హోమ్ /వార్తలు /బిజినెస్ /

Distribution Costs: లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలపై పెరగనున్న ఖర్చులు.. కస్టమర్లకు బెనిఫిట్.. కొత్త రూల్స్‌ ఇలా!

Distribution Costs: లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలపై పెరగనున్న ఖర్చులు.. కస్టమర్లకు బెనిఫిట్.. కొత్త రూల్స్‌ ఇలా!

లైఫ్ ఇన్సూరెన్స్  కస్టమర్లకు బెనిఫిట్

లైఫ్ ఇన్సూరెన్స్ కస్టమర్లకు బెనిఫిట్

బ్యాంకులు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు షేర్‌హోల్డర్లుగా, ప్రమోటర్లుగా వ్యవహరిస్తాయి. కస్టమర్లతో బీమా పాలసీలు చేయించడంలో బ్యాంకులది ముఖ్య పాత్ర. దీంతో బ్యాంకులతో ఒప్పందం కుదర్చుకున్న ఇన్సూరెన్స్ కంపెనీలకు డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ప్రభావం కాస్త తక్కువగా పడే అవకాశం ఉంటుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇన్సూరెన్స్‌ భద్రతను ఎక్కువ మంది ప్రజలకు అందించే దిశగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ చర్యలు తీసుకుంటోంది. వేగంగా కొత్త కొత్త సంస్కరణలను తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI) 2023 రెగ్యులేషన్స్ నేటి నుంచే అమలులోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇకపై డిస్ట్రిబ్యూషన్ ఖర్చుల భారం పెరగనుంది. కమీషన్‌ పేమెంట్లపై నియంత్రణాధికారం అథారిటీకి ఉండబోదు. దీంతో కమిషన్‌‌ని నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఏర్పడుతుంది. ఫలితంగా మార్కెట్లో పోటీతత్వం, డిమాండ్ పెరిగి కంపెనీలకు డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు ఎక్కువ కానున్నాయి. అంతిమంగా ఔత్సాహిక పాలసీదారులు, కస్టమర్లు లబ్ధి పొందే అవకాశం ఉంది.

* ఏజెంట్లకు డిమాండ్

ఐఆర్‌డీఏఐ నూతన నిబంధనల ప్రకారం కమిషన్‌ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇష్టారీతిన పెంచేందుకు వీలు లేదు. మేనేజ్‌మెంట్ వ్యయాలకు లోబడే ఈ కమిషన్‌ని ప్రకటించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిర్ణయం ఏజెంట్లకు, మధ్యవర్తులకు కలిసి రానుంది. పాలీసీలు చేయిస్తే, ప్రొడక్ట్‌ని పంపిణీ చేస్తే ఎక్కువ కమిషన్ ఇవ్వాలని కంపెనీలకు కోరే అవకాశం ఏజెంట్లకు, మధ్యవర్తులకు ఉంటుంది. ఫలితంగా వారు డిమాండ్ చేసిన మేరకు కమిషన్‌ని కంపెనీలు తప్పక ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ కంపెనీలకు భారం అవుతుంది. ముఖ్యంగా బ్యాంకులు ప్రమోట్ చేయని కంపెనీలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

* మార్కెట్లో పోటీతత్వం

కమిషన్‌పై కంపెనీలకు స్వేచ్ఛ ఇవ్వడంతో కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. మార్కెట్ షేర్‌ని పెంచుకోవడానికి అన్ లిస్టెడ్ కంపెనీలు ఏజెంట్లకు ఎక్కువ కమిషన్‌ని ఆఫర్ చేసే ఛాన్స్ ఉంటుంది. లాభం కన్నా మార్కెట్‌ని వ్యాప్తి చేసుకోవడమే లక్ష్యంతో ఈ తరహా కంపెనీలు పావులు కదుపుతుంటాయి. దీంతో కొన్ని కంపెనీలు ఏజెంట్లతో బేరం చేసుకునేందుకు ట్రై చేస్తాయి. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య ‘కమిషన్ వార్స్’ జరిగే ముప్పు ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు మాత్రం పెరగకుండా ఆగవని చెబుతున్నారు.

* వీటిపై కాస్త తక్కువ

బ్యాంకులు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు షేర్‌హోల్డర్లుగా, ప్రమోటర్లుగా వ్యవహరిస్తాయి. కస్టమర్లతో బీమా పాలసీలు చేయించడంలో బ్యాంకులది ముఖ్య పాత్ర. దీంతో బ్యాంకులతో ఒప్పందం కుదర్చుకున్న ఇన్సూరెన్స్ కంపెనీలకు డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ప్రభావం కాస్త తక్కువగా పడే అవకాశం ఉంటుంది.

* ఇన్సూరెన్స్ కంపెనీలకు చక్కటి అవకాశం

ఐఆర్‌డీఏఐ నిబంధనలు సవరించడంతో ఇన్సూరెన్స్ కంపెనీలకు కొంతమేర ఫ్లెక్సిబిలిటీ ఏర్పడనుంది. ఇదివరకు ఒక్కో ఇన్సూరెన్స్ క్యాటగిరీకి ఒక్కో కమిషన్ లిమిట్ ఉండేది. ఫలితంగా ఖర్చులను క్రమబద్ధీ కరించుకోవడంలో కంపెనీలకు కాస్త ఇబ్బందులు తలెత్తేవి. ఐఆర్‌డీఏఐ నిర్ణయంతో కమిషన్ నిర్ణయించుకునే స్వేచ్ఛ కంపెనీలకు దక్కింది. దీంతో వివిధ పాలసీలపై అయ్యే ఖర్చులను మెరుగ్గా నిర్వహించుకునే సౌలభ్యం కంపెనీలకు కలగనుంది. పైగా, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించే ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.

* కస్టమర్లకు బెనెఫిట్

ఐఆర్‌డీఏఐ నిర్ణయంతో పరోక్షంగా కస్టమర్లు బెనిఫిట్ పొందనున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు మెరుగైన పాలసీలను రూపొందించి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. దీంతో కస్టమర్‌కు సరసమైన ధరకే మంచి పాలసీ పొందే అవకాశం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

First published:

Tags: Insurance, Life Insurance

ఉత్తమ కథలు