ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే రూ.6500 వరకు బెనిఫిట్స్ పొందొచ్చని బ్యాంకు ప్రకటించింది. కస్టమర్లు యోనో ఎస్బీఐ ప్లాట్ఫామ్లో కొత్త క్రెడిట్ కార్డు కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI డిజిటల్ ప్లాట్‌ఫామ్ యోనో ఎస్బీఐలో అనేక సేవలు లభిస్తాయి. యోనో ఎస్బీఐ వెబ్సైట్ లేదా యాప్‌లో ఈ సేవలు పొందొచ్చు. ఇదే ప్లాట్‌ఫామ్ నుంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు కూడా అప్లై చేయొచ్చు. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది ఎస్బీఐ. యోనో ఎస్బీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేస్తే కార్డు అప్రూవ్ కాగానే రూ.6500 వరకు ఇ-వోచర్స్ లభిస్తాయి. ఎస్బీఐ పలు రకాల క్రెడిట్ కార్డుల్ని అందిస్తుంది. వాటి ఛార్జీలు, బెనిఫిట్స్ తెలుసుకొని మీకు కావాల్సిన కార్డు సెలెక్ట్ చేయాలి. యోనో ఎస్బీఐ యాప్‌లోనే మీరు క్రెడిట్ కార్డుల్ని కంపేర్ చేసి చూడొచ్చు.
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు తీసుకుంటే రూ.6500 బెనిఫిట్స్
EPF Balance: రెండు రోజుల్లో ఈపీఎఫ్ వడ్డీ మీ అకౌంట్లోకి... బ్యాలెన్స్ చెక్ చేయండి ఇలా
SBI Credit Card: యోనో యాప్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు అప్లై చేయండిలా
ముందుగా గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో యోనో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
మీ క్రెడెన్షియల్‌తో యోనో ఎస్బీఐ యాప్ లాగిన్ చేయాలి.
హోమ్ స్క్రీన్‌లో Cards సెక్షన్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాతి స్క్రీన్‌లో Get a new SBI Credit Card ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాతి స్టెప్‌లో మీకు కావాల్సిన కార్డు సెలెక్ట్ చేయాలి.
ఆ తర్వాత స్క్రీన్‌లో మీరు ఎంచుకున్న కార్డుపై వచ్చే లాభాలు, ఫీచర్స్, ఫీజులు, ఇతర ఛార్జీల వివరాలు కనిపిస్తాయి.
వివరాలన్నీ చదివిన తర్వాత మీరు ఆ కార్డు తీసుకోవాలనుకుంటే Apply Now పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మీరు నివసించే సిటీని సెలెక్ట్ చేయాలి.
ఆ తర్వాత Proceed పైన క్లిక్ చేయాలి.
ఆ లిస్టులో మీ సిటీ లేకపోతే ఎస్బీఐ కార్డు హెల్ప్ లైన్ నెంబర్ 30020202 కు కాల్ చేయాలి.
ఈ నెంబర్ ముందు లోకల్ ఎస్టీడీ కోడ్ ఎంటర్ చేసి డయల్ చేయాలి.
ఆ తర్వాత మీ ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ సెలెక్ట్ చేయాలి.
మీ వివరాలు ఆటోమెటిక్‌గా నమోదౌతాయి.
ఆ తర్వాత I Agree ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
మీ క్వాలిఫికేషన్, వృత్తి, వార్షికాదాయం లాంటి వివరాలను ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత Send OTP పైన క్లిక్ చేయాలి.
ఎస్బీఐ కార్డ్ ఇ-అప్లికేషన్‌కు సంబంధించిన ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి మీ దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీ అర్హతల్ని బట్టి మీకు కార్డు ఇవ్వాలో లేదో బ్యాంకు నిర్ణయిస్తుంది.
మీకు కార్డు పొందే అర్హత ఉంటే మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కు క్రెడిట్ కార్డు వస్తుంది.