హోమ్ /వార్తలు /బిజినెస్ /

Loan Offers: దీపావళికి బ్యాంకుల స్పెషల్ ఆఫర్లు.. తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..

Loan Offers: దీపావళికి బ్యాంకుల స్పెషల్ ఆఫర్లు.. తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్యాంక్ బజార్ డేటా ప్రకారం.. ఈ దీపావళికి తక్కువ వడ్డీ రేట్లతో పాటు వివిధ ఆఫర్లతో లోన్లు అందిస్తున్న బ్యాంకులు ఏవో చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Loan Offers : భారతదేశంలో ఫెస్టివల్ సీజన్(Festival Season) వచ్చిందంటే చాలు, కొనుగోళ్ల సందడితో మార్కెట్లలో హడావిడి నెలకొంటుంది. ముఖ్యంగా దసరా, దీపావళి సందర్భంగా చాలామంది కొత్త ఇల్లు, కొత్త కార్లు కొనుగోలు చేస్తుంటారు. కొంతమంది హోమ్ రెన్నొవేషన్, లగ్జరీ ఐటెమ్స్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. అయితే ఇలాంటి వారిని ఆకర్షించేందుకు బ్యాంకులు(Banks) ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. స్పెషల్ ఆఫర్లతో తమ కస్టమర్లకు తక్కువ వడ్డీకే లోన్లను(Loans For Low Intrest) ఆఫర్ చేస్తున్నాయి. 2022 అక్టోబర్ 12 నాటి బ్యాంక్ బజార్ డేటా ప్రకారం.. ఈ దీపావళికి తక్కువ వడ్డీ రేట్లతో పాటు వివిధ ఆఫర్లతో లోన్లు అందిస్తున్న బ్యాంకులు ఏవో చూద్దాం.

ఇండస్‌ఇండ్ బ్యాంక్

పండుగ సీజన్‌లో కార్లను కొనుగోలు చేయడానికి ఈ బ్యాంక్ 100 శాతం వరకు ఫైనాన్స్ అందిస్తోంది. అలాగే రూ. 50 లక్షల వరకు పర్సనల్ లోన్లను కూడా అందిస్తుంది. హోమ్ లోన్లను 30 సంవత్సరాల టెన్యూర్‌తో ఆఫర్ చేస్తోంది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు

ఈ పండుగ సీజన్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫెస్టివల్ బొనాంజా - 2022 పేరుతో ఆఫర్లు అందిస్తోంది. ఈ స్కీమ్ కింద హోమ్ లోన్, కార్ లోన్లపై ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలను పూర్తిగా మాఫీ చేస్తోంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

పండుగ సీజన్‌లో ఈ బ్యాంకు హోమ్, కార్ లోన్లపై ప్రాసెసింగ్ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.

Hair Transplant Fail : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ విఫలమై వ్యక్తి ఆత్మహత్య

బ్యాంక్ ఆఫ్ బరోడా

ఈ బ్యాంకు సంవత్సరానికి 8.45 శాతం వడ్డీరేటుతో హోమ్ లోన్లు అందిస్తోంది. కార్ లోన్ల వడ్డీ రేటు 8.45 శాతం నుంచి ప్రారంభమవుతుంది. కార్ లోన్లపై ఎలాంటి ఫోర్‌క్లోజర్ ఛార్జీలు లేవు.

 హెచ్‌డీఎఫ్‌సీ

ఈ బ్యాంక్ సంవత్సరానికి 7.9 శాతం వడ్డీతో కార్ లోన్లను అందిస్తోంది. 50 శాతం లోన్ టెన్యూర్ పూర్తయిన తర్వాత (కనీసం 24 నెలలు) ఎలాంటి ఫోర్‌క్లోజర్ ఛార్జీలు ఉండవు. ఈ బ్యాంకులో గోల్డ్ లోన్ల ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం మాఫీ ఉంది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఈ బ్యాంకు సంవత్సరానికి 7.50 శాతం ప్రారంభ వడ్డీతో హోమ్ లోన్లను అందిస్తోంది. రీపేమెంట్ వ్యవధి 75 సంవత్సరాల వరకు ఉంటుంది. దీనిపై ఎలాంటి ముందస్తు చెల్లింపు ఛార్జీలు లేవు. కార్ లోన్లపై వడ్డీ సంవత్సరానికి 7.65 శాతం నుంచి ప్రారంభమవుతుంది. వీటిపై ప్రాసెసింగ్ ఫీజులు లేవు.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

ఈ బ్యాంకు హోమ్ లోన్లపై 8.30 శాతం వడ్డీ, కార్ లోన్లపై 8.70 శాతం వడ్డీని అందిస్తోంది. ప్రాసెసింగ్ ఛార్జీలను కూడా మాఫీ చేసింది.

స్టేట్‌బ్యాంక్

స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సంవత్సరానికి 8.4 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేటుతో హోమ్ లోన్లు, 8.8 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీరేటుతో టాప్ అప్ రుణాలను అందిస్తోంది. అయితే ఈ పండుగ సీజన్లో ఈ లోన్లపై బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేసింది.

జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్

ఈ బ్యాంకు 11.75 శాతం వడ్డీ రేటుతో పర్సనల్ లోన్లను అందిస్తోంది. బ్యాంక్ రూ. 5,000-రూ. 75,000 వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. ఈ లోన్‌ను ఫోర్‌క్లోజ్ చేస్తే, ప్రాసెసింగ్ ఛార్జీలు వర్తించవు. ముందస్తు చెల్లింపు పెనాల్టీ కూడా లేదు.

 ICICI బ్యాంక్

ఈ ప్రైవేట్ బ్యాంకు ప్రస్తుతం కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ ఫెసిలిటీని అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు రూ. 999గా ఉంది. డాక్యుమెంట్లు, లోన్ ఫారమ్‌లను సమీక్షించిన వెంటనే ఈ బ్యాంకు ప్రీ-అప్రూవ్డ్ లోన్‌లను మంజూరు చేస్తుంది. పర్సనల్ లోన్లపై 12 EMIల తర్వాత ప్రీ-క్లోజర్ ఛార్జీలు ఉండవు. కారు లోన్లపై ప్రాసెసింగ్ ఫీజు రూ. 1,999 కాగా, కొత్త కారు లోన్లపై ఆన్-రోడ్ ధరలో 100 శాతం వరకు లోన్ అందిస్తుంది. కార్ లోన్లపై ఫోర్‌క్లోజర్, ప్రీపేమెంట్ ఛార్జీలు లేవు.

First published:

Tags: Bank loans, Diwali 2022

ఉత్తమ కథలు