లెొే మన మార్కెట్ కు దీపావళి జోష్ అదనపు బలాన్ని ఇస్తోంది. ఈ పండుగ సీజన్లో రికార్డ్ బ్రేక్ సేల్స్ చేయగలమనే ధీమాతో ఉన్న జెయింట్ కంపెనీలన్నీ కనివినీ ఎరుగుని స్థాయిలో ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఆటోమొబైల్ ఇండస్ట్రీకి మరిన్ని జవసత్వాలు కల్పించేలా కస్టమర్లను ఊరించేలా పలు కంపెనీలు దీపావళి బొనాంజాలు ప్రకటించాయి.
ఫెస్టివల్ సెంటిమెంట్పండుగ సెంటిమెంట్ (festival sentiment) కలిసివచ్చేలా నవంబర్ వరకు ఢమాకా సేల్స్ (dhamaka sales) నిర్వహించాలనే లక్ష్యంతో దూసుకుపోతున్న కంపెనీలు ఫుల్ జోష్ మీద ఉన్నాయి. లీడింగ్ కార్ మేకర్స్ (leading car makers) అయిన Maruti Suzuki, Honda, Hyundai, Honda, Tata, Toyota , డాట్సన్ వంటి కంపెనీలన్నీ సుమారు రెండున్నర లక్షల విలువైన డిస్కౌంట్లను ప్రకటించాయి.
Maruti Suzuki
కస్టమర్లకు వినూత్నమైన స్కీములను ప్రకటించిన Maruti Suzuki, రూ.9,800 విలువైన 2 గ్రాముల బంగారు(2 grams gold) సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. Maruti Suzuki అరెనాలో కార్ బుక్ చేస్తే చాలు ఈ చాన్స్ కొట్టేయవచ్చని ఊరిస్తోంది. Maruti Suzukiపై రూ.48,850 తగ్గింపుతో పాటు విటారా బ్రెజాపై అత్యధికంగా రూ. 55,000 డిస్కౌంట్ ఇస్తోంది. ఎస్-ప్రెస్సోపై రూ. 50,000, సెలేరియోపై రూ. 51,000 డిస్కౌంట్ లభిస్తోంది. డిజైర్ మోడల్ పై రూ. 41,000, Maruti Suzuki స్విఫ్ట్ పై రూ. 45,850, ఈకోపై రూ. 40,925 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ఇవన్నీ డీలర్షిప్ లెవెల్ లో ఉంటాయి కనుక మీకు స్థానికంగా అందుబాటులో ఉన్న ధరలను తప్పక తెలుసుకోండి. నవంబరు 1-15 తేదీల మధ్య బుక్ చేసుకున్న వాహనాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని Maruti Suzuki ప్రకటించింది.
Tata
Tata మోటర్స్ కొన్ని సెలెక్ట్ మోడల్స్ పై (select models) భారీగా ఆఫర్లను ప్రకటించింది. హారియర్, నెక్సాన్ డీజల్ పై నవంబరు 30 వరకు డీల్స్ ప్రకటించింది. టియాగోపై రూ.15,000పై కంజ్యూమర్ ఆఫర్ ప్రకటించిన Tata, ఎక్సేంజ్ బోనస్ గా రూ. 10,000 ప్రకటించింది. దీంతో మొత్తంగా రూ. 25,000 ఆఫర్ లభించే అవకాశముంది. Tata టైగర్ పై రూ. 15,000 కంజ్యూమర్ ఆఫర్ లభిస్తుండగా దీనికి అదనంగా ఎక్సేంజ్ బోనస్ రూ. 15,000 లభిస్తుంది. దీంతో మొత్తం రూ. 30,000 ఆఫర్ సొంతం చేసుకునే వెసులుబాటు లభించింది. నెక్సాన్ డీజల్ వర్షన్ పై ఎక్సేంజ్ బోనస్ గా రూ. 15,000, కంజ్యూమర్ ఆఫర్ రూ. 15,000 ఆఫర్ ప్రకటించడంతో మొత్తం రూ. 30,000 డిస్కౌంట్ లభించనుంది. Tata హ్యారియర్ పై కంజ్యూమర్ ఆఫర్ (consumer offer) రూ. 25,000, ఎక్సేంజ్ బోనస్ గా రూ. 40,000 డిస్కౌంట్ లభించనుండగా మొత్తం రూ. 65,000 బెనిఫిట్లు లభించనున్నాయి.
