హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF Withdrawal: ఉద్యోగం మారగానే పీఎఫ్ డబ్బులు తీసుకుంటున్నారా? అయితే నష్టమే

EPF Withdrawal: ఉద్యోగం మారగానే పీఎఫ్ డబ్బులు తీసుకుంటున్నారా? అయితే నష్టమే

EPF Withdrawal: ఉద్యోగం మారగానే పీఎఫ్ డబ్బులు తీసుకుంటున్నారా? అయితే నష్టమే
(ప్రతీకాత్మక చిత్రం)

EPF Withdrawal: ఉద్యోగం మారగానే పీఎఫ్ డబ్బులు తీసుకుంటున్నారా? అయితే నష్టమే (ప్రతీకాత్మక చిత్రం)

EPF Withdrawal | ఉద్యోగం మారగానే మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు మొత్తం వెనక్కి తీసుకుంటున్నారా? దీని వల్ల నష్టమే. ఎందుకో తెలుసుకోండి.

ఉద్యోగం మారగానే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయడం చాలామందికి అలవాటు. ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారినప్పుడు పాత ఈపీఎఫ్ అకౌంట్‌ను కొనసాగించే అవకాశం ఇస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. ఇందుకోసం కొత్త కంపెనీలో పాత ఈపీఎఫ్ నెంబర్ ఇస్తే చాలు. పాత ఈపీఎఫ్ అకౌంట్ కొనసాగుతుంది. కొత్త కంపెనీలో యజమాని వాటా, ఉద్యోగి వాటా పాత ఈపీఎఫ్ అకౌంట్‌లోకి వెళ్తాయి. ఈ విషయం తెలియక చాలామంది తమ పాత ఈపీఎఫ్ అకౌంట్ క్లోజ్ చేసేందుకు అందులో డబ్బుల్ని విత్‌డ్రా చేస్తుంటారు. డబ్బులు అవసరం లేకపోయినా పాత పీఎఫ్ అకౌంట్ గురించి మర్చిపోతామన్న ఆలోచనతో డబ్బులు విత్‌డ్రా చేయాలని నిర్ణయించుకుంటారు. దీని వల్ల చాలావరకు నష్టపోతారు. ఎందుకంటే పీఎఫ్ అకౌంట్‌లోని డబ్బులకు వడ్డీ బాగానే వస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా ఎక్కువ వడ్డీ ఈపీఎఫ్ ఇస్తుంది. ఒకవేళ డబ్బులు వెనక్కి తీసుకుంటే ఈ వడ్డీ నష్టోపోవాల్సిందే. దీర్ఘకాలంలో చూస్తే చాలావరకు డబ్బు నష్టపోతారు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ ఇస్తోంది. త్వరలోనే వడ్డీ ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్‌లోకి రానుంది.

EPF Balance: రెండు రోజుల్లో ఈపీఎఫ్ వడ్డీ మీ అకౌంట్‌లోకి... బ్యాలెన్స్ చెక్ చేయండి ఇలా

EPFO: వాట్సప్‌లో ఈపీఎఫ్ఓ హెల్ప్‌లైన్... హైదరాబాద్, విజయవాడ నెంబర్స్ ఇవే

దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ నష్టపోవడం మాత్రమే కాదు ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్-EPS బెనిఫిట్స్‌పైనా ప్రభావం పడుతుంది. మీరు పాత పీఎఫ్ అకౌంట్ కొనసాగించడం వల్ల కంటిన్యుటీ ఉంటుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి ఓ కంపెనీలో మూడేళ్లు పనిచేసి ఆ తర్వాత మరో కంపెనీలో చేరాడనుకుందాం. కొత్త కంపెనీలో చేరి రెండేళ్లవుతుంది. ఒకవేళ పీఎఫ్ ఖాతా కొనసాగించినట్టైతే మొత్తం ఐదేళ్లుగా ఈపీఎఫ్ మెంబర్‌గా ఉన్నట్టు రికార్డు ఉంటుంది. కానీ పాత పీఎఫ్ అకౌంట్ క్లోజ్ చేసి, డబ్బులు తీసేసుకొని, కొత్త కంపెనీలో కొత్తగా పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసినట్టైతే రెండేళ్ల రికార్డు మాత్రమే ఉంటుంది. అందుకే ఉద్యోగం మారితే పాత పీఎఫ్ అకౌంట్‌నే కొనసాగించాలి. మీకు పీఎఫ్ అకౌంట్ కొనసాగించడం అవసరం లేదు అనుకుంటే మీరు ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత మొత్తం డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు.

EPFO KYC: ఈపీఎఫ్ అకౌంట్‌లో తప్పులున్నాయా? ఆన్‌లైన్‌లో సరిచేయండిలా

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌తో ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

అందుకే ఉద్యోగులు అత్యవసరమైతే తప్ప తమ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయకూడదు. మీరు ఉద్యోగం మానేసినా మీ పీఎఫ్ అకౌంట్‌లోని డబ్బుకు వడ్డీ ప్రతీ ఏటా జమ అవుతూనే ఉంటుంది. పాత పీఎఫ్ అకౌంట్‌ను కొత్త పీఎఫ్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ కూడా చేయొచ్చు. ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. రెండు పీఎఫ్ అకౌంట్లను ఒకే అకౌంట్‌గా మెయింటైన్ చేయొచ్చు. పాత పీఎఫ్ అకౌంట్‌లోని డబ్బులు కొత్త అకౌంట్‌లోకి వస్తాయి. ఒకవేళ మీరు ఉద్యోగం పూర్తిగా మానేసినట్టైతే మీ పీఎఫ్ అకౌంట్ కొనసాగించడానికి కుదరదు. తప్పనిసరిగా యజమాని వాటా ఉండాలి కాబట్టి మీరు స్వయంగా కంట్రిబ్యూషన్ చేయడానికి వీల్లేదు. అలాంటప్పుడు పీఎఫ్ అకౌంట్‌ను క్లోజ్ చేయకుండా అలాగే వదిలేసినా అందులో అప్పటివరకు జమైన డబ్బుకు వడ్డీ వస్తుంది.

First published:

Tags: Business, BUSINESS NEWS, EPFO, Personal Finance

ఉత్తమ కథలు