అంటే..

ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టి ప్రజల ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో సామాన్యులు కష్టపడి కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలను సైతం విక్రయించాల్సి వస్తుంది.

  • Share this:
మనదేశంలో ఎంతో మందికి బంగారం అంటే అమితమైన ఇష్టం. ఆశలన్నీ నీరు గారినప్పుడు తప్ప పసిడిని విక్రయించాలనే ఆలోచన రాదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలే అతిపెద్ద బంగారం కొనుగోలుదారులు. కోవిడ్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టి ప్రజల ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో సామాన్యులు కష్టపడి కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలను సైతం విక్రయించాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంత ప్రజలు డబ్బు కోసం బంగారంపైనే ఎక్కువగా ఆధారపడతారు. బ్యాంకుల్లో పసిడిని పెట్టి సులభంగా రుణం పొందుతారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో ప్రజలు ఆభరణాలను అమ్ముకుంటున్నారని లండన్ మెటల్స్ ఫోకస్‌కు చెందిన కన్సల్టెంట్ చిరాగ్ శేత్ అన్నారు. కొత్త వేవ్ వచ్చేసరికి నూతన డిజైన్లను రూపొందించడానికి పాత బంగారాన్ని కరిగించిన స్థూల స్క్రాప్ సరఫరా 215 టన్నులకు చేరుకుందని, ఇది తొమ్మిదేళ్ల గరిష్ఠానికి చేరిందని ఆయన అన్నారు.

ఇప్పటికే గతేడాది ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోగా.. బంగారు రుణాల సమస్యలు వేధిస్తున్నాయని, రెండో వేవ్ వల్ల ఆ పరిస్థితి మరింత దిగజారిందని చిరాగ్ అభిప్రాయపడ్డారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో రానున్న మూడో వేవ్ ప్రభావంతో లాక్డౌన్లు, ఉద్యోగ నష్టాలు పెద్ద మొత్తంలో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. లాక్డౌన్లు ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో పాటు పేదరికం నుంచి బయటపడిన చాలా మందిని భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోనేలా చేస్తున్నాయి. 200 మిలియన్ల మందికిపైగా ప్రజలు రోజుకు కనీసం వేతనం 5 డాలర్ల కంటే తక్కువ సంపాదిస్తున్నారు.

దేశంలోని అతిపెద్ద బంగారు రుణ సంస్థల్లో ఒకటైన మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ మార్చి నుంచి మూడు నెలల్లో రూ. 4.04 బిలియన్ల విలువ కలిగిన బంగారాన్ని వేలం వేసింది. ఇది 9 నెలల ముందు వేలం వేసిన రూ.80 మిలియన్ల కంటే ఎంతో ఎక్కువ. ఈ నగలు సాధారణ రోజువారీ వేతనాలు పొందేవారు, రైతు కులీలకు చెందినవి. వీరందరూ మనప్పురం నుంచి రుణాన్ని తీసుకున్న గ్రహీతలు.

రెండేళ్లుగా తగ్గుదల..
దక్షిణ భారతదేశంలో దేశంలో పాత బంగారు ఆభరణాల విక్రయాలు 25 శాతం పెరిగాయని కొచ్చికి చెందిన రిఫైనర్ సీజీఆర్ మెటల్లోయిస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ జేమ్స్ జోస్ తెలిపారు. లాక్డౌన్ తర్వాత వివాహ సీజన్ కు సంబంధించి కొనుగోళ్లు, నగదు కోసం కొంత మొత్తంలో లిక్విడేషన్ చేశారని ఆయన అన్నారు. బలహీన ఆర్థిక వ్యవస్థ కారణంగా భారత్ లో చాలా మంది గత రెండేళ్లుగా బంగారం కొనుగోళ్లను తగ్గించుకుంటున్నారు. వైరస్ వ్యాప్తి వారి ఖర్చు శక్తిని తగ్గిస్తుంది. 2020లో బంగారం అమ్మకాలు రెండు దశాబ్దాలకుపైగా పడిపోయాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
Published by:Kishore Akkaladevi
First published: