• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • DO YOU KNOW MEANING OF 10 DIGIT PAN CARD NUMBER KNOW ABOUT THAT SECRET CODE SS

PAN Card: పాన్ కార్డ్‌లోని 10 డిజిట్స్‌కి అర్థం ఏంటో తెలుసా?

PAN Card: పాన్ కార్డ్‌లోని 10 డిజిట్స్‌కి అర్థం ఏంటో తెలుసా?

PAN Card: పాన్ కార్డ్‌లోని 10 డిజిట్స్‌కి అర్థం ఏంటో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

PAN Card | ఓసారి మీ పాన్ కార్డ్ చెక్ చేయండి. అందులో ఉన్న 10 డిజిట్స్‌కి అర్థం తెలుసా? ఆ అర్థం ఏంటో తెలుసుకోండి.

  • Share this:
    మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఓసారి అందులో 10 డిజిట్స్‌ని గమనించండి. అందులో ఇంగ్లీష్ లెటర్స్, నెంబర్స్ ఉంటాయి. అసలు ఆ డిజిట్స్ ఎందుకు అలా ఉంటాయో చాలామందికి తెలియదు. అందులోని డిజిట్స్‌ ఓ ఫార్మాట్ ప్రకారం ఉంటాయన్న విషయం చాలామందికి తెలియదు. అసలు పాన్ కార్డ్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. PAN అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఆర్థిక లావాదేవీలు జరిపే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాల్సిన కార్డు ఇది. ప్రతీ ఒక్కరికీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఈ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఒకేసారి జారీ అవుతుంది. ఇక ఎప్పటికీ అదే నెంబర్ ఉంటుంది. ఒకవేళ కార్డు పోయినా తిరిగి అప్లై చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది. అందుకే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటారు. భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా పాన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. ట్యాక్స్‌కు సంబంధించిన ఏ లావాదేవీ అయినా పాన్ నెంబర్ ఉండాల్సిందే.

    Money Transfer: పొరపాటున డబ్బులు వేరే అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇలా చేయండి

    iPhone: ఆన్‌లైన్‌లో యాపిల్స్ ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో యాపిల్ ఐఫోన్ వచ్చింది

    ఇక పాన్ కార్డులో 10 డిజిట్స్ ఉంటాయని తెలుసు. అందులో మొదటి ఐదు, చివర్లో ఒక ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి. 6 నుంచి 9 వరకు నెంబర్స్ ఉంటాయి. మొదటి మూడు ఇంగ్లీష్ లెటర్స్ పాన్ కార్డ్ సిరీస్‌ను సూచిస్తుంది. ఈ సిరీస్ AAA నుంచి ZZZ వరకు ఏదైనా ఉండొచ్చు. ఇక నాలుగో లెటర్ పాన్ కార్డ్ తీసుకున్నవారి స్టేటస్‌ని తెలుపుతుంది. అంటే వ్యక్తిగతంగా పాన్ కార్డ్ తీసుకునేవారికి నాలుగో లెటర్ P ఉంటుంది. P అంటే పర్సనల్ అనుకోవచ్చు. వ్యక్తిగతంగా పాన్ కార్డు తీసుకున్నవారెవరికైనా నాలుగో లెటర్ P అనే ఉంటుంది. ఒకవేళ ట్రస్ట్ తరఫున తీసుకుంటే T, సంస్థ తరఫున తీసుకుంటే F, హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ తరఫున తీసుకుంటే H, కంపెనీ తరఫున తీసుకుంటే C అని ఉంటాయి.

    LIC Bima Jyoti: చెల్లించే ప్రీమియంకు డబుల్ బెనిఫిట్ అందించే ఎల్ఐసీ పాలసీ

    ATM Cash Withdrawal: ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలా? కార్డు అవసరం లేదు

    ఇక ఐదో లెటర్ పాన్ కార్డ్ హోల్టర్ ఇంటిపేరు లేదా చివరి పేరులో మొదటి అక్షరం ఉంటుంది. సర్‌నేమ్‌లో మొదటి లెటర్ ఏది ఉంటే పాన్ కార్డులో ఐదో లెటర్ అదే ఉంటుంది. ఇక ఆ తర్వాత వచ్చే నాలుగు అంకెలు 0001 నుంచి 9999 మధ్య ఉంటాయి. చివర్లో లెటర్ A నుంచి Z వరకు ఏదో ఒకటి ఉంటుంది. ఈ చివరి డిజిట్‌ను పాన్ నెంబర్ జారీ చేసే సమయంలో కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. ఇలా 10 డిజిట్ ఆల్ఫాన్యూమరిక్ నెంబర్‌తో పాన్ కార్డ్ జారీ అవుతుంది. పాన్ కార్డు పైన ఉంటే ఈ 10 డిజిట్స్ వెనక ఉన్న ఆసక్తికర విషయం చాలామందికి తెలియదు. మరి మీరు కూడా మీ పాన్ నెంబర్ ఓసారి చెక్ చేసుకోండి.
    Published by:Santhosh Kumar S
    First published: