హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: మీకు ఏదైనా సొంత టాలెంట్ ఉందా..? అయితే, ఇంట్లోనే ఉంటూ సంపాదించే ఛాన్స్...

Business Ideas: మీకు ఏదైనా సొంత టాలెంట్ ఉందా..? అయితే, ఇంట్లోనే ఉంటూ సంపాదించే ఛాన్స్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas: ఈ కరోనా తెచ్చిన మార్పులతో చాలా మంది తమ ఆలోచన ధోరణిని మార్చుకుంటున్నారు. ఉద్యోగం చేయడం కన్నా వ్యాపారమే మేలు అనుకుంటున్నారు. అలాంటి వారు కొత్త కొత్త బిజినెస్ ఐడియాల కోసం చూస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ ఐడియాను తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

మీరు కళాకారులా (Artists)... బొమ్మలు బాగా తయారుచేస్తారా... లేక... పెయింటింగ్స్(Paintings)  వేస్తారా... అదీ కాదంటే... వంటలు (Cook) బాగా చెయ్యగలరా... పోనీ... నగలు (Jewellery) తయారుచెయ్యడంలో తిరుగులేదా... ఇలా మీకు ఏదైనా సొంత టాలెంట్ ఉంటే... మీరు ఇంట్లోనే ఉంటూ... డబ్బు సంపాదించే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ మీరు పిల్లలు ఆడుకునే... పర్యావరణానికి మేలు చేసే (Eco-friendly) బొమ్మలు చేస్తారని అనుకుందాం. వీటిని అమ్మాలంటే... మీరు ఎక్కడైనా షాపు పెట్టాలి. అలా షాపు పెడితే... దానికి అద్దెలు(Rent), కరెంటు బిల్లులు (Power Bill)... ఇలా బోలెడన్ని ఖర్చులు అవుతాయి. అందుకే మీరు చేసిన వాటిని అమ్ముకోవడానికి మీరు ఆన్‌లైన్ రూట్ వెతుక్కోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఈబే, స్నాప్‌డీల్ ఇలాంటి ఆన్‌లైన్ ఈ కామర్స్ సైట్లతో టై-అప్ అయ్యి... మీరు చేసే బొమ్మలు, క్రాఫ్ట్‌లను ఆ సైట్లలో అమ్మకానికి పెట్టవచ్చు. అవి నచ్చి ఎవరైనా ఆర్డర్ ఇస్తే... ఆ వెబ్‌సైట్ సిబ్బంది... డైరెక్టుగా మీ ఇంటికే వచ్చి... ఆ ఐటెంను తీసుకెళ్తారు. అందువల్ల మీరు చాలా తక్కువ ధరకే దాన్ని అమ్మవచ్చు. అదే సమయంలో మీకు కూడా మంచి లాభాలు ఉంటాయి.

సొంతంగా ప్రచారం:

మీరు చేసే వస్తువులకు మీరే సొంతంగా ప్రచారం చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో మీ వస్తువులకు సంబంధించి వీడియోలు చెయ్యవచ్చు. ఒక్కో వస్తువు తయారీకి ఒక్కో వీడియో చెయ్యవచ్చు. దాన్ని లక్ష మంది దాకా చూస్తే... మీకు దాదాపు రూ.2వేల దాకా ఆదాయం వస్తుంది. ఇలా మీ వీడియోలకు నెలకు ఎంత లేదన్నా ఓ 5 లక్షల వ్యూస్ వచ్చాయంటే... మీరు నెలకు రూ.10వేలు సంపాదించవచ్చు. యూట్యూబ్ కూడా డైరెక్టుగా మీ బ్యాంక్ అకౌంట్‌లోనే డబ్బు వేస్తుంది.

వెబ్‌సైట్ లేదా బ్లాగ్:

ఇక మీరు చేసే వస్తువులకు సంబంధించి సొంతంగా ఫ్రీ బ్లాగ్ మెయింటేన్ చెయ్యవచ్చు. లేదా ఫ్రీ వెబ్‌సైట్ పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రీగా సర్వీస్ ఇచ్చే సైట్లు ఇంటర్నెట్‌లో చాలా ఉన్నాయి. ఉదాహరణకు... www.blogger.com, www.wix.com వంటివి. వీటిలో మీరు రోజుకో పేజీ రాసినా చాలు... వాటిని గూగుల్ సెర్చ్ ద్వారా ప్రజలు చదువుతారు. తద్వారా గూగుల్ వాటికి యాడ్స్ ఇస్తుంది.

ఆ యాడ్స్ ఎవరైనా క్లిక్ చేస్తే... మీకు అలా కూడా రెవెన్యూ వస్తుంది. ఇందుకోసం గూగుల్ యాడ్‌సెన్స్ (www.google.com/adsense)లో అప్లై చేసుకోవచ్చు. ఇలా కూడా మీకు మీరు తయారుచేసే వస్తువుల ద్వారా డబ్బు సంపాదించే ఛాన్స్ ఉంటుంది. మీ బ్లాగులో... మీరు చేసిన వీడియో లింక్‌ను ఎంబెడ్ చేస్తే... బ్లాగ్ మ్యాటర్ చదివిన వారు... ఆ వీడియో చూస్తారు. తద్వారా మీకు రెవెన్యూ పెరుగుతుంది.

ఇది కూడా చదవండి : కరెన్సీ నోట్లపై RBI సంచలనం.. గాంధీ బదులు ఠాగూర్, కలాం బొమ్మలు!

ఇక మీరు చేసే వీడియోలు, రాసే బ్లాగుల లింక్ లను ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, షేర్ చాట్ లాంటి వాటిలో షేర్ చేస్తే... వీలైనంత ఎక్కువ మంది వాటిని చూసే, చదివే వీలు కలుగుతుంది. తద్వారా మీకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో... మీరు చేసే వస్తువులను కొనేవారి సంఖ్య కూడా పెరుగుతుంది. తద్వారా మీకు అన్ని విధాలా డబ్బు సంపాదించే అవకాశం కలుగుతుంది. మీకు ఎలాంటివి చెయ్యవచ్చో, ఎలాంటివి అమ్ముకోవచ్చో తెలియాలంటే... www.shopify.in/examples లో చూసుకోవచ్చు. అక్కడ ఇలాంటివి చేసేవాళ్లు... తమ టాలెంట్ చూపిస్తున్నారు.

ఇది కూాడా చదవండి : అదృష్టమంటే వీరిదే.. 5 నెలల్లోనే అద్భుతాలు.. లక్షకు రూ.28లక్షల లాభం

ఈ రోజుల్లో డిజిటల్ మార్కెట్ బాగా వేగంగా ఉంది. కొంత మంది యూట్యూబ్‌లో వంటలు చేస్తూ... నెలకు రూ.2 నుంచి రూ.4 లక్షల దాకా సంపాదిస్తున్నారు. మరికొందరు బొమ్మలు తయారుచేస్తూ వేలు సంపాదిస్తున్నారు. ఇలా ఏదో ఒక టాలెంట్ మీలో ఉండాలి. దాన్ని మీరు ప్రపంచానికి చాటాలి. తద్వారా డబ్బులు వచ్చేలా చేసుకోవాలి. మొదట్లో కాస్త తక్కువ రెవెన్యూ వచ్చినా... ఓ సంవత్సరం తర్వాత మీ వ్యాపారం అన్ని విధాలా డెవలప్ అయ్యి... మీకు నెలవారీ ఎక్కువ మొత్తం సంపాదించే వీలు కలుగుతుంది.

First published:

Tags: Business, Business Ideas, Money

ఉత్తమ కథలు