కరెన్సీ నోట్లతో రోగాలొస్తాయా?

కరెన్సీ నోట్లు రోగాలను వ్యాప్తి చేస్తున్నాయన్న కలవరం మొదలైంది. దీనిపై దర్యాప్తు చేయాలంటూ ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకే లేఖ రావడంతో ఆందోళన ఇంకాస్త పెరిగింది.

news18-telugu
Updated: September 3, 2018, 10:34 AM IST
కరెన్సీ నోట్లతో రోగాలొస్తాయా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీ ఇంట్లో బీరువాలో నోట్ల కట్టలు ఉన్నాయా? డబ్బు బాగానే సంపాదించేశామని సంబరపడిపోతున్నారా? అయితే ఈ కరెన్సీ నోట్లే మీకు రోగాలను అంటించగలవు జాగ్రత్త. కరెన్సీ నోట్లేంటీ... రోగాలు అంటించడమేంటీ అనుకుంటున్నారా? ఇప్పుడు తాజాగా కలవరపరుస్తున్న విషయమిదే. దీనిపైనే అఖిల భారత వర్తకుల సమాఖ్య(సీఏఐటీ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతే కాదు... దీనిపై దర్యాప్తు చేయాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసింది సీఏఐటీ. ఆ లేఖ కాపీలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్‌లకు పంపింది.

నోట్లతో రోగాలొస్తాయా? ఆందోళనకు కారణమేంటీ?

కరెన్సీ నోట్లతో రోగాలొస్తాయన్న ఆందోళనకు కారణం మీడియాలో అధ్యయనాలు, మీడియాలో వస్తున్న వార్తలే. కరెన్సీ నోట్ల కారణంగా చర్మవ్యాధులు, నోటి, జీర్ణాశయ సమస్యలు, మూత్రకోశ, శ్వాసకోశ రోగాలు సంక్రమిస్తున్నాయన్నది సీఏఐటీ వాదన. కొన్ని అధ్యయనాలు ఇదే రుజువు చేశాయని వర్తకుల సమాఖ్య వాదిస్తోంది. అయితే వ్యాపారులు, వర్తకులే కరెన్సీ నోట్లను ఎక్కువగా వాడుతుంటారు. దీంతో సీఐఏటీ రంగంలోకి దిగింది. సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది అని ఆందోళన వ్యక్తం చేస్తోంది. సంబంధిత అధ్యయనాలు, వార్తల కాపీలను కేంద్రానికి అందజేస్తూ... దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.

సైన్స్ పత్రికలు ఏటేటా ఇలాంటి కథనాలను ప్రచురిస్తుంటాయి. హెచ్చరికల్ని చేస్తుంటాయి. తీవ్రమైన ప్రజారోగ్య సమస్యపై ఎలాంటి విచారణ జరపకపోవడం విచారకరం. వర్తకులు, వ్యాపారులు కరెన్సీ నోట్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఒకవేళ ఆ కథనాల్లో నిజం ఉంటే వ్యాపారులు మాత్రమే కాదు... వినియోగదారులకూ ఇబ్బందులు తప్పవు.
ప్రవీణ్ ఖండేల్వాలా, సీఏఐటీ ప్రధాన కార్యదర్శి


ప్రభుత్వంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చొరవ తీసుకొని... కరెన్సీ నోట్లతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్న కథనాలపై దర్యాప్తు చేయాలని కోరుతోంది సీఏఐటీ.

ఇవి కూడా చదవండి:థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌కి కొత్త రూల్స్

యాపిల్ ఈవెంట్‌కు కౌంట్‌డౌన్ షురూ!

రెడ్‌మీ 6 సిరీస్ ఫోన్ల ఫీచర్స్ ఇవే!

ఏటీఎంలో డబ్బులు రాకపోతే ఇలా చేయండి!

Photos: రూపాయి విలువ పతనానికి కారణమేంటీ?
Published by: Santhosh Kumar S
First published: September 3, 2018, 10:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading