హోమ్ /వార్తలు /బిజినెస్ /

Life Insurance: అసలు లైఫ్ ఇన్సూరెన్స్‌లు ఎన్ని రకాలు.. ఎప్పుడైనా ఆలోచించారా ?.. పూర్తి వివరాలు

Life Insurance: అసలు లైఫ్ ఇన్సూరెన్స్‌లు ఎన్ని రకాలు.. ఎప్పుడైనా ఆలోచించారా ?.. పూర్తి వివరాలు

తొలి దశ అమ్మకంలో భాగంగా ఎల్ఐసీలోని 31.6 కోట్ల ప్రభుత్వ షేర్ల‌ను అంటేఐదు శాతం వాటాల‌ను ఐపీవో ద్వారా విక్ర‌యిస్తామ‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ప‌బ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) కార్య‌ద‌ర్శి తుహిన్ కాంతా పాండే ట్వీట్ ద్వారా తెలిపారు.

తొలి దశ అమ్మకంలో భాగంగా ఎల్ఐసీలోని 31.6 కోట్ల ప్రభుత్వ షేర్ల‌ను అంటేఐదు శాతం వాటాల‌ను ఐపీవో ద్వారా విక్ర‌యిస్తామ‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ప‌బ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) కార్య‌ద‌ర్శి తుహిన్ కాంతా పాండే ట్వీట్ ద్వారా తెలిపారు.

కరోనా తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే వారి సంఖ్య 30 శాతం పెరిగిందని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి. జీవిత బీమా అంటే.. పాలసీదారుడు చనిపోయిన తర్వాత వచ్చే డబ్బులు అని చాలా మంది భావిస్తుంటారు. కానీ బతికున్న సమయంలోనే మెచ్యూరిటీ బెనిఫిట్స్ కూడా పొందొచ్చని మీకు తెలుసా..?

ఇంకా చదవండి ...

జీవిత బీమా అనగానే చులకనగా చూసే ప్రజలు ఇప్పటికీ ఉన్నారా అని ప్రశ్నిస్తే.. లేరనే సమాధానమే టక్కున వినిపిస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా జీవిత బీమా విలువ ప్రతి ఒక్కరికీ తెలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. కరోనా తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే వారి సంఖ్య 30 శాతం పెరిగిందని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి. తాము చనిపోయినా.. తమ కుటుంబానికి ఇన్సూరెన్స్ ఆసరాగా నిలవాలని చాలామంది భావిస్తున్నారు. జీవిత బీమా అంటే.. పాలసీదారుడు చనిపోయిన తర్వాత వచ్చే డబ్బులు అని చాలా మంది భావిస్తుంటారు. కానీ బతికున్న సమయంలోనే మెచ్యూరిటీ బెనిఫిట్స్ కూడా పొందొచ్చని మీకు తెలుసా..? నిజానికి వివిధ రకాల జీవిత బీమా పాలసీల ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఆ ప్రయోజనాలు ఎలా పొందాలో తెలుసుకుందాం.

1. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్:

జీవిత బీమా తీసుకున్న పాలసీదారుడు అకాలంగా మరణించినప్పుడు, లబ్ధిదారునికి పాలసీ ప్రయోజనాలు దక్కుతాయి. అయితే ఈ పాలసీ హామీలో ఒక మినహాయింపు ఉంటుంది. అదేంటంటే పాలసీ గడువు తీరిపోతే.. బీమా సంస్థ లబ్ధిదారునికి డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత వహించదు.

2. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్:

హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే.. పాలసీదారుడు చనిపోయేంతవరకు యాక్టివ్ గా ఉంటుంది. ఒకవేళ పాలసీదారుడు చనిపోతే నామినీ లేదా లబ్ధిదారునికి మొత్తం హామీ లభిస్తుంది. లబ్ధిదారునికి బోనస్‌ల రూపంలో డబ్బు లభించే అవకాశం ఉంటుంది.

3. పిల్లల ఇన్సూరెన్స్ పాలసీ:

ఇదే పాలసీని చైల్డ్ ప్లాన్ అని కూడా పిలుస్తుంటారు. బీమా కవరేజ్ తో పాటు పిల్లల భవిష్యత్తు కోసం ఈ పాలసీని ఎక్కువమంది తీసుకుంటారు. పిల్లల ఉన్నత చదువుల కోసం, ఇతర అవసరాల కోసం ఆర్ధిక ప్రయోజనాలు పొందేందుకు ఈ పాలసీ తీసుకోవచ్చు.

4. పెన్షన్ ఇన్సూరెన్స్ ప్లాన్:

ఇన్సూరెన్స్ పాలసీలలో పెన్షన్ ప్లాన్ కూడా ఉంటుంది. పెన్షన్ ప్లాన్ పదవి విరమణ తర్వాత పాలసీదారుడికి సహాయపడుతుంది. ఈ పాలసీ తీసుకున్న పాలసీదారుడికి ప్రతి ఏటా లేదా 60 సంవత్సరాలు నిండిన తర్వాత ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాదారుడికి ఎలా ప్రయోజనాలు లభిస్తాయో ఈ పెన్షన్ ప్లాన్ ద్వారా కూడా అలాంటి ప్రయోజనాలే లభిస్తాయి. ఈ పాలసీ గడువు తీరిపోయిన తర్వాత కూడా లబ్ధిదారులు లేదా బీమా చేసినవారు మెచ్యూరిటీ ప్రయోజనాలను పొందవచ్చు. బేసిక్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో ఇలాంటి ప్రయోజనాలు పొందలేము.

5. ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్:

ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ అనేది పొదుపు పథకం, జీవిత బీమా పాలసీగా పనిచేస్తుంది. ఈ ప్లాన్ ద్వారా పాలసీదారుడు ఒక నిర్ణీత సమయం వరకు క్రమం తప్పకుండా పొదుపు చేయొచ్చు. అదే సమయంలో జీవిత బీమా కూడా పొందవచ్చు. బీమా పాలసీని మించి పాలసీదారుడు బతికితే, వారు మెచ్యూరిటీ ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు.

6. యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్:

ఈ పాలసీ తీసుకునేవారి డబ్బులో కొంత భాగాన్ని ఆదా చేసి.. దాన్ని లైఫ్ కవరేజ్ కోసం ఉంచుతారు. మిగిలిన భాగం డబ్బులను మార్కెట్ సాధనాలలో పెట్టుబడిగా పెడతారు. దీనివల్ల పాలసీదారుడికి రాబడితో పాటు కవరేజ్, పొదుపు డబ్బులు అందుతాయి.

Lizards: బల్లులతో ప్రమాదం.. వాటిని ఇంట్లో నుంచి తరిమేయండి ఇలా..

Walking: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు.. అదే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి

కీలక పదవి ఆ ముగ్గురిలో ఎవరికి ? KCR మనసులో ఉన్నదెవరు..? ట్విస్ట్ ఉంటుందా ?

Banana: అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతాయా ?.. ఇందులో నిజమెంత ?

7. మనీ-బ్యాక్ ఇన్సూరెన్స్ ప్లాన్:

జీవిత బీమా కవరేజ్ తో పాటు ద్రవ్యత ప్రయోజనాలను కూడా పొందాలనుకునేవారికి.. మనీ-బ్యాక్ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. ఇది పాలసీదారులకు వారి కట్టిన డబ్బులోని కొంత శాతాన్ని తిరిగి ఇస్తుంది. ఒక నిర్దిష్ట కాలం పాటు ఈ విధంగా డబ్బులు పొందవచ్చు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Life Insurance

ఉత్తమ కథలు