ఫెస్టివల్ సీజన్‌లో మార్కెట్ పెంచుకోవడంపై ప్రధాన కంపెనీలు దృష్టిసారిస్తున్నాయి. తమ ప్రొడక్ట్స్‌పై అదిరిపోయే ఆఫర్లు, డిస్కౌంట్ల(Discounts)తో బెస్ట్ డీల్స్ అందిస్తూ కస్టమర్లను కట్టిపడేస్తున్నాయి. దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్(Amazon)గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఇప్పుడు ఫైనల్ డేస్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్(Electronic gadgets)మొదలుకొని హోమ్ యాక్సెసరీస్(Home Accessories)వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై బెస్ట్ ఆఫర్లను అందిస్తోంది. వివిధ బ్రాండ్స్‌కు చెందిన ప్రీమియం స్మార్ట్ వాచ్‌లపై ఉన్న ఆఫర్లను పరిశీలిద్దాం.
టైటాన్ స్మార్ట్ ప్రో..
టైటాన్ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ వాచ్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది అమోలెడ్ డిస్‌ప్లేతో లభిస్తుంది. ఈ ప్రీమియం స్మార్ట్ వాచ్ 5ATM వాటర్ రెసిస్టెంట్‌తో ఐదు కలర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఆక్సిజన్ లెవల్స్ మానిటరింగ్ చేయడానికి SpO2 ట్రాకర్ వంటి అదనపు ఫీచర్ కూడా ఇందులో ఉంది. బ్యాటరీ లైఫ్ 14 రోజుల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. టైటాన్ స్మార్ట్ ప్రో స్మార్ట్‌వాచ్‌పై అమెజాన్ 27 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో దీన్ని రూ.10,995కు సొంతం చేసుకోవచ్చు.
అమెజ్‌ఫిట్ GTR 2..
ఈ స్మార్ట్‌వాచ్ అలెక్సా బిల్ట్ ఇన్‌తో లభిస్తుంది. 40 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్ దీంట్లో ఉన్నాయి. ఇందులో జీపీఎస్ ఇన్ బిల్ట్‌గా వస్తుంది. ఈ ప్రీమియం స్మార్ట్ వాచ్‌లో 1.39-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. స్ట్రెస్ మానిటరింగ్‌తో పాటు SpO2 ట్రాకర్ వంటి అదనపు ఫీచర్‌ను అందిస్తుంది. 14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఈ ప్రీమియం స్మార్ట్ వాచ్‌పై అమెజాన్ ఏకంగా 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో దీన్ని రూ. 8,999కు కొనుగోలు చేయవచ్చు.
ఫాసిల్ జెన్ 5 గారెట్ స్టెయిన్‌లెస్ స్టీల్..
ఈ ప్రీమియం స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ , ఐఓఎస్ డివైజ్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఇది 1.28-అంగుళాల డిస్‌ప్లేతో లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో గంటలోపు 80% వరకు ఛార్జ్ అవుతుంది. ఎక్స్‌ట్రా హ్యాపీనెస్ డేస్ సేల్ సందర్భంగా ఈ స్మార్ట్‌వాచ్‌పై 35 శాతం డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. దీంతో దీన్ని ₹14,995కు సొంతం చేసుకోవచ్చు.
శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 4 బ్లూటూత్..
శామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఈ ప్రీమియం స్మార్ట్‌వాచ్ అదిరిపోయే ఫీచర్లతో లభిస్తుంది. బాడీ కంపెషన్ అనాలసిస్ కోసం ఈ వాచ్‌లో బయోఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ అనాలిసిస్ సెన్సార్‌ను అమర్చారు. అలాగే ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఈ ప్రీమియం వాచ్ గరిష్టంగా 90+ వర్కవుట్‌లను ట్రాక్ చేస్తుంది. గరిష్టంగా 40 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా అమెజాన్ ఈ స్మార్ట్‌వాచ్‌పై బంపరాఫర్ ప్రకటించింది. ఒరిజినల్ ధరపై ఏకంగా 61 శాతం డిస్కౌంట్‌తో రూ.11,840కే దీన్ని కొనుగోలు చేయవచ్చు.ఐసీఐసీఐ, యాక్సిస్, సిటీ బ్యాంకుల క్రెడిట్ కార్ట్స్, ఈఎంఐ లావాదేవీలపై అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.