Hyundai
ఆకర్షణీయమైన ఫెస్టివల్ డిస్కౌంట్లు (festival discounts) ప్రకటించడంలో హ్యూడాయి ఇండియా కూడా దూసుకుపోతోంది. వివిధ మోడళ్లు, వేరియంట్లపై గరిష్ఠంగా లక్ష రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. ఎంట్రీ లెవెల్ మోడల్ అయిన Hyundai శాంట్రోపై రూ. 45,000 డిస్కౌంట్లో భాగంగా రూ. 25,000 వరకు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్సేంజ్ బోనస్ గా రూ. 15,000 డిస్కౌంట్ తోపాటు పాటు కార్పొరేట్ డిస్కౌంట్ గా రూ. 5,000 ప్రకటించింది. Hyundai గ్రాండ్ ఐ10పై అత్యధికంగా రూ. 60,000 బెనిఫిట్లను ప్రకటించింది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ గా రూ. 40,000, ఎక్సేంజ్ బోనస్ గా రూ. 15,000, గవర్నమెంట్ ఉద్యోగులకు రూ.5,000 డిస్కౌంట్ లభించనుంది. గ్రాండ్ ఐ10 నాయిస్ పై గరిష్ఠంగా రూ. 25,000 బెనిఫిట్ ప్రకటించగా ఇందులో రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్ తోపాటు రూ. 10,000 ఎక్సేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ గా (corporate discount) రూ. 5,000 ప్రకటించింది. Hyundai ఎలైట్ ఐ20పై గరిష్టంగా రూ. 75,000 డిస్కౌంట్ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు (government employees) అదనంగా రూ. 5,000 డిస్కౌంట్ ఇస్తోంది. Hyundai ఎలాంత్రాపై లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ ప్రకటించగా ఇందులో ఏకంగా రూ.70,000 క్యాష్ డిస్కౌంట్ కాగా రూ. 30,000 ఎక్సేంజ్ బోనస్ ప్రకటించింది.
Honda
పాత, కొత్త కస్టమర్లకు Honda సరికొత్త డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. నవంబరు 30 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. Honda జాజ్ (Honda jazz) అన్ని వేరియంట్లపై రూ.25,000 వరకు క్యాష్ డిస్కౌంట్ , ఎక్సేంజ్ బోనస్ గా రూ. 15,000 లభించనుంది. Honda అమేజ్ పెట్రోల్ వేరియంట్ పై రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, డీజల్ వర్షన్ పై రూ. 10,000 డిస్కౌంట్ ప్రకటించింది. అమేజ్ స్పెషల్ ఎడిషన్ పై రూ. 15,000 ఎక్సేంజ్ బోనస్ (exchange bonus) లభించనుండగా, క్యాష్ డిస్కౌంట్ రూ. 7,000 లభించనుంది. పెట్రోల్ వేరియంట్ పై మొత్తం బెనిఫిట్ గా రూ. 47,000, డిజల్ వేరియంట్ పై రూ. 37,000 ఆఫర్ ప్రకటించింది. Honda డబ్ల్యూఆర్-వీపై రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో మొత్తం బెనిఫిట్ గా రూ. 40,000 పొందే సొంతం చేసుకునే ఆఫర్ ప్రవేశపెట్టింది.
5వ తరం Honda (5th generation honda) సిటీపై ఎటువంటి క్యాష్ డిస్కౌంట్లు (cash discount) లేకపోయినా ఎక్సేంజ్ బోనస్ గా రూ. 30,000 ప్రకటించింది. ఇక Hondaలో అత్యధిక డిస్కౌంట్ (additional discount) పొందాలనుకుంటే Honda సివిక్ ఎంచుకోవాల్సిందే. Honda సివిక్ పెట్రోల్ వర్షన్ పై ఏకంగా లక్ష రూపాయల ఫెస్టివల్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ, డీజల్ వర్షన్ పై రూ. 2.5 లక్షల క్యాష్ డిస్కౌంట్లను అందుబాటులోకి తెచ్చింది.
Toyota
ప్రోత్సాహకాలు, కస్టమర్ డిస్కౌంట్లను (customer discount) ప్రకటించడంలో Toyota ఇండియా కూడా దూసుకుపోతోంది. Toyota లో అత్యంత చవకైన Toyota గ్లాంజా పై రూ. 15,000 డిస్కౌంట్, రూ. 5,000 కొర్పొరేట్ డిస్కౌంట్ ప్రకటించింది. రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ కస్టమర్ల కోసం అదనంగా రూ. 20,000 బెనిఫిట్లను Toyota ప్రకటించింది. మనదేశంలో అత్యధికంగా అమ్ముడుబోయే Toyota ఇన్నోవా క్రిస్టా పై రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్ ప్రకటించింది. పెట్రోల్ వేరియంట్స్ పై ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చేందుకే డీలర్లు మొగ్గుచూపుతున్నారు. కామ్రీ, ఫార్చూనర్, వెల్ పైర్ మోడల్స్ పై ఎటువంటి డిస్కోంట్లను Toyota ప్రస్తుతానికి ప్రకటించలేదు. కొత్తగా లాంచ్ అయిన Toyota అర్బన్ క్రూజర్ పై కేవలం ఎక్సేంజ్ బెనిఫిట్లను మాత్రమే ప్రకటించింది. Toyota గ్లాంజా, యారిస్ పై 55శాతం బైబాక్ ఆఫర్ అందుబాటులోకి తెచ్చిన Toyota , పలు ఈఎంఐ ఫైనాన్స్ స్కీములతో మన మార్కెట్ ను ఆకట్టుకుంటోంది. ఈఎంఐ హాలిడే స్కీమ్ (EMI holiday scheme)కింద తొలి త్రైమాసికంలో ఎటువంటి కంతులు (monthly installments) కట్టాల్సిన అవసరం లేని స్కీములు కూడా Toyota ప్రవేశపెట్టడం విశేషం.