హోమ్ /వార్తలు /బిజినెస్ /

ITR Filing: టీడీఎస్ గురించి మీకు తెలుసా ? ఫిక్స్‌డ్ డిపాజిట్లపై TDSను ఎలా లెక్కించాలో తెలుసుకోండి..

ITR Filing: టీడీఎస్ గురించి మీకు తెలుసా ? ఫిక్స్‌డ్ డిపాజిట్లపై TDSను ఎలా లెక్కించాలో తెలుసుకోండి..

 టీడీఎస్ గురించి మీకు తెలుసా ? ఫిక్స్‌డ్ డిపాజిట్లపై TDSను ఎలా లెక్కించాలో తెలుసుకోండి..

టీడీఎస్ గురించి మీకు తెలుసా ? ఫిక్స్‌డ్ డిపాజిట్లపై TDSను ఎలా లెక్కించాలో తెలుసుకోండి..

ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) హోల్డర్ తమ పెట్టుబడిపై టీడీఎస్‌(TDS) క్లెయిమ్ చేయడానికి ఐటీఆర్‌ని తప్పనిసరిగా ఫైల్ చేయాలి. ఇండియన్‌ రెసిడెంట్స్‌కు ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయంపై 10 శాతం టీడీఎస్‌ వర్తిస్తుంది.

2022 ఆర్థిక సంవత్సరం (అసెస్‌మెంట్ ఇయర్‌ 2022-23) ఆదాయ పన్ను రిటర్న్(ITR) దాఖలు చేయడానికి గడువు సమీపిస్తోంది. ఎటువంటి జరిమానా(Fine) లేకుండా ఐటీఆర్‌ ఫైల్‌ చేయడానికి ఇంకా మూడు రోజులే ఉన్నాయి. జులై 31, ఆదివారంతో గడువు ముగుస్తుంది. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) హోల్డర్ తమ పెట్టుబడిపై టీడీఎస్‌(TDS) క్లెయిమ్ చేయడానికి ఐటీఆర్‌ని తప్పనిసరిగా ఫైల్ చేయాలి. ఇండియన్‌ రెసిడెంట్స్‌కు ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయంపై 10 శాతం టీడీఎస్‌ వర్తిస్తుంది. మెచ్యూరిటీ పీరియడ్‌లో ప్రతి సంవత్సరం చివరిలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ల నుంచి టీడీఎస్‌ డిడక్ట్‌ అవుతుంది. పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌ ఫైల్ చేయడం ద్వారా టీడీఎస్‌ని క్లెయిమ్ చేసుకోవడానికి ఆదాయ పన్ను శాఖ అవకాశం కల్పిస్తుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లపై వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుందని గమనించాలి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల(Fixed deposit) కింద రూ.40,000 కంటే ఎక్కువ వడ్డీ వస్తుంటే 10 శాతం టీడీఎస్‌ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్‌లకు రూ.50,000 కంటే ఎక్కువ వస్తే టీడీఎస్‌ వర్తిస్తుంది. పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌(PAN) వివరాలను బ్యాంకుకు తెలియజేయకుంటే టీడీఎస్‌ రేటు 20 శాతంగా ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ క్లియర్ రిపోర్ట్ ప్రకారం.. టీడీఎస్‌ వడ్డీ క్రెడిట్ సమయంలో డిడక్ట్‌ అవుతుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మెచ్యూర్ అయినప్పుడు కాదని గుర్తుంచుకోవాలి. 3 సంవత్సరాల పాటు ఎఫ్‌డీ ఉంటే.. బ్యాంకులు ప్రతి సంవత్సరం చివరిలో టీడీఎస్‌ డిడక్ట్‌ చేస్తాయి.

ఉదాహరణకు.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై రూ.100 వడ్డీని సంపాదిస్తే.. బ్యాంక్ 10 శాతం టీడీఎస్‌ అంటే రూ.10 డిడక్ట్‌ చేస్తుంది. ప్రభుత్వానికి డిపాజిట్ చేస్తుంది. ఐటీఆర్‌లో వడ్డీ ఆదాయాన్ని పేర్కొనేటప్పుడు.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై లభించిన వడ్డీ రూ.100 చూపించాలి. అదే విధంగా టీడీఎస్‌ రీఫండ్‌గా రూ.10 బ్యాంక్ డిడక్ట్‌ చేసిన మొత్తాన్ని ట్యాక్స్‌ క్రెడిట్‌గా క్లెయిమ్ చేయాలి.

ఇదీ చదవండి: Pink Diamond: 300 ఏళ్ల తర్వాత దొరికిన అతిపెద్ద పింక్ డైమండ్.. దీని విలువ తెలిస్తే మతిపోతుంది.. ఎక్కడ దొరికిందంటే !


 మరొక ఉదాహరణలో.. ఓ వ్యక్తి 20 శాతం పన్ను పరిధిలోకి వస్తాడు అనుకుందాం. సంవత్సరానికి 6 శాతం వడ్డీతో 3 సంవత్సరాల కాలవ్యవధి ఉన్న రూ.1,00,000 విలువైన రెండు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు ఉన్నాయి. మొదటి సంవత్సరంలో.. ఎఫ్‌డీ నుంచి వడ్డీ ఆదాయం రూ.6,000 లభించింది. మొదటి సంవత్సరంలో వచ్చిన మొత్తం వడ్డీ రూ.12,000. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.40,000 కంటే తక్కువ ఉండటంతో బ్యాంక్‌ టీడీఎస్‌ డిడక్ట్‌ చేయదు.

అదే విధంగా.. ఓ వ్యక్తి సంవత్సరానికి 6 శాతం వడ్డీ రేటుతో రూ.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేశాడనుకుందాం. అతడు రూ.60,000 వార్షిక వడ్డీని అందుకుంటున్నాడు. బ్యాంక్ మొత్తం రూ.60,000కి 10 శాతం అంటే రూ.6000 టీడీఎస్‌గా డిడక్ట్‌ చేస్తుంది.

ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం ట్యాక్స్‌ డిడక్షన్స్‌ నుంచి ఎగ్జమ్షన్‌ పొందడానికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ హోల్డర్ ఫారమ్ 15G/15Hని సమర్పించవచ్చు. ఆదాయ పన్ను చట్టం ప్రకారం.. FDల కోసం సెక్షన్ 80C కింద ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల ఎగ్జమన్‌ పొందే అవకాశం ఉంది.

First published:

Tags: Itr deadline, ITR Filing, PAN card, Tax payers, Tds

ఉత్తమ కథలు