Health Insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలో యాడ్-ఆన్ మంచిదేనా?

Health Insurance | పిల్లలు పుట్టినప్పుడు తలెత్తే ఆరోగ్య సమస్యలు బేసిక్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలో కవర్ కావు. ఇందుకోసం మెటర్నిటీ బెనిఫిట్‌తో యాడ్ ఆన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే అప్పటికే ఉన్న పాలసీ కన్నా కాస్త ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.

news18-telugu
Updated: January 31, 2019, 3:38 PM IST
Health Insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలో యాడ్-ఆన్ మంచిదేనా?
Health Insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలో యాడ్-ఆన్ మంచిదేనా?
news18-telugu
Updated: January 31, 2019, 3:38 PM IST
హెల్త్ ఇన్స్యూరెన్స్... లైఫ్ ఇన్స్యూరెన్స్ కన్నా ముఖ్యమైపోయింది ఈ రోజుల్లో. ఇటీవల చాలా హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలు మరింత ఆరోగ్య రక్షణ కల్పించేందుకు యాడ్-ఆన్ సౌకర్యాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు పిల్లలు పుట్టినప్పుడు తలెత్తే ఆరోగ్య సమస్యలు బేసిక్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలో కవర్ కావు. ఇందుకోసం మెటర్నిటీ బెనిఫిట్‌తో యాడ్ ఆన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే అప్పటికే ఉన్న పాలసీ కన్నా కాస్త ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అయితే యాడ్-ఆన్స్ తీసుకునే ముందు షరతులన్నీ జాగ్రత్తగా చదువుకోవాలి. బీమా కంపెనీలు హెల్త్ ఇన్స్యూరెన్స్‌లపై ఇస్తున్న యాడ్-ఆన్స్ ఇవే.

Read this: Facebook Tips: మీ ఫేస్‌బుక్‌లో చేయకూడని 9 అంశాలివే...

మెటర్నిటీ బెనిఫిట్



పిల్లలు పుట్టే సమయంలో ఆస్పత్రి ఖర్చులు రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు ఉండొచ్చు. బేసిక్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలోనే మెటర్నిటీ యాడ్-ఆన్ తీసుకోవచ్చు. కానీ మెటర్నిటీ బెనిఫిట్స్ పొందాలంటే 2-4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అందుకే ముందుగానే మెటర్నిటీ ఆడ్-ఆన్ తీసుకోవాలని సూచిస్తారు నిపుణులు. అంటే మరో నాలుగేళ్లలో పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకుంటే ఇప్పట్నుంచే మెటర్నిటీ యాడ్-ఆన్ తీసుకోవాలి.



Read this: Bank of Baroda alert: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్

Health Insurance plans, Health Insurance schemes, Health Insurance add on plans, Health Insurance top up plans, Health Insurance benefits, హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ టాప్ అప్, హెల్త్ ఇన్స్యూరెన్స్ యాడ్ ఆన్


క్రిటికల్ ఇల్‌నెస్

Loading...
క్రిటికల్ ఇల్‌నెస్ యాడ్-ఆన్ తీసుకుంటే తీవ్రమైన అనారోగ్యం తలెత్తినప్పుడు ఎంతైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. సాధారణ ఆరోగ్యంతో సంబంధం లేకుండా కేవలం క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్స్ ఇచ్చే సంస్థలున్నాయి. అయితే మీ దగ్గర బేసిక్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటే క్రిటికల్ ఇల్‌నెస్ యాడ్-ఆన్ కాకుండా, వేరుగా క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ తీసుకోవచ్చు. ఎందుకంటే క్రిటికల్ ఇల్‌నెస్ యాడ్-ఆన్ తీసుకుంటే బేసిక్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌తో కలిపి వస్తుంది. క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, పక్షవాతం లాంటి తీవ్రమైన సమస్యలకు చికిత్స కాలం ఎక్కువ కాబట్టి క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ వేరుగా తీసుకోవడమే మంచిది.

