ఈ నెలలో కొత్త కారు (Car) కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్ చెప్పింది ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్. ఫెస్టివల్ సీజన్లో వివిధ మోడళ్లపై ఆఫర్లను ప్రకటించిన ఈ దక్షిణ కొరియా దిగ్గజం, తాజాగా తమ లైనప్‌లోని కొన్ని కార్లపై మరోసారి డిస్కౌంట్లు (Car Discounts) అందిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. 2022 నవంబర్‌లో సెలక్టెడ్ మోడళ్లను కొనుగోలు చేసేవారు, రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఆఫర్ల వివరాలు చూడండి.
ఈ మోడళ్లపైనే
హ్యుందాయ్ కంపెనీ నవంబర్‌లో సెలక్టెడ్ మోడళ్లపైనే డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ లిస్ట్‌లో గ్రాండ్ i10 నియోస్, ఆరా, i20, కోనా ఎలక్ట్రిక్ SUV మాత్రమే ఉన్నాయి. కస్టమర్లు ఈ నెలలో, ఎంపిక చేసిన మోడళ్లపై క్యాష్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్స్ వంటి బెనిఫిట్స్ పొందవచ్చు.
హ్యుందాయ్ ఆరా
నవంబర్‌లో ఈ కారును కొనుగోలు చేసేవారు రూ. 38,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఆరా (Hyundai Aura) పెట్రోల్ వేరియంట్‌పై రూ. 5,000 క్యాష్ డిస్కౌంట్ ఉంది. అయితే CNG వేరియంట్‌పై రూ. 25,000 డిస్కౌంట్ లభిస్తుంది. వీటితో పాటు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌తో హ్యుందాయ్ ఆరా వెహికల్‌ను సొంతం చేసుకోవచ్చు.
హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్
కోనా ఎలక్ట్రిక్ వెహికల్‌ను ఈ నవంబర్‌లో రూ.1 లక్ష వరకు డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. కంపెనీ గత నెల మాదిరిగానే ఈ మోడల్‌పై రూ. 1 లక్ష వరకు క్యాష్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అయితే దీనిపై కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి బెనిఫిట్స్ లేవు. కోనా ఎలక్ట్రిక్ 39.2kWh బ్యాటరీతో వస్తుంది. ఇది 136hp, 395Nm అవుట్‌పుట్‌ను అందిస్తుంది. 452కిమీల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.
హ్యుందాయ్ ఐ20
ఈ నెలలో హ్యుందాయ్ ఐ20 (Hyundai i20) కారును కొనేవారు రూ. 20,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీనిపై రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంది. అయితే ఈ బెనిఫిట్స్ అన్నీ మిడ్-స్పెక్ మాగ్నా, స్పోర్ట్జ్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 83hp, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్; 120hp, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 100hp, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
ఈ నెలలో గ్రాండ్ ఐ10 నియోస్ కారును కొనుగోలు చేసేవారు రూ.48,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీని 1.0-లీటర్ టర్బో వేరియంట్‌పై కంపెనీ రూ.35,000, CNG వేరియంట్‌పై రూ.25,000, 1.2-లీటర్ పెట్రోల్ వేరియంట్‌పై రూ.15,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతోపాటు రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 3,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది. ప్రీమియం ఇంటీరియర్స్‌తో, మూడు ఇంజన్ ఆప్షన్స్‌తో వచ్చే ఈ కారు మార్కెట్లో సక్సెస్ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.