Paytm SIP Offer: డబ్బులు లేవా? అయినా పెట్టుబడి పెట్టొచ్చు... ఎలాగో తెలుసుకోండి

Paytm SIP Offer | పేటీఎం మనీ యాప్‌లో మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. అందులో 'పే లేటర్' ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక మీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభమవుతుంది. మీరు తర్వాత డబ్బులు చెల్లించొచ్చు.

news18-telugu
Updated: February 9, 2019, 8:25 AM IST
Paytm SIP Offer: డబ్బులు లేవా? అయినా పెట్టుబడి పెట్టొచ్చు... ఎలాగో తెలుసుకోండి
Paytm SIP Offer: డబ్బులు లేవా? అయినా పెట్టుబడి పెట్టొచ్చు... ఎలాగో తెలుసుకోండి
news18-telugu
Updated: February 9, 2019, 8:25 AM IST
SIP... సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. మ్యూచువల్ ఫండ్స్‌లో నెలనెలా పెట్టుబడి పెట్టేందుకు ఇదో సులువైన మార్గం. మార్కెట్‌పై అవగాహన ఉన్నవాళ్లు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు చేయకూడదని అంచనా వేస్తుంటారు. అయితే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం అనుకున్నప్పుడు చేతిలో డబ్బులు లేక ఇబ్బందిపడేవాళ్లుంటారు. అలాంటి వారికి పేటీఎం ఓ ఆఫర్ ప్రకటించింది. "రిజిస్టర్ సిప్ నౌ, పే లేటర్" పేరుతో సరికొత్త ఫీచర్‌ను లాంఛ్ చేసింది. మీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఇప్పుడే సిప్ తీసుకోవచ్చు.

Read this: SBI Prize: ఎస్‌బీఐ నుంచి రూ.5 లక్షల ప్రైజ్ మనీ... పోటీ ఇదే

పేటీఎం మనీ యాప్‌లో మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. అందులో 'పే లేటర్' ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక మీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభమవుతుంది. మీరు తర్వాత డబ్బులు చెల్లించొచ్చు. ప్రస్తుతం 75 శాతం మంది సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌పై ఆసక్తి పెరుగుతోందని అర్థం చేసుకోవచ్చు. చేతిలో డబ్బులు లేకపోయినా సిప్ కోసం రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది పేటీఎం మనీ. మీరు 'పే లేటర్' ఆప్షన్ ఎంచుకున్నాక ఆటో-పే ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంచుకున్న తేదీన మీ అకౌంట్ నుంచి డబ్బులు డిడక్ట్ అవుతాయి.

Read this: IRCTC Account: ఐఆర్‌‌సీటీసీ అకౌంట్ కావాలా? ఇలా క్రియేట్ చేసుకోండి



పేటీఎం మనీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌గా మారింది. గతేడాది రిలీజైన పేటీఎం మనీ 35 అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 10 లక్షల మంది పేటీఎం ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

Photos: రూ.50 కోట్లతో 6 రోల్స్ రాయిస్ కార్లు... తలపాగాతో మ్యాచింగ్...
Loading....

ఇవి కూడా చదవండి:

Oppo K1: ఇండియాలో లాంఛైన ఒప్పో కే1... స్పెసిఫికేషన్స్ ఇవే

Xiaomi Discount: షావోమీ ఫోన్లపై భారీ డిస్కౌంట్... 3 రోజులు మాత్రమే

SBI Alert: కార్డు మోసాలు జరుగుతున్నాయి... ఇలా జాగ్రత్తపడండి
First published: February 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు