ఆదాయపు పన్ను శ్లాబ్స్ మార్చాలంటూ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్-DTC ప్యానెల్ కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. ట్యాక్స్ రేట్స్‌ని 5 శాతం, 10 శాతం, 20 శాతంగా మార్చాలని సూచించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డైరెక్ట్ ట్యాక్స్ కోడ్-DTC ప్యానెల్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆగస్ట్ 19న నివేదిక సమర్పించింది. సంక్లిష్టంగా ఉన్న ఆదాయపు పన్ను శ్లాబ్స్‌తో పాటు మినహాయింపుల్ని తగ్గించి పన్ను విధానాన్ని సులభతరం చేయాలని డైరెక్ట్ ట్యాక్స్ కోడ్-DTC ప్యానెల్ నివేదికలో వివరించింది. ప్రస్తుతం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయం ఉన్నవారికి 5 శాతం, రూ.5 లక్షల రూ.10 లక్షల ఆదాయం ఉన్నవారికి 20 శాతం, రూ.10 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 30 శాతం ఆదాయపు పన్ను ఉంది.
వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబ్స్‌ని తగ్గించడంతో పాటు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్-DDT తొలగించాలని, దాన్ని కూడా సాధారణ ఆదాయంగా గుర్తించాలని డీటీసీ ప్యానెల్ సూచించింది. ఓ కంపెనీ షేర్ హోల్డర్లకు బదిలీ చేసే డివిడెండ్‌పై విధించే పన్నునే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అంటారు. అందుకే ఈ పన్నును ఆదాయపు పన్నుగా పరిగణించాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్-LTCG ట్యాక్స్‌ను అలాగే కొనసాగించాలని, క్యాపిటల్ గెయిన్స్‌ను ఫైనాన్షియల్ ఈక్విటీ, ఫైనాన్షియల్ అదర్స్, నాన్-ఫైనాన్షియల్‌గా విభజించాలని సూచించింది.
Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Smartphone: ఎంఐ ఏ3, రియల్మీ 5 ప్రో, మోటోరోలా వన్ యాక్షన్... ఈ మూడు ఫోన్లల్లో ఏది బెటర్?
Good News: లైఫ్‌బాయ్, లక్స్, డవ్ సబ్బుల ధరలు తగ్గాయి
IRCTC: రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్... ప్రైవేట్ రైళ్లల్లో కన్సెషన్, కోటా ఉండవుPublished by:Santhosh Kumar S
First published:August 28, 2019, 13:05 IST