హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPFO: రెండు పీఎఫ్ అకౌంట్లు ఉన్నాయా? ఇలా కలిపేయండి

EPFO: రెండు పీఎఫ్ అకౌంట్లు ఉన్నాయా? ఇలా కలిపేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

EPFO | మీ పీఎఫ్ అకౌంట్, యూఏఎన్ నెంబర్ ఇంటర్ లింక్ చేయడం తప్పనిసరి. లేకపోతే ఫండ్ ట్రాన్స్‌ఫర్ కుదరదు.

ఉద్యోగం చేసినన్ని రోజులు నెలనెలా ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు జమ చేస్తూ ఉంటారు ఉద్యోగులు. అత్యవసర సమయాల్లో, ఆపదలో ఆదుకుంటాయి ఈ డబ్బులు. పీఎఫ్ అకౌంట్ల విషయంలో ఉద్యోగులు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం సమస్యల్ని సృష్టిస్తుంది. ఉద్యోగం మారిన ప్రతీసారి కొత్త పీఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేయడం ఉద్యోగులకు అలవాటు. అసలు ఉద్యోగం మారినప్పుడు పాత యూనివర్సల్ అకౌంట్ నెంబర్-UAN ఇవ్వడమే మంచిది. దీని ద్వారా ఒకే అకౌంట్‌లో మీరు ఎన్ని కంపెనీలు మారితే అన్ని కంపెనీల పాస్‌బుక్స్ కనిపిస్తాయి. రెండు యూఏఎన్ నెంబర్స్ ఉండటం వల్ల మీ పాత ప్రావిడెంట్ ఫండ్ ఫ్రీజ్ అయ్యే అవకాశముంది. మీ పాత అకౌంట్ నుంచి ఫండ్స్ కొత్త అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం కూడా ఉండదు. అయితే మీ రెండు యూఏఎన్ నెంబర్స్‌ని విలీనం చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

ముందుగా ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో మీ వివరాలన్నీ అప్‌డేట్ చేయండి. మీ దగ్గర ఉన్న రెండు యూఏఎన్ అకౌంట్లను విలీనం చేయాలనుకుంటున్నట్టు మీ కంపెనీతో పాటు ఈపీఎఫ్‌ఓకు తెలపండి. ఈపీఎఫ్ఓ uanepf@epfindia.gov.in ఇమెయిల్ ఐడీకి మెయిల్ చేయొచ్చు. మీ పాత, కొత్త యూఏఎన్ వివరాలను తెలపాలి. రెండు నెంబర్లను ఈపీఎఫ్ఓ అధికారులు వెరిఫై చేసిన తర్వాత పాత యూఏఎన్ అకౌంట్‌ను బ్లాక్ చేస్తారు. ఆ తర్వాత మీ పాత పీఎఫ్ డిపాజిట్లను కొత్త పీఎఫ్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరుతూ దరఖాస్తు చేయొచ్చు. మీ పీఎఫ్ అకౌంట్, యూఏఎన్ నెంబర్ ఇంటర్ లింక్ చేయడం తప్పనిసరి. లేకపోతే ఫండ్ ట్రాన్స్‌ఫర్ కుదరదు.

ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో 'Employee One EPF account' పైన క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, యూఏఎన్, కంపెనీ ఐడీ వివరాలను ఎంటర్ చేయాలి. తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. మీ పాత ఈపీఎఫ్ వివరాలన్నీ వస్తాయి. మీ పాత పీఎఫ్ అకౌంట్ నుంచి కొత్త పీఎఫ్ అకౌంట్‌లోకి ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌కి అప్లై చేయాలి. ఈపీఎఫ్ఓ వెరిఫికేషన్ తర్వాత పాత పీఎఫ్ అకౌంట్ నుంచి కొత్త పీఎఫ్ అకౌంట్‌లోకి ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ట్రాన్స్‌ఫర్ స్టేటస్ ఈపీఎఫ్ఓ నుంచి మీకు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది.

Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

Budget 2019: స్మార్ట్‌ఫోన్ కొనాలా? రూ.15,000 లోపు టాప్-10 మోడల్స్ ఇవే...

Reliance Jio: జియో యూజర్లకు హాట్‌స్టార్ యాక్సెస్ ఫ్రీ... క్రికెట్ మ్యాచ్‌లు చూడండి ఇలా

PAN Card: ఏఏ ట్రాన్సాక్షన్స్‌కి పాన్ కార్డు అవసరమో తెలుసా?

First published:

Tags: EPFO, Personal Finance