హోమ్ /వార్తలు /బిజినెస్ /

Investment: దీపావళి బోనస్‌తో ఇలా చేస్తే డబ్బే డబ్బు!

Investment: దీపావళి బోనస్‌తో ఇలా చేస్తే డబ్బే డబ్బు!

దీపావళి బోనస్‌తో ఇలా చేస్తే డబ్బే డబ్బు

దీపావళి బోనస్‌తో ఇలా చేస్తే డబ్బే డబ్బు

Investment | పండుగ సీజన్‌లో ఉద్యోగులకు జీతంతో పాటు కంపెనీలు బోనస్‌ అందిస్తాయి. ఈ మొత్తంతో ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చు. అలాంటి వారికోసం ప్రస్తుతం బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఏవో తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Savings Tips | ప్రస్తుతం భారతదేశంలో పండగ సీజన్ కొనసాగుతోంది. రేపు దసరా, మరికొద్ది రోజుల్లో దీపావళి (Diwali) కూడా రానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఆయా సంస్థలు దీపావళి బోనస్‌ (Diwali Bonus)లు అందజేయడానికి రెడీ అవుతున్నాయి. సాధారణంగా కొందరు ఈ బోనస్‌ డబ్బునంతా ఖర్చు పెట్టుకుంటే.. మరికొందరు పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగిస్తారు. అలాంటి వారికోసం ప్రస్తుతం బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ (Investments) ఏవో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్న వారు కొన్ని ముఖ్య విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అవి కూడా తెలుసుకుందాం.

బోనస్‌ ఖర్చు పెట్టండిలా

క్రెడిట్ కార్డ్ బకాయిలు, హోమ్ లేదా పర్సనల్ లోన్ ఉన్నవారు పెట్టుబడులు పెట్టడం కంటే ఆ అప్పులు తీర్చడం మంచిది. ఎలాంటి అప్పులనైనా సరే ఈ బోనస్‌తో క్లియర్ చేసుకుంటే భారం చాలా వరకు తగ్గుతుంది. అప్పులు లేనివారు బోనస్‌ మనీతో మ్యూచువల్ ఫండ్‌లు లేదా తక్కువ రిస్క్ ఉన్న షేర్‌లను కొనుగోలు చేసి లాభపడవచ్చు. బీమా కవరేజీలో పెట్టుబడి పెట్టినా మంచిదే. అలా వద్దు అనుకుంటే ఎమర్జెన్సీ ఫండ్‌ను మరింత పెంచుకోవచ్చు. బోనస్‌ను డీమ్యాట్ రూపంలో గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేయవచ్చు. కొత్త స్కిల్ లేదా భాష నేర్చుకోవడం, ఇంటిని, హోమ్ అప్లయన్సెస్‌ను అప్‌గ్రేడ్ చేయడం లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడం కూడా మంచిదే.

మీ బోనస్‌తో మీకు ఎలాంటి అవసరం లేదనుకుంటేనే దానిని మీరు పెట్టుబడిగా పెట్టాలి అంటున్నారు నిపుణులు. మరి ఈసారి దీపావళి బోనస్‌తో ఎక్కువ లాభం ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

శుభవార్త.. భారీగా తగ్గిన ఈ 11 నిత్యావసర వస్తువుల ధరలు!

మ్యూచువల్ ఫండ్స్ - మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడి పొందొచ్చు. దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అదిరే రాబడిని అందిస్తాయని నిపుణులు పేర్కొంటుంటారు. గత పదేళ్ల కాలంలో యాక్సిస్ బ్లూచిప్ ఫండ్, ఐసీఐసీఐ ప్రెడెన్షియల్ బ్లూచిప్ ఫండ్, మిరే అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, ఎస్‌బీఐ బ్లూచిప్ ఫండ్ వంటివి మంచి రాబడిని ఇచ్చాయి. 15 శాతానికి పైగా రాబడిని అర్జించాయి. స్మాల్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్‌లో అయితే ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, డీఎస్‌పీ స్మాల్ క్యాప్ ఫండ్, కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ వంటివి అదిరే రాబడి ఇచ్చాయి. ఇవి 26 శాతం వరకు రాబడిని అర్జించాయి. అయితే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్లు రిస్క్‌కు లోబడి ఉంటాయని గుర్తించుకోవాలి.

ఇప్పుడు కొనండి.. వచ్చే ఏడాది నుంచి ఈఎంఐ కట్టండి! కంపెనీ అదిరే ఆఫర్!

పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్ - కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే పలు సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను పెంచింది. అందువల్ల రిస్క్ లేకుండా ఆకర్షణీయ రాబడి పొందాలని భావించే వారు ఈ స్కీమ్స్‌లో డబ్బులు పెట్టొచ్చు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు 7.4 శాతం నుంచి 7.6 శాతానికి చేరింది. అలాగే మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ స్కీమ్‌పై కూడా వడ్డీ రేటు పెరిగింది. 6.6 శాతం నుంచి 6.7 శాతానికి చేరింది. ఇంకా కిసాన్ వికాస్ పత్ర పథకంపై కూడా వడ్డీ రేటు పైకి చేరింది. 7 శాతం వడ్డీ వస్తుంది.  వీటిల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు.

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు - మరోవైపు బ్యాంకులు వరుసపెట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి. అందువల్ల మీరు వీటిల్లో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి పొందొచ్చు. కొన్ని బ్యాంకులు 8.4 శాతం వరకు కూడా వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.

First published:

Tags: Fixed deposits, Investments, Money, Mutual Funds, Personal Finance, Savings