హోమ్ /వార్తలు /బిజినెస్ /

Dish Tv Contest: క్రికెట్ కాంటెస్ట్‌లో గెలిస్తే ఒక నెల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్

Dish Tv Contest: క్రికెట్ కాంటెస్ట్‌లో గెలిస్తే ఒక నెల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్

Dish Tv Contest: క్రికెట్ కాంటెస్ట్‌లో గెలిస్తే ఒక నెల డిష్ టీవీ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్
(ప్రతీకాత్మక చిత్రం)

Dish Tv Contest: క్రికెట్ కాంటెస్ట్‌లో గెలిస్తే ఒక నెల డిష్ టీవీ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ (ప్రతీకాత్మక చిత్రం)

Dish Tv-World Cup Contest | డిష్కియాన్ యాప్‌లో పరిమిత సమయంలో మాత్రమే గేమ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. వరుసగా 5 సార్లు సరైన సమాధానాలు చెప్పినవారికి ఒక నెల ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

  ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సీజన్ సందర్భంగా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి కంపెనీలు. డీటీహెచ్ ఆపరేటర్ డిష్ టీవీ కూడా ఆఫర్ ప్రకటించింది. సబ్‌స్క్రైబర్లకు ఉచితంగా ఒక నెల సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ ప్రకటించింది డిష్ టీవీ. ఈ ఆఫర్ పొందాలంటే ఓ గేమ్ ఆడాల్సి ఉంటుంది. క్రికెట్ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో ప్రెడిక్ట్ చేయాలి. ఈ గేమ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే సబ్‌స్క్రైబర్లు 608 నెంబర్ ఛానెల్ ఓపెన్ చేయాలి. డిష్కియాన్ యాప్‌లో ఈ గేమ్ ఆడాలి. క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో ఈ సర్వీస్ యాక్టీవ్‌లో ఉంటుంది. ప్రతీ మ్యాచ్‌ ఫలితాన్ని ప్రెడిక్ట్ చేసే అవకాశం సబ్‌స్క్రైబర్లకు లభిస్తుంది. విజేతను మీరు ప్రెడిక్ట్ చేయాలనుకుంటే సూచించిన నెంబర్‌కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌తో మిస్డ్ కాల్ ఇవ్వాలి. డిష్కియాన్ యాప్‌లో పరిమిత సమయంలో మాత్రమే గేమ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. వరుసగా 5 సార్లు సరైన సమాధానాలు చెప్పినవారికి ఒక నెల ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.


  కొత్త సబ్‌స్క్రైబర్లను ఆకట్టుకోవడంతో పాటు ప్రస్తుతం ఉన్న సబ్‌స్క్రైబర్లను నిలుపుకోవడానికి ఈ ఆఫర్ ప్రకటించింది డిష్ టీవీ. ఈ ఒక్క డీటీహెచ్ కంపెనీ మాత్రమే కాదు... ఇతర కంపెనీలు కూడా కొత్త ఆఫర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం టాటా స్కై బింజ్ సర్వీస్ ప్రారంభమైంది. సెట్-టాప్ బాక్సుల ధరల్ని కూడా తగ్గించింది టాటాస్కై. దాంతో పాటు రీజనల్ ప్యాక్స్ ధరల్లో మార్పులు కూడా చేసింది. ఇటు డిష్ టీవీ కూడా నాలుగు స్పోర్ట్స్ ఛానెల్ ప్యాక్స్‌ని అందిస్తోంది. రూ.147 విలువైన భారత్ క్రికెట్ ప్యాక్‌లో 191 ఛానెల్స్ వస్తాయి. మ్యాక్సి స్పోర్ట్స్ ప్యాక్ ధర రూ.326. ఇందులో 213 ఛానెల్స్ వస్తాయి. ఇక 225 ఛానెల్స్‌తో రూ.385 ధరకు సూపర్ స్పోర్ట్స్ ప్యాక్ అందిస్తోంది.


  Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి  ఇవి కూడా చదవండి:


  Health Tips: సైకిల్ తొక్కితే వచ్చే 10 లాభాలు ఇవే... తెలుసుకోండి


  Govinda App: తిరుమలలో రూమ్ నుంచి దర్శనం వరకు... యాప్‌లో బుక్ చేయండి ఇలా


  LIC SMS Service: ఒక్క ఎస్ఎంఎస్‌తో ఎల్ఐసీ పాలసీ స్టేటస్ తెలుసుకోవచ్చు ఇలా

  First published:

  Tags: Cricket World Cup 2019, Dish TV, DTH, ICC Cricket World Cup 2019, TRAI

  ఉత్తమ కథలు