news18-telugu
Updated: November 11, 2020, 7:48 PM IST
ఫ్రతీకాత్మకచిత్రం
దీపావళి ఆఫర్లు అనగానే మనకు కార్లపై వివిధ కంపెనీలు ఇస్తున్న ఊరించే ఆఫర్లు గుర్తుకువస్తాయి. ఇటీవలే మన మార్కెట్లోకి అడుగుపెట్టిన కియా మోటర్స్ దివాలీ సేల్స్ (Diwali sales) లో భాగంగా అదిరిపోయే బొనాంజా ప్రకటించింది. గరిష్ఠంగా రూ.2.5 లక్షల బెనిఫిట్లు లభించేలా ఈ సేల్ ప్రారంభమైంది. కియా కార్నివాల్ ప్రీమియం ఎంపీవీపై (Kia Carnival MPV ) ఈ బోనస్ పొందాలంటే మాత్రం వినియోగదారులు ఎక్సేంజ్ బోనస్ రూపంలోనే అందుకోగలరు. వీటితో పాటు కార్పొరేట్ డిస్కౌంట్లను అందిస్తున్న కియా మోటర్స్ (Kia Motors India ), ఏఎంసీ ప్యాక్స్, యాక్సెసరీస్ రూపంలో డిస్కౌంట్ సేల్ (discount sale) మొదలుపెట్టింది. సౌత్ కొరియా కార్ మేకర్ అయిన కియా ఈఏడాది నవంబరు 31 వరకు ఆఫర్ ను అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించింది.
రోడ్ పై కార్నివాల్ఈ ఏడాది ఆరంభంలో ఆటో ఎక్స్ పోలో కియా కార్నివాల్ ఎంపీవీని Kia Carnival MPV అధికారికంగా ఆవిష్కరించిన కియా వీటి ప్రారంభ ధరలు రూ.24.95 లక్షలుగా నిర్ణయించింది. కియా కార్నివాల్ హై ఎండ్ మోడల్ గరిష్ఠ ధర రూ. 33.95 లక్షలు (ఎక్స్ షోరూం ఢిల్లీ) పై కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయని ప్రకటించడం విశేషం. బీఎస్6 కలిగి ఉన్న ఈ వాహనం, 2.2 లీటర్ VGT డీజిల్ ఇంజిన్ సామర్థ్యంతో రహదారిపై రివ్వుమని దూసుకుపోయే సామర్థ్యంతో మార్కెట్లో ఆకట్టుకుంటోంది. రోడ్డుపై నిజంగా కార్నివాల్ జరుపుకునే భావను ఈ మోడల్ తో సొంతం చేసుకోవచ్చనే రివ్యూలు ఈ కారు సేల్స్ కు కలిసివచ్చాయి.
సెల్టోస్ పై ఆఫర్ లేదు
మనదేశంలో హాట్ కేక్ లా అమ్ముడుపోతున్న కియా కార్ సెల్టోస్ (Seltos ) SUV పై మాత్రం ఎటువంటి దీపావళి ఆఫర్ ను ప్రకటించని కియా సోనెట్ (Sonet)పై కూడా ఎలాంటి ఆఫర్లు ఇవ్వడం లేదు. 2 నెలల క్రితమే మన మార్కెట్లోకి అడుగుపెట్టిన Subcompact SUV మోడల్స్ లో సోనెట్ దూసుకుపోతోంది. సోనెట్ ఆరంభ ధర రూ. 6.71 లక్షలు (ఎక్స్ షోరూం) కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధరలు రూ.12.89 లక్షలు (ఎక్స్ షోరూం). 1.2 లీటర్ల పెట్రోల్, 1.5 లీటర్ల డీజిల్, 1.0 లీటర్ల టర్బో GDi సబ్ కాంపాక్ట్ ఎ SUV లో పవర్ ట్రైన్ ఆప్షన్స్ లో సోనెట్ అందుబాటులో ఉంది. ఇటీవలే సెల్టోస్ యానివర్సరీ ఎడిషన్ ను (seltos anniversary edition) మనదేశంలో లాంచ్ చేసిన కియా వీటి ప్రారంభ ధర రూ. 13.75 లక్షలు (ఎక్స్ షోరూం)గా ప్రకటించింది.
రోజుకు 100 కార్లు బుకింగ్
కియా సోనెట్ కార్ల సేల్స్ సూపర్ గా ఉన్నాయని కియా మోటర్స్ ఇప్పటికే ప్రకటించగా, సగటున రోజుకు 1,000 కార్లు బుక్ అవుతున్నట్టు వివరించింది. సోనెట్ పై ఆటో నిపుణులు, కస్టమర్లు అద్భుతమైన రివ్యూలు ఇస్తుండడంతో రేటింగ్ పరంగానూ సోనెట్ మోడల్ అందరి మన్ననలు పొందుతోంది. దీంతో సోనెట్ బుకింగ్ ఎలా అన్న విషయంపై నెట్ లో వెతుకుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కియా అఫిషియల్ వెబ్ సైట్లో కేవలం రూ.25,000 చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కియా కల్పిస్తోంది. కాగా ఈ వాహనాన్ని సొంతం చేసుకోవాలంటే బుకింగ్ తరువాత మోడల్ ను బట్టి 8-9 వారాలపాటు వేచి చూడాల్సిందే. సోనెట్ EMI కనిష్టంగా ఉండడంతో సేల్స్ బాగా పుంజుకుంటున్నాయి. కనిష్ఠంగా రూ. 10,000 లోపున్న ఈఎంఐ కూడా సోనెట్ సేల్స్ (sonet sales) పెరిగేందుకు ప్రధాన కారణం. పెట్రోల్, డీజల్ వేరియంట్లతో కలిసి మొత్తం 16 వేరియంట్లలో అందుబాటులో ఉన్న సోనెట్ సేఫ్టీ, వైల్డ్ డిజైన్ (wild design) తో అట్రాక్టివ్ గా మార్కెట్ ను రూల్ చేస్తోంది. మొత్తానికి రూ. 2.5 లక్షల విలువైన దీపావళి బొనాంజాలు (Diwali bonanza) మోసుకొచ్చిన కియా కార్నివాల్ అన్ని వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
Published by:
Krishna Adithya
First published:
November 11, 2020, 7:48 PM IST