హోమ్ /వార్తలు /బిజినెస్ /

Digital Banking Units: డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు అంటే ఏంటి..? డీబీయూలో చేయగల ట్రాన్సాక్షన్లు ఇవే..

Digital Banking Units: డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు అంటే ఏంటి..? డీబీయూలో చేయగల ట్రాన్సాక్షన్లు ఇవే..

Digital Banking Units: డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు అంటే ఏంటి..? డీబీయూలో చేయగల ట్రాన్సాక్షన్లు ఇవే..

Digital Banking Units: డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు అంటే ఏంటి..? డీబీయూలో చేయగల ట్రాన్సాక్షన్లు ఇవే..

పీఎం నరేంద్ర మోదీ (Narendra Modi) 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల (DBU)ను ప్రారంభించారు. అక్టోబర్ 16న జరిగిన డీబీయూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు భారత ప్రజలకు బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తాయని అన్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పీఎం నరేంద్ర మోదీ (Narendra Modi) 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల (DBU)ను ప్రారంభించారు. అక్టోబర్ 16న జరిగిన డీబీయూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు భారత ప్రజలకు బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్(Banking Experience) మెరుగుపరుస్తాయని అన్నారు. ఆర్థిక చేరికలను మరింతగా పెంచే లక్ష్యంతో, డిజిటల్ బ్యాంకింగ్ ప్రయోజనాలు దేశంలోని ప్రతి మూలకు చేర్చే ధ్యేయంతో ఈ డీబీయూలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

* ఈ డీబీయూలను ఎవరు ఏర్పాటు చేస్తారు?

రీజినల్ గ్రామీణ బ్యాంకులు, పేమెంట్ బ్యాంక్స్, లోకల్ ఏరియా బ్యాంక్స్ మినహాయించి గతంలో డిజిటల్ బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న కమర్షియల్ బ్యాంకులన్నీ టైర్ 1 నుంచి టైర్ 6 సెంటర్లలో డీబీయూలను ఏర్పాటు చేయవచ్చు. ఈ కమర్షియల్ బ్యాంకులు డీబీయూలను ఓపెన్ చేసేందుకు RBI నుంచి అనుమతి తీసుకోనవసరం లేదు.

TSPSC Group 1 Key And Results Dates: అభ్యర్థులకు అలర్ట్.. ప్రాథమిక కీ విడుదల ఆ రోజే.. కేటగిరీల వారీగా కట్ ఆఫ్ ఇలా..

* డీబీయూలో చేయగలిగే ట్రాన్సాక్షన్స్‌ ఏంటి?

ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ రెండూ డీబీయూలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. హెచ్‌డీఎఫ్‌సీ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ (DBU) కస్టమర్ ట్రాన్సాక్షన్ల కోసం ఇంటరాక్టివ్ ATMs, క్యాష్ డిపాజిట్ మెషిన్లు, ఇంటరాక్టివ్ డిజిటల్ వాల్స్, నెట్ బ్యాంకింగ్ కియోస్క్‌లు/వీడియో కాల్స్‌, ట్యాబ్ బ్యాంకింగ్‌ని ఉపయోగించి సెల్ఫ్ సర్వీస్ జోన్‌ను ఆఫర్ చేస్తుంది. DBUలో ఇద్దరు బ్యాంక్ సిబ్బందితో కూడిన అసిస్టెడ్ జోన్ కూడా ఉంటుంది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ డీబీయూలు సెల్ఫ్ సర్వీస్ జోన్, డిజిటల్ అసిస్టెన్స్ జోన్ అనే 2 విభిన్న సదుపాయాలు ఆఫర్ చేస్తాయి.

ఐసీఐసీఐ కస్టమర్లు సెల్ఫ్ సర్వీస్ జోన్‌లో ATM, క్యాష్ డిపాజిట్ మెషిన్ (CDM)తో పాటు పాస్‌బుక్ ప్రింటింగ్, చెక్ డిపాజిట్ చేయడం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ వంటి సేవలను అందించే మల్టీ-ఫంక్షనల్ కియోస్క్ (MFK)ని యాక్సెస్ చేయవచ్చు. సెల్ఫ్ సర్వీస్ జోన్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్, ఆఫర్లు, మాండేటరీ నోటీసుల గురించి తెలుసుకోవడానికి చాట్‌బాట్‌తో డిజిటల్ ఇంటరాక్టివ్ స్క్రీన్‌ను కస్టమర్లకు అందిస్తుంది. ఇక డిజిటల్ అసిస్టెన్స్ జోన్‌లో ఉండే బ్రాంచ్ అధికారులు సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ అకౌంట్ తెరవడంతో సహా అనేక సర్వీసులను పొందడంతో కస్టమర్లకు సహాయం చేస్తారు. ఆధార్ ఆధారిత eKYCని ఉపయోగించి ట్యాబ్లెట్ డివైజ్ ద్వారా పై సేవలు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో పొందవచ్చు.

TSPSC Halltickets: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాలకు పరీక్ష తేదీ ఖరారు.. వివరాలిలా..

* DBU అంటే ఏంటి?

డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ఫిజికల్ అవుట్‌లెట్లుగా పనిచేస్తాయి. ఇవి ప్రజలకు సేవింగ్ అకౌంట్స్‌, బ్యాలెన్స్-చెక్, ప్రింటింగ్ పాస్‌బుక్స్‌, ఫండ్స్ ట్రాన్సాక్షన్, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌మెంట్ , లోన్ అప్లికేషన్స్, క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం అప్లికేషన్స్, పన్ను, బిల్లు పేమెంట్, నామినేషన్స్‌, జారీ చేసిన చెక్కులకు స్టాప్-పేమెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ వంటి అనేక రకాల డిజిటల్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఆఫర్ చేస్తాయి. ఏడాది పొడవునా బ్యాంకింగ్ ప్రొడక్ట్స్, బ్యాంకింగ్ సర్వీసులను తక్కువ ఖర్చుతో ఈజీగా యాక్సెస్ చేయడానికి ప్రజలకు ఇవి సహాయపడతాయి.

First published:

Tags: Bank, Banking, Banking news, Digital

ఉత్తమ కథలు