DO NOT FORGET TO FILL THESE IMPORTANT DETAILS FOR NEFT MONEY TRANSFER SS GH
NEFT: నెఫ్ట్‌లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు
NEFT: నెఫ్ట్‌లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు
(ప్రతీకాత్మక చిత్రం)
NEFT Money Transfer | నెఫ్ట్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. లేకపోతే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే అవకాశముంది.
మనీ ట్రాన్స్ఫర్లో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్-NEFT పద్ధతి చాలా పాపులర్. ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు పంపాలన్నా, ఎవరి వద్దనుంచైనా డబ్బు సాయం అందుకోవాలన్నా ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈమధ్య కాలంలో చెక్ సిస్టంకు బదులు ఉత్తమమైన పేమెంట్ సిస్టంగా మారిపోయిన ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌కు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. గతంలో కేవలం వర్కింగ్ డేస్‌లో మాత్రమే ఈ మనీ ట్రాన్స్ఫర్ సాధ్యమయ్యేది. కానీ దీనికున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వారంలో ఏ రోజైనా ఫండ్ ట్రాన్స్ఫర్ చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. బ్యాంకు హాలీడే ఉన్నా, ఆదివారాలైనా డబ్బును ఈజీగా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. పైగా ఇందులో ఎటువంటి ఆటంకాలు తలెత్తవు. తప్పకుండా ఈ డబ్బు మీరు పంపాలనుకున్న వారికి చేరి తీరుతుంది.
నెఫ్ట్ ట్రాన్స్‌ఫర్‌కు ఈ వివరాలు నమోదు చేయాల్సిందే
ఇలా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మాత్రం తప్పకుండా కొన్ని వివరాలు నమోదు చేయాల్సిందే. అలాంటి 6 వివరాలు రాస్తేనే మీరు ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్ చేయగలరు.ఎవరికైతే డబ్బు పంపుతున్నారో ఆ వ్యక్తి పేరు అంటే బెనిఫిషియరీ పేరు రాయాలి. ఆమె లేదా అతడి బ్యాంక్ అకౌంట్ నంబరు రాయాలి. ఆమె లేదా అతడి బ్యాంక్ అకౌంట్ బ్రాంచ్ పేరు తప్పకుండా ఫారంలో రాయాలి. మీరు డబ్బు పంపుతున్న వ్యక్తి బ్యాంక్ అకౌంట్ పేరు రాయాలి. మీరు ఫండ్ ట్రాన్స్ ఫర్ ఎవరికి చేస్తున్నారో సదరు వ్యక్తి బ్యాంక్ IFSC కోడ్ రాయాలి. ఎంత మొత్తం పంపాలనుకుంటున్నారో ఆ మొత్తం రాయాలి.
మీరు ఎవరికైనా తక్షణం నగదు బదిలీ చేయాలనుకుంటే మీ సమీపంలోని మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించాలి. ఇందుకు మీరు నెట్ బ్యాంకింగ్ లోకి లాగిన్ అవ్వాలి. అప్పుడు "funds transfer" అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. దీనిపై క్లిక్ చేశాక, బెనిఫిషియరీ పేరును యాడ్ చేయాలి. ఇందులోనే మీరు మిగతా వివరాలైన బెనిఫిషియరీ డీటైల్స్, బ్యాంక్ డీటైల్స్, IFSC కోడ్ తప్పనిసరిగా రాయాలి. మీరు నమోదు చేసిన వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎంటర్ కొడితే 30 నిమిషాల్లోగా బెనిఫిషియరీని యాడ్ చేసినట్టు కన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు నగదు బదిలీని మొదలుపెడితే సరి. అయితే బెనిఫిషియరీని యాడ్ చేయటమంటే అది ఆయా బ్యాంకుల నియమ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. అన్ని బ్యాంకులు 30 నిమిషాల్లో బెనిఫిషియరీని యాడ్ చేయవు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కొన్ని బ్యాంకుల్లో ఇందుకు 24 గంటల సమయం పడుతుంది. ఇక డబ్బు ట్రాన్స్ఫర్ చేసేప్పుడు మీరు పదేపదే చెక్ చేసుకోవాల్సిన విషయాలు బ్యాంక్ అకౌంట్ నంబర్, పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ కరెక్టుగా ఉందో లేదో చూసుకోండి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.