హోమ్ /వార్తలు /బిజినెస్ /

Transactions: మీరు నగదు లావాదేవీలు ఎక్కువ చేస్తారా.. అయితే జాగ్రత్త.. ప్రమాదం పొంచి ఉన్నట్లే..

Transactions: మీరు నగదు లావాదేవీలు ఎక్కువ చేస్తారా.. అయితే జాగ్రత్త.. ప్రమాదం పొంచి ఉన్నట్లే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Transactions: చాలామంది ప్రస్తుత పరిస్థితుల్లో నగదు లావాదేవీలు జరపడడంతో డిజిటల్ వైపు మళ్లారు. ఎక్కడ చూసినా ఫోన్ పే, గూగుల్ పే లాంటి డిజిటల్ వాలెట్ లే కనిపిస్తున్నాయి. అయితే ఒక వ్యక్తి బ్యాంకు నుంచి ఎంత నగదు లావాదేవీలు జరపొచ్చో తెలుసా.. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

చాలామంది ప్రస్తుత పరిస్థితుల్లో నగదు లావాదేవీలు జరపడడంతో డిజిటల్ వైపు మళ్లారు. ఎక్కడ చూసినా ఫోన్ పే, గూగుల్ పే లాంటి డిజిటల్ వాలెట్ లే కనిపిస్తున్నాయి. అయితే ఒక వ్యక్తి బ్యాంకు నుంచి ఎంత నగదు లావాదేవీలు జరపొచ్చో తెలుసా.. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. నగదు లావాదేవీలు నిర్వహించడంలో ఆదాయపు పన్ను శాఖ, బ్యాంక్, మ్యూచువల్ ఫండ్ సంస్థ‌లు, బ్రోకరేజీలు లాంటి వివిధ పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌లు నిబంధనలను కఠినతరం చేశాయి. వారు చెప్పిన నిబంధనలు మాత్రం ఉల్లంఘిస్తే ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు అందుకోవడం ఖాయం. ముఖ్యంగా ఆదాయ పన్ను శాఖ ఐదు రకాల నగదు లావాదేవీలపై ఎక్కువ దృష్టి సారిస్తుంది. అవేంటంటే.. సాధారణంగా ప్రతీ వ్యక్తికి నగదును దాచుకోవడానికి బ్యాంక్ లో అకౌంట్ ఉంటుంది. దీనిలో సేవింగ్ బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అనేవి ఉంటాయి. అయితే సేవింగ్ అకౌంట్ కలిగిన వారు రూ.1 లక్ష కంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే మాత్రం ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కరెంట్ ఖాతాలో నగదు డిపాజిట్ పరిమితి రూ.50 లక్ష‌ల వరకు ఉంటుంది. ఈ పరిమితి దాటితే నోటీసులు వస్తాయి.

ఇక క్రెడిట్ కార్డుల విషయానికి వస్తే.. క్రెడిట్ కార్డు చెల్లించేవారు రూ.లక్ష కంటే ఎక్కువ చెల్లిస్తే.. నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారి విషయంలో కూడా నగదు పరిమితులు విధించారు. అందులో కూడా రూ. 10 లక్షలకు మించి ఎక్కువ డిపాజిట్ చేయకూడదు. లేదంటే ఆదాయ పన్ను శాఖ వారికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్, డిబెంచర్లలో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు కూడా రూ.10 లక్షల కేటే ఎక్కువ పెట్టుబడులు మించకుండా చూసుకోవాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ విభాగంలో కూడా ఈ పరిమితులు వర్తిస్తాయి.

ATM withdrawal charges, cash transactions, Cheque Charges, Debit Card Charges, demand drafts, reward points redemptions, pin regeneration, locker rent charges, account closer charges, new cheque book charges, out station cheque handling chargesBank Charges: బ్యాంక్ ఖాతా నుంచి బ్యాంకులు ఎన్ని రకాల ఛార్జీలు వసూలు చేస్తాయో తెలుసా.. పూర్తి విరాలు ఇక్కడ తెలుసుకోండి.. Do you know how many types of charges banks charge from a bank account Find out the full details here అందులో ఒక ఆస్తిని విక్రయించినా.. కొనుగోలు చేసినా ఆ నగదు లావాదేవీలు అనేవి రూ.30 లక్షలకు మించి ఉండకూడదు. ఇటువంటి లావాదేవీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఐటీ శాఖ ప్రోత్సహించదు. మనం బ్యాంకులో చేసే ప్రతీ లావాదేవీల విషయంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారనే విషయాన్ని మనం గమనించాలి. పరిమితి మించితే మాత్రం ఐటీ అధికారులకు సమాధానం చెప్పాల్సి వస్తుంది.

First published:

Tags: BUSINESS NEWS, Income tax, Limit transactions