Diwali 2021 Car Offers: దీపావళికి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఈ మోడళ్లపై బెస్ట్ ఆఫర్లను పరిశీలించండి..

ప్రతీకాత్మక చిత్రం

దీపావళి పండుగకు కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. దీంతో, అన్ని ఫోర్​వీలర్​ సంస్థలు తమ వాహనాలపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించాయి. హ్యుందాయ్​, నిస్సాన్, హోండా, డాట్సన్ మొదలైన ప్రముఖ బ్రాండ్లు ఇప్పటికే ఆఫర్లను ప్రకటించాయి.

  • Share this:
దేశంలో అతిపెద్ద పండుగ సీజన్​ మొదలైంది. దసరా, దీపావళి పర్వదినాల్లో కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడాన్ని చాలా మంది సెంటిమెంట్​గా భావిస్తారు. అందుకే, ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా పండుగ సమయాల్లో వాహనాల అమ్మకాలు జోరందుకోనున్నాయి. ఇప్పటికే దసరా పండుగ సందర్భంగా గణనీయమైన అమ్మకాలు జరిగాయి. ఇక దీపావళి (Diwali 2021) పండుగకు కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. దీంతో, అన్ని ఫోర్​వీలర్​ సంస్థలు తమ వాహనాలపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించాయి. హ్యుందాయ్​, నిస్సాన్, హోండా, డాట్సన్ మొదలైన ప్రముఖ బ్రాండ్లు ఇప్పటికే ఆఫర్లను ప్రకటించాయి. మీరు ఈ దీపావళికి కొత్త కారు కొనే ప్లాన్​లో ఉంటే.. ఏ కారుపై ఎలాంటి ఆఫర్​ అందుబాటులో (Car discounts in Diwali) ఉందో తెలుసుకోండి.

దీపావళికి ప్రముఖ కార్లపై డిస్కౌంట్లు ఇవే..
హ్యుందాయ్
దీపావళి పండుగ సందర్భంగా హ్యుందాయ్ సంస్థ కొన్ని మోడల్స్​పై (Hyundai Diwali 2021 sale) భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.​ శాంట్రో (పెట్రోల్) మోడల్​పై రూ. 40,000, హ్యుందాయ్ i20 (పెట్రోల్/డీజిల్) మోడల్​పై రూ. 40,000, హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS (పెట్రోల్/డీజిల్) మోడల్​పై రూ. 50,000, హ్యుందాయ్ ఆరా (పెట్రోల్/డీజిల్) మోడల్​పై రూ. 50,000 డిస్కౌంట్​ అందిస్తోంది.

Life Expectancy: ఆ గ్రామ మహిళల ఆయుర్దాయం 95 సంవత్సరాలు.. రికార్డు స్థాయి ఆయుష్షుకు కారణం ఏంటంటే..

హోండా
దీపావళి పండుగ సందర్భంగా హోండా సంస్థ కొన్ని మోడల్స్​పై (Honda Diwali 2021 sale) భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. కొత్త హోండా అమేజ్ మోడల్​పై రూ. 18,000, 4 వ తరం హోండా సిటీ మోడల్​పై రూ. 22,000, కొత్త హోండా WR-V మోడల్​పై రూ. 40,100, కొత్త హోండా జాజ్ మోడల్​పై రూ. 45,900, 5వ తరం హోండా సిటీ మోడల్​పై రూ. 53,500 డిస్కౌంట్​ అందిస్తోంది.

నిస్సాన్
దీపావళి పండుగ సందర్భంగా నిస్సాన్​ సంస్థ కొన్ని మోడల్స్​పై(Nissan Diwali 2021 sale) భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. 1.3 -లీటర్, 1.5 -లీటర్ నిస్సాన్ కిక్స్ మోడళ్లపై రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ఈ మోడల్​పై రూ.15 వేల క్యాష్​ బెనిఫిట్​, రూ. 70 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5 వేల ఆన్‌లైన్ బుకింగ్ బోనస్, రూ. 10 వేల కార్పొరేట్ బెనిఫిట్​ అందజేస్తుంది. కేవలం 7.99 శాతం వడ్డీరేటుకే కార్​ లోన్​ ఇచ్చేలా బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది

Telangana Covid Vaccination: తెలంగాణలో నాలుగు రోజుల పాటు వ్యాక్సినేషన్‌ బంద్.. కారణమిదే..

డాట్సన్
దీపావళి పండుగ సందర్భంగా డాట్సన్​ సంస్థ కొన్ని మోడల్స్​పై (Datsun Diwali 2021 sale) భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. డాట్సన్ రెడి-జిఓ మోడల్​పై రూ. 40 వేల ప్రయోజనాలు అందిస్తోంది. క్యాష్​ బెనిఫిట్​ కింద రూ. 20 వేలు, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 15 వేలు, కార్పొరేట్ బెనిఫిట్స్​ కింద రూ. 5 వేల డిస్కౌంట్​ ప్రకటించింది. మరోవైపు డాట్సన్ గో, గో ప్లస్​ మోడళ్లపై కూడా రూ. 40 వేల ప్రయోజనాలు అందజేస్తుంది. క్యాష్​ బెనిఫిట్ కింద రూ. 20 వేలు, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 20 వేల డిస్కౌంట్​ అందిస్తోంది.

పై ఆఫర్లన్నీ అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ప్రయోజనాలు వేరియంట్​, లొకేషన్‌ బట్టి మారవచ్చు. ఆఫర్ల గురించి మరిన్ని వివరాల కోసం సమీపంలోని డీలర్‌షిప్‌ సెంటర్లను సందర్శించండి.
Published by:Sumanth Kanukula
First published: