సొంత ఇల్లు నిర్మించుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల, ఆ కలను నెరవేర్చుకోవడం కోసం ప్రతీ ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగం దాచుకుంటారు. అయితే అలా దాచుకొన్న మొత్తంతో ఇల్లు నిర్మించాలి అంటే అయ్యే పని కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో భూమి విలువ, నిర్మాణ సామాగ్రి విలువ రోజు రోజుకు పెరుగుతుంది. ఉదాహరణకు మీరు కష్టపడి పది సంవత్సరాల్లో ఒక ఇరవై లక్షల వరకూ కూడబెట్టి ఇల్లు అపార్ట్ మెంట్ ఫ్లాట్ కానీ, ఇండిపెండెంట్ ఇల్లు కాననీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటే, అది వృధా ప్రయాస అవుతుంది. ఎందుకంటే మీరు ఎంచుకున్న ఫ్లాటు లేదా ఇండిపెండెంట్ ఇంటి విలువ పదేళ్ల తర్వాత ఎన్ని రెట్లు పెరుగుతుందో ఊహకు కూడా అందదు. రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధి రాత్రికి రాత్రి మారిపోతుంది. అందుకే మీకు స్థిరమైన ఆదాయం ఉంటే వెంటనే గృహరుణం తీసుకొని ఇల్లు కొనుగోలు చేసుకుంటే మేలు, తద్వారా మీరు పది సంవత్సరాలు కూడబెట్టే బదులు లోన్ తీర్చుకుంటే సరిపోతుంది. అంతేకాదు మీరు కొనుగోలు చేసిన గృహం విలువ 10 ఏళ్ల తర్వాత రెండు రెట్లు పెరుగుతుంది. తద్వారా మీకు రెండు రకాలుగా లాభం. పొందవచ్చు. ఏకమొత్తంలో డబ్బుతో ఇల్లు కొనడం కాస్త కష్టమే అయినప్పటికీ దీని కోసం బ్యాంకు నుంచి గృహ రుణం తీసుకోవచ్చు. అది 1BHk లేదా 2BHK అయినా, ప్రస్తుత కాలంలో హోమ్ లోన్ ద్వారా మీరు ఈ కలను సులభంగా నెరవేర్చుకోవచ్చు. మీ జీతం నెలకు రూ. 35000 అయితే, బ్యాంకులో మీకు ఎంత గృహ రుణం ఇస్తుంది. ఎలాగో తెలుసుకుందాం.
అర్హత ప్రమాణం ఏమిటి?
వయస్సు 23-62 సంవత్సరాల మధ్య ఉండాలి. CIBIL స్కోర్ 750 ఉండాలి. మీరు జీతం పొందుతున్నట్లయితే, మీకు 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఏ ఉద్యోగి జీతమైనా పేస్లిప్ ప్రకారం 6 రకాల ఖర్చులతో రూపొందిస్తారు. ఇందులో బేసిక్ శాలరీ, మెడికల్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, వెహికల్ అలవెన్స్ , ఇతర అలవెన్సులు ఉంటాయి. ఈ 6 ఖర్చులను కలపడం ద్వారా CTC ఏర్పడుతుంది, దీనిని కంపెనీ ఖర్చు అంటారు.
35000 జీతం కోసం గృహ రుణం ఎంత?
హోమ్ లోన్ తీసుకునేటప్పుడు, బ్యాంకులు నికర జీతం వివరాలను అడుగుతాయి. మీ నికర వేతనానికి 60 రెట్లు వరకు గృహ రుణంగా ఇవ్వవచ్చని బ్యాంకులు నియమం కలిగి ఉన్నాయి. మీ నికర జీతం 35000 అయితే మీరు రూ. 25.5 లక్షలు, 50 వేలు అయితే 38 లక్షలు, 60 వేలు అయితే 46.5 లక్షలు గృహ రుణం పొందవచ్చు.
హోమ్ లోన్ కోసం అర్హతను ఎలా పెంచుకోవాలి
మీ హోమ్ లోన్ అర్హతను పెంచుకోవడానికి, మీరు ముందుగా మీ CIBIL స్కోర్‌ను మెరుగుపరచుకోవాలి. ఇది కాకుండా, మీకు ఇప్పటికే మీ పేరు మీద రుణం ఉంటే, వీలైనంత త్వరగా దాన్ని సెటిల్ చేయండి, తద్వారా మీరు గృహ రుణం తీసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Full salary, Home loan