Home /News /business /

DO YOU KNOW HOW MANY USES MULTIPLE CREDIT CARDS HAVE LOOK UMG GH

Credit Cards: మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయా..? అయితే మీరు లక్కీనే.. ఎందుకో ఇక్కడో లుక్కేయండీ..!

ఎక్కువ క్రెడిట్ కార్డుల వల్ల ఉపయోగాలా ? నష్టాలా ?

ఎక్కువ క్రెడిట్ కార్డుల వల్ల ఉపయోగాలా ? నష్టాలా ?

క్రెడిట్ కార్డ్‌లను(Credit Cards) సక్రమంగా వినియోగించుకుంటే చాలా బెనిఫిట్స్‌ (Benefits) పొందవచ్చు. అయితే అసలు ఒక వ్యక్తి ఎన్ని క్రెడిట్‌ కార్డ్‌లు వినియోగిస్తే మంచిది? ఆ సంఖ్యను ఎలా నిర్ణయించుకోవాలి? వంటి వివరాలు తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డ్‌లను(Credit Cards) సక్రమంగా వినియోగించుకుంటే చాలా బెనిఫిట్స్‌ (Benefits) పొందవచ్చు. ట్రాన్సాక్షన్‌లపై బెస్ట్ డిస్కౌంట్‌ (Discount)లను అందించే ఫైనాన్షియల్‌ ప్రొడక్ట్‌గా క్రెడిట్‌ కార్డ్‌లను వాడుకోవచ్చు. రోజువారీ ఖర్చు(Cost)పై డబ్బు ఆదా చేయడంలో ఇవి సహాయపడతాయి. ఒక క్రెడిట్ కార్డ్ అన్ని చెల్లింపు అవసరాలను తీర్చగలిగినప్పటికీ, కొన్నిసార్లు, నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ఒకటి కంటే ఎక్కువ కార్డ్‌లు అవసరం కావచ్చు. ప్రజలు ఎన్ని కార్డ్‌లను ఉపయోగిస్తే మంచిది? వీటి వాడకం వల్ల ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది? అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలో అసలు ఒక వ్యక్తి ఎన్ని క్రెడిట్‌ కార్డ్‌లు వినియోగిస్తే మంచిది? ఆ సంఖ్యను ఎలా నిర్ణయించుకోవాలి? వంటి వివరాలు తెలుసుకుందాం.


* ఒక కార్డ్‌ మాత్రమే ఉంటే..
మొదటి సారి క్రెడిట్‌ కార్డ్‌ వినియోగిస్తున్న వారికి క్రెడిట్ హిస్టరీ ఉండకపోవచ్చు. ఆదాయం, ఖర్చుల ఆధారంగా ప్రత్యేకమైన లేదా ప్రీమియం క్రెడిట్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లేకపోవచ్చు. అటువంటి సందర్భాలలో, ముందుగా ఆదాయం, ఖర్చు అవసరాల ఆధారంగా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలి. ఈ కార్డ్‌ని క్రమం తప్పకుండా ఉపయోగించాలి. మంచి క్రెడిట్ స్కోర్‌ కోసం బిల్లును సకాలంలో తిరిగి చెల్లించాలి. ఇలా చేయడం ద్వారా చివరికి మరిన్ని బెనిఫిట్స్‌ అందించే హైయర్‌ కేటగిరీ క్రెడిట్ కార్డ్‌ను పొందడానికి అర్హత పొందుతారు.

ఇదీ చదవండి: Govt Jobs with 10th: టెన్త్ పాసయ్యారా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు పదవ తరగతి చాలు


* మల్టిపుల్‌ క్రెడిట్ కార్డ్స్‌ బెనిఫిట్స్
ప్రతి క్రెడిట్ కార్డుకు ప్రత్యేక ఫీచర్లు, బెనిఫిట్స్‌ ఉంటాయి. ఉదాహరణకు ఒక క్రెడిట్ కార్డ్ ప్రయాణ టిక్కెట్ బుకింగ్‌పై డిస్కౌంట్‌లను అందిస్తుంటే.. మరొక క్రెడిట్ కార్డ్ ఆన్‌లైన్ షాపింగ్ లేదా మల్టిపుల్‌ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ సౌకర్యంపై డిస్కౌంట్‌ను అందించే అవకాశం ఉంది. అటువంటి బెనిఫిట్స్‌ను ఉపయోగించుకోవడానికి మల్టిపుల్‌ క్రెడిట్‌కార్డ్‌లు అవసరం. ఒక క్రెడిట్‌ కార్డ్‌ మాత్రమే వినియోగిస్తుంటే అన్ని రకాల బెనిఫిట్స్‌ పొందే అవకాశం ఉండదు.

Bankbazaar.com సీఈవో ఆదిల్ శెట్టి మాట్లాడుతూ.. ‘మల్టిపుల్‌ క్రెడిట్ కార్డ్‌లు ఉండటం ద్వారా ఎక్కువ క్రెడిట్‌ లిమిట్‌ లభిస్తుంది. అధిక మొత్తం క్రెడిట్ పరిమితిని పొందవచ్చు. క్రెడిట్ కార్డ్‌లలో ఒకదానిపై పరిమితి అయిపోయినట్లయితే, మరొక క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. మల్టిపుల్‌ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు, ఖర్చులను అన్నింటికీ డివైడ్‌ చేయవచ్చు. క్రెడిట్ వినియోగ నిష్పత్తిని సులభంగా తగ్గించవచ్చు, తద్వారా క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. వేర్వేరు గడువు తేదీలతో క్రెడిట్ కార్డ్‌లను పొందవచ్చు, గరిష్ట వడ్డీ రహిత క్రెడిట్ వ్యవధి ప్రయోజనాన్ని ఆస్వాదించడానికి స్టేట్‌మెంట్ తేదీ ముగిసిన క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించవచ్చు.’ అని చెప్పారు.

* మల్టిపుల్‌ కార్డ్‌లను ఎంచుకోవడం ఎలా?
ఆర్థిక అలవాట్లు, జీవనశైలి ఆధారంగా మల్టిపుల్‌ క్రెడిట్ కార్డ్‌లను ఎంచుకోవచ్చు. ఖర్చు విధానం ప్రకారం కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను పొందవచ్చు. ఉదాహరణకు, తరచుగా విమానంలో ప్రయాణిస్తుంటే, ఎయిర్ మైల్స్ క్రెడిట్ కార్డ్‌ని పొందవచ్చు, క్రమం తప్పకుండా హోటళ్లలో ఉంటే, ట్రావెల్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తరచుగా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తుంటే, షాపింగ్ క్రెడిట్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం వన్-టైమ్ ఖర్చులను కవర్ చేయడానికి కార్డ్‌లను తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వాటిని Amex, Visa, Rupay, Mastercard మొదలైన విభిన్న సంస్థల నుంచి పొందవచ్చు. ఈ ప్లాన్‌ మల్టిపుల్‌ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను పొందడంలో సహాయపడుతుంది.



* ఎన్ని కార్డ్‌లు ఉండవచ్చు?
కార్డ్‌ల సంఖ్య ఒకరి ఖర్చు, ఆర్థిక అలవాట్లు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. అయితే యూజర్లకు మల్టిపుల్‌ కార్డ్‌లను నిర్వహించే సామర్థ్యం ఉండాలి.
Published by:Mahesh
First published:

Tags: Credit card, Credit score, Debit cards, Personal Loan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు