ఆధార్ కార్డ్ ఇప్పుడు ప్రతీ ఒకరి దగ్గర ఉండాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. అనేక చోట్ల ఆధార్ కార్డ్ (Aadhaar Card) తప్పనిసరి. పీఎం కిసాన్ పథకం, ఇతర ప్రభుత్వ స్కీమ్స్‌తో ఆధార్ నెంబర్ తప్పనిసరి. ఆధార్ నెంబర్ ఆధారంగానే బ్యాంక్ అకౌంట్లకు (Bank Account) ప్రత్యక్షంగా నగదు బదిలీ చేస్తోంది ప్రభుత్వం. ఆధార్ కార్డ్ ఉపయోగం పెరుగుతుండటంతో అందులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు ఆధార్ కార్డ్ హోల్డర్స్. అయితే ఆధార్ సేవల విషయంలో ఆధార్ కార్డ్ హోల్డర్స్‌కు పలు సమస్యలు ఉంటున్నాయి. ఎవరికి ఫిర్యాదు చేయాలో, ఎలా కంప్లైంట్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అనేక మార్గాల్లో ఆధార్ సంబంధిత ఫిర్యాదుల్ని స్వీకరిస్తోంది. ఆ ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తోంది. ఫోన్ కాల్, చాట్ బాట్, ఇమెయిల్, వెబ్సైట్, పోస్ట్... ఇలా వేర్వేరు మార్గాల్లో యూఐడీఏఐకి ఆధార్ సంబంధిత ఫిర్యాదులు చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
IRCTC Shirdi Tour: హైదరాబాద్ నుంచి రూ.5,000 లోపే షిరిడీ, నాసిక్ టూర్
Phone Call: ఆధార్ కార్డ్ హోల్డర్స్ నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు యూఐడీఏఐ 1947 నెంబర్‌ను ఏర్పాటు చేసింది. ఇది టోల్ ఫ్రీ నెంబర్.
Chatbot: యూఐడీఏఐ ఆస్క్ ఆధార్ పేరుతో ఛాట్ బాట్ ఏర్పాటు చేసింది. ఇది ఆటోమెటెడ్ ఛాట్ ప్లాట్‌ఫామ్. మీ ఫిర్యాదులకు ఆటోమేటెడ్ రెస్పాన్స్ వస్తుంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఛాట్‌బాట్ అందుబాటులో ఉంది.
Resident Portal: యూఐడీఏఐ రెసిడెంట్ పోర్టల్‌లో కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. https://resident.uidai.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత Contact & Support సెక్షన్లో File a complaint పైన క్లిక్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. మీ 14 అంకెల ఎన్రోల్మెంట్ ఐడీ, ఇతర వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
LIC Policy: నెలకు రూ.2,000 పొదుపు చేస్తే రూ.48 లక్షల రిటర్న్స్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే
Email: ఆధార్ సేవలకు సంబంధించి ఇమెయిల్ ద్వారా కూడా యూఐడీఏఐకి కంప్లైంట్ చేయొచ్చు. help@uidai.gov.in మెయిల్ ఐడీకి ఇమెయిల్ పంపాలి.
Walk-In: యూఐడీఏఐ రీజనల్ కార్యాలయాలకు వెళ్లి నేరుగా కంప్లైంట్స్ చేయొచ్చు. ఆధార్ సంబంధిత వివరాలు తెలుసుకోవచ్చు.
Post: పోస్టు ద్వారా కూడా మీ ఫిర్యాదును పంపొచ్చు. యూఐడీఏఐ హెడ్‌క్వార్టర్స్, రీజనల్ ఆఫీసులకు మీ ఫిర్యాదును పోస్టు ద్వారా పంపాలి. యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్లో అడ్రస్‌లు ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, AADHAR, UIDAI