Read this: Attention Please: ఇకపై మీ రైలు ఆలస్యంగా రాదు... భారతీయ రైల్వే కొత్త ప్లానింగ్

పర్సనల్ యాక్సిడెంట్


హెల్త్ ఇన్స్యూరెన్స్‌లోనే పర్సనల్ యాక్సిడెంట్ యాడ్-ఆన్ ఫీచర్ తీసుకోవచ్చు. ఇందులో అన్ని రకాల ప్రమాదాలు, యాక్సిడెంటల్ డెత్, ప్రమాదం కారణంగా వైకల్యం, తాత్కాలిక, శాశ్వత వైకల్యం లాంటివి కవర్ అవుతాయి. అయితే పర్సనల్ యాక్సిడెంట్ యాడ్-ఆన్ తీసుకుంటే రూ.2-5 లక్షల వరకే కవర్ అవుతుంది. ఇదే పాలసీని వేరుగా తీసుకుంటే రూ.75 లక్షల వరకు కవరేజీ తీసుకోవచ్చు. కేవలం పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ తీసుకుంటే గ్లోబల్ కవరేజీ ఉంటుంది. యాడ్-ఆన్ పాలసీలో ఇది ఉండకపోవచ్చు.

Read this: Income Tax: 80సీ లిమిట్ మొత్తం వాడేశారా? పన్ను ఆదా చేయడానికి మరో 5 మార్గాలు

Health Insurance plans, Health Insurance schemes, Health Insurance add on plans, Health Insurance top up plans, Health Insurance benefits, హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ టాప్ అప్, హెల్త్ ఇన్స్యూరెన్స్ యాడ్ ఆన్


హాస్పిటల్ క్యాష్


ఆస్పత్రిలో చేరినప్పుడు వైద్య ఖర్చులు, ఆస్పత్రిలో ఖర్చుల కోసం పాలసీ హోల్డర్ నగదు పొందేందుకు ఉపయోగపడే యాడ్-ఆన్ ఇది. ఇది రోజువారీగా కొన్ని రోజుల వరకే ఉంటుంది. రోజుకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు చెల్లిస్తారు. అయితే ఏరోజుకు ఆరోజు డబ్బులు ఇవ్వరు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఇస్తారు. క్లెయిమ్ సమయంలో అన్ని బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది. రోజుకు రూ.5,000 కన్నా ఎక్కువ ఖర్చు ఉంటుంది అనుకుంటేనే హాస్పిటల్ క్యాష్ యాడ్-ఆన్ తీసుకోవచ్చు.

Read this: IRCTC Refund Rules: ఐఆర్‌సీటీసీ ఇ-టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్ రూల్స్ ఇవే...

సూపర్ టాప్ అప్


అప్పటికే మీకు ఉన్న లిమిట్ కన్నా అదనంగా కవరేజీ కావాలనుకుంటే ఈ టాప్ అప్ తీసుకోవచ్చు. మీరు మీ లిమిట్ మొత్తం వాడుకున్న తర్వాత అదనంగా ఆస్పత్రి వేసే బిల్లులన్నీ టాప్-అప్ పాలసీలో కవర్ అవుతాయి. ఉదాహరణకు మీకు రూ.5 లక్షల హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ ఉంటే టాప్ అప్‌తో రూ.10 లక్షల వరకు లిమిట్ పెంచుకోవచ్చు. మీ ఆస్పత్రి బిల్లులు రూ.8 లక్షలు అయితే సాధారణ హెల్త్ పాలసీలో రూ.5 లక్షలు, టాప్ అప్ నుంచి రూ.3 లక్షలు క్లెయిమ్ చేసుకోవాలి. ఒక సంవత్సరంలో లిమిట్ మొత్తం వాడుకునేవారికి టాప్ అప్ ఉపయోగపడుతుంది. యాడ్ ఆన్ కాకుండా మొత్తం రూ.10 లక్షలు ఒకేసారి పాలసీ తీసుకోవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఇలా తీసుకుంటే ప్రీమియం అధికంగా చెల్లించాల్సి వస్తుంది. అందుకే మీకు ఏ సంవత్సరంలో అయితే అదనంగా ఖర్చులు ఉంటాయనిపిస్తే అప్పుడు టాప్ అప్ తీసుకోవడం మంచిది.

హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ యాడ్-ఆన్ అయినా, టాప్-అప్ అయినా నియమ నిబంధనలు అన్నీ తెలుసుకొని ఎంచుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి:

మూడేళ్లలో ఈ 9 జాబ్స్‌కు ఫుల్ డిమాండ్... చేయాల్సిన కోర్సులివే

జనవరిలో రిలీజైన టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే... ఏది బెస్ట్?
First published: January 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...