Home /News /business /

DIRECTORATE OF REVENUE INTELLIGENCE DRI SEARCHED MOBILE COMPANY OPPO INDIA UNEARTHS CUSTOMS DUTY EVASION OF RS 4389 CR BY OPPO INDIA SK

Oppo India: ఒప్పో ఘరానా మోసం.. రూ.4,389 కోట్ల కస్టమ్స్ డ్యూటీ ఎగవేత

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Oppo India: ఇటీవల ఒప్పో ఇండియా (OPPO India) కార్యాలయాలు, యూనిట్లలో సోదాలు చేశామని.. ఐతే మొబైల్ ఫోన్ల తయారీ కోసం దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువుల వివరాల్లో అవకతవకలు ఉన్నట్లు గుర్తించామని డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు. 

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో ఘరానా మోసం బయటపడింది.  చైనాకు చెందిన ఒప్పో కంపెనీ.. మన దేశంలో రూ.4,389 కోట్ల కస్టమ్స్ డ్యూటీని ఎగ్గొట్టినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (DRI) తెలిపింది.  ఇటీవల ఒప్పో ఇండియా (OPPO India) కార్యాలయాలు, యూనిట్లలో సోదాలు చేశామని.. ఐతే మొబైల్ ఫోన్ల తయారీ కోసం దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువుల వివరాల్లో అవకతవకలు ఉన్నట్లు గుర్తించామని డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు.   ఈ ఏడాది మేలో ఒప్పోకు చెందిన పలు కార్యాలయాలపై ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు  మొబైల్ ఫోన్ రిటైలర్ల సంఘం కూడా ఒప్పోపై తీవ్ర ఆరోపణలు చేసింది. మొబైల్ ఫోన్లను కేవలం ఆన్‌లైన్ విక్రయాలకే పరిమితం చేసి.. చట్టవిరుద్ధమైన వాణిజ్య పద్దతులను అవలంబిస్తోందని ఏప్రిల్ నెలలో  చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Oppoపై విమర్శలు చేసింది. ఆఫ్‌లైన్ స్టోర్‌ల కోసం ఫెయిర్ డెలివరీకి మద్దతు ఇవ్వాలనే నిబద్ధతను ఆ కంపెనీ గౌరవించడం లేదని ఆరోపించింది. ఈ క్రమంలోనే  ఈడీ సోదాలు చేయడం.. రూ.4,389 కోట్ల కస్టమ్స్ డ్యూటీని ఎగవేసినట్లు.. డీఆర్ఐ గుర్తించడం సంచలనంగా మారింది.



    వాస్తవానికి Oppo, Vivo, One Plus స్మార్ట్‌ఫోన్‌లను వేర్వేరు బ్రాండ్ పేర్లతో ఒకే కంపెనీ తయారు చేస్తుంది.  చైనాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ BBK ఎలక్ట్రానిక్స్ ఈ బ్రాండ్లను ఉత్పత్తి చేస్తుంది.   ఈ కంపెనీ  భారత్‌లో చేసే వ్యాపారంలో దాదాపు 50 శాతం అంటే.. రూ. 62,476 కోట్లను విదేశాలకు పంపి పన్ను ల నుంచి తప్పించుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. భారతదేశంలో పన్నులు చెల్లించకుండా ఉండేందుకు వివో ఇండియా.. తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని చైనాతో పాటు మరికొన్ని దేశాలకు పంపిందని వెల్లడించింది. విదేశాలకు తరలించిన మొత్తం డబ్బు విలువ రూ.62,476 కోట్లు. ఇది దాదాపు దాని వ్యాపారంలో సగం.  ఈ క్రమంలోనే ఒప్పో, వివో కార్యాలయపై ఈడీ, డీఆర్ఐ అధికారులు సోదాలు చేసి.. చైనీస్ కంపెనీ ఘరానా మోసాన్ని బయటపెట్టారు.



    ఇక, గత వారం వివో కంపెనీకి చెందిన ఆఫీసులు, యూనిట్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate)దాడులకు దిగింది.  వివో సంస్థకు చెందిన 44 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. వివో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీ మొత్తంలో అక్రమ మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈడీ దాడులు చేసినట్లు తెలిసింది. గత డిసెంబర్‌లో కూడా ఆదాయపు పన్ను (ఐటీ) శాఖVivo సంస్థకు చెందిన 20 చోట్ల సోదాలు చేసింది. ఆ సమయంలో వివోతోపాటు ఒప్పో, షామి, వన్ ప్లస్ వంటి ఇతర చైనా సంస్థల్లోనూ ఐటీ సోదాలు జరిగాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Business, Mobile phones, Oppo, Smart phones, Technology

    తదుపరి వార్తలు