హోమ్ /వార్తలు /బిజినెస్ /

ఆల‌స్యం వ‌ద్దు.. త్వ‌ర‌గా ఐటీఆర్ ఫైల్ చేయండి

ఆల‌స్యం వ‌ద్దు.. త్వ‌ర‌గా ఐటీఆర్ ఫైల్ చేయండి

సెయింట్ కిట్స్, నెవిస్
సెయింట్ కిట్స్, నెవిస్ అట్లాంటిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రం మధ్య ఉన్న ద్వంద్వ ద్వీప దేశం. ఇక్కడ ఎలాంటి ఆదాయపు పన్ను లేదా మరే ఇతర రకాల పన్నులు లేవు. ఆదాయానికి ప్రధాన వనరు పర్యాటకం, వారు విదేశీ పౌరులకు ఆర్థిక పౌరసత్వ కార్యక్రమాలను కూడా అందిస్తారు.

సెయింట్ కిట్స్, నెవిస్ సెయింట్ కిట్స్, నెవిస్ అట్లాంటిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రం మధ్య ఉన్న ద్వంద్వ ద్వీప దేశం. ఇక్కడ ఎలాంటి ఆదాయపు పన్ను లేదా మరే ఇతర రకాల పన్నులు లేవు. ఆదాయానికి ప్రధాన వనరు పర్యాటకం, వారు విదేశీ పౌరులకు ఆర్థిక పౌరసత్వ కార్యక్రమాలను కూడా అందిస్తారు.

సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగా ఈ ఏడాది ప‌న్ను చెల్లింపు దారులు ఐటీఆర్ దాఖ‌లుచేయ‌డంలో ఇబ్బంది ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం సెప్టెంబ‌ర్ 30, 2021 వ‌ర‌కు ఐటీఆర్ ఫైల్ చేయ‌డానికి అవ‌కాశం ఇచ్చింది.

  ఐటీఆర్ దాఖలు చేయడానికి ప్ర‌భుత్వం సెప్టెంబ‌ర్ 30, 2021 గ‌డువు విధించింది. ఈ లోపు ఐటీ చెల్లిస్తే ఆల‌స్య రుసుము చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆదాయ శాఖ తెలిపింది. వాస్త‌వానికి ఐటీఆర్ దాఖ‌లుచేయ‌డాకి జూలై 31 అయితే ప‌లు కార‌ణాల ద్వారా ఐటీఆర్ ఫైల్ చేయ‌డం కుద‌ర‌ని వారు సెప్టెంబ‌ర్ 30 లోపు చెల్లించ వ‌చ్చు.

  త్వ‌ర‌గా చెల్లిస్తే జ‌రిమానా వడ్డీ చెల్లించడానికి తేదీని పొడిగించ‌న‌ప్ప‌టికీ సెక్ష‌న్ 234ఏ ప్ర‌కారం ప‌న్ను ప‌రిమితి ల‌క్ష రూపాయ‌లు దాటితే వేసే 1శాతం ప‌న్నును మాత్రం తీసివేయ‌లేదు. ఈ ప్ర‌కారం వ‌డ్డి నెల‌కు 1శాతం వ‌ర‌కు లెక్కించి వేస్తారు. కావును త్వ‌ర‌గా ఐటీఆర్ దాఖలు చేసే ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని ట్యాక్స్‌మాన్ డీజీఎం న‌వీన్ వాద్వా సూచిస్తున్నారు.

  సెక్ష‌న్ 234ఏ అనేది ఐటీఆర్ ఆలస్యం అయితే విధించే వ‌డ్డీ గురించి, పాటించాల్సిన నియ‌మాల గురించి చెబుతుంది. వాస్త‌వానికి ల‌క్ష రూపాయ‌ల టాక్స్ చెల్లించే వారు జూలై 31 వ‌ర‌కే త‌మ చెల్లింపులు చేస్తే ఎటువంటి వ‌డ్డీ ప‌డ‌దు. ప్ర‌స్త‌తం ప్ర‌భుత్వం ఇచ్చిన సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు చేస్తే జ‌రిమానాపై వ‌డ్డీ మిన‌హాయింపు వ‌స్తుంది వాద్వా సూచిస్తున్నారు. మీను ఉదాహర‌ణ‌కు రూ.1.5 ల‌క్ష‌ల టాక్స్ చెల్లింపును పూర్తి చేస్తే నెల‌కు దానిపై ప‌డే రూ.1500 వ‌డ్డీ మీకు వెయ్య‌రు.

  ప్ర‌భుత్వం కొత్త ఐటీ పోర్ట‌ల్‌లో సాంకేతిక లోపాల ద్వారా చెల్లింపులు ఆల‌స్యం అయ్యాని గ‌డువు తేదీని పొడిగించిది. దానితోపాటు సెక్ష‌న్ 234ఏ కింద చెల్లించే వ‌డ్డీని మిన‌హాయించాలని, ఈ సంవ‌త్స‌రం జూలై 31 త‌ర్వాత ఐటీఆర్ దాఖ‌లు చేసిన‌ప్ప‌టికి సెక్ష‌న్ 234ఏ కింద వేసే వ‌డ్డీని మిన‌హా ఇస్తే ఉద్యోగ, వ్యాపార వ‌ర్గాల‌కు బాగుంటుంద‌ని నంగియా & కో ఎల్‌ఎల్‌పి భాగస్వామి శైలేష్ కుమార్ అభిప్రాయ‌ప‌డ్డారు.

  వేగంగా ప‌ని పూర్త‌వుతుంది..

  టాక్స్ చెల్లింపు దారులు అందించిన స‌మాచారాన్ని ప‌రిశీలించిన వెంట‌నే రిట‌ర్న్ ప్రాసెస్ మొద‌ల‌వుతుంది. ప‌న్నుచెల్లింపుదాల‌కు దీనిపై వెంట‌నే స‌మాచారం అందిస్తారు. ప‌న్ను చెల్లింపు దారుడు అందించిన స‌మాచారంలో ఎటువంటి త‌ప్పులు కానీ తేడాగాని ఉంటే డిపార్ట్ మెంట్ స‌మాచారంతో స‌రిపోల్చి తిరిగి చెల్లింపు ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంది. ఈ ప్ర‌క్రియ‌కు వారాలుగాని, నెల‌లుగాని ప‌ట్ట‌వచ్చు. రిట‌ర్న్ స‌కాలంలో అందిస్తే ఇటువంటి ఆల‌స్యం లేకుండా రీఫండ్‌ను తొంద‌ర‌గా పొంద‌వ‌చ్చు. చాలా మంది స‌రైన స‌మాచారం ఇచ్చిన వారు వేగంగా రిట‌ర్న్ పొందార‌ని వాద్వా తెలిపారు. ఇంకా ఆల‌స్యం చేయ‌కుండా ప‌న్ను చెల్లింపు దారులు ఐటీఆర్ పొందుప‌రిస్తే మేలు.

  ఆఖ‌రి నిమిషంలో ఇబ్బంది ప‌డొద్దు..

  ప్ర‌స్తుతం ఉన్న స‌మ‌యంలో సాంకేతిక లోపాల‌తో పోర్ట‌ల్ ఇబ్బంది ప‌డితే ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డం ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌గా ఐటీఆర్ చేయ‌డం వ‌ల్ల ఆఖ‌రి నిముషంలో క‌లిగే ఇబ్బందుల‌ను నివారించ‌వ‌చ్చు.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Income tax

  ఉత్తమ కథలు