హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Silver Prices: శుభవార్త.. రూ.3 వేలు పడిపోయిన బంగారం, వెండి ధరలు.. 2 వారాల్లోనే భారీ తగ్గుదల!

Gold Silver Prices: శుభవార్త.. రూ.3 వేలు పడిపోయిన బంగారం, వెండి ధరలు.. 2 వారాల్లోనే భారీ తగ్గుదల!

Gold Silver Prices: శుభవార్త.. రూ.3 వేలు పడిపోయిన బంగారం, వెండి ధరలు.. 2 వారాల్లోనే భారీ తగ్గుదల!

Gold Silver Prices: శుభవార్త.. రూ.3 వేలు పడిపోయిన బంగారం, వెండి ధరలు.. 2 వారాల్లోనే భారీ తగ్గుదల!

Gold Rate Today | బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి తీపికబురు. పసిడి రేటు గత రెండు వారాల కాలంలో భారీగా పడిపోయింది. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Gold Price Today | బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకని అనుకుంటున్నారా? పసిడి రేటు (Gold Rate) పడిపోయింది. రెండు వారాల వ్యవధిలోనే పసిడి రేటు భారీగా దిగి వచ్చింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. బంగారం ధర (Gold Price) బాటలోనే వెండి కూడా పయనించింది.

హైదరాబాద్‌లో బంగారం ధరలను గమనిస్తే.. అక్టోబర్ 9న బంగారం ధర గరిష్ట స్థాయిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అప్పుడు 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 47,850 వద్ద ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర అయితే 10 గ్రాములకు రూ. 52,200 వద్ద ఉంది. అయితే అటు పైన బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.

ఒక్కసారి చార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి రావొచ్చు.. 5 చౌక ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలను చూస్తే.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,200 వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 47 వేల వద్ద కొనసాగుతోంది. అంటే బంగారం ధరలు రూ. 1000 వరకు పతనమయ్యాయని చెప్పుకోవచ్చు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం.

ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ దీపావళి లోన్ ఆఫర్లు.. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు!

అలాగే రెండు వారాల కిందట వెండి రేటు కేజీకి ఏకంగా రూ. 66 వేల వద్ద ఉండేది. అయితే ఇప్పుడు చూస్తే సిల్వర్ రేటు భారీగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి రేటు కేజీకి రూ. 63 వేల వద్ద కొనసాగుతోంది. అంటే వెండి ధర ఏకంగా రూ. 3 వేలకు పడిపోయిందని చెప్పుకోవచ్చు. వెండి గజ్జలు/ పట్టీలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

కాగా పైన పేర్కొన్న బంగారం ధరలకు జీఎస్‌టీ , తయారీ చార్జీలు, జువెలర్స్ ప్రాఫిట్ మార్జిన్ వంటివి అదనం అని చెప్పుకోవాలి. అందువల్ల బంగారం ధరల్లో కొంత మేర వ్యత్యాసం ఉండొచ్చు. అందువల్ల దగ్గరిలోని జువెలరీ షాపుకు వెళ్లి బంగారం ధర ఎంత ఉందో కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇకపోతే వచ్చే ఏడాదిలో బంగారం ధరలు కొత్త రికార్డ్ స్థాయికి చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని, ఇప్పుడు కొంటే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

First published:

Tags: Gold, Gold Price Today, Gold Rate Today, Silver price, Silver rate