హోమ్ /వార్తలు /బిజినెస్ /

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ వెయిటింగ్ పీరియ‌డ్‌ ఒక ఏడాదికి తగ్గింపు.. ప్రకటించిన డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ వెయిటింగ్ పీరియ‌డ్‌ ఒక ఏడాదికి తగ్గింపు.. ప్రకటించిన డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ

అధిక రాబడులు, బోనస్, లోన్, బంగారు నాణేలు వంటి ఆఫర్‌లకు లొంగిపోకండి. సందేహం ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ కస్టమర్ సర్వీస్‌కు కాల్ చేసి తనిఖీ చేయండి. విశ్వసనీయ సమాచారం నుండి లేదా ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయండి. ఇన్సూరెన్స్ సంస్థ నుండి ధృవీకరణ కాల్‌ను జాగ్రత్తగా వినడం ద్వారా అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వండి.

అధిక రాబడులు, బోనస్, లోన్, బంగారు నాణేలు వంటి ఆఫర్‌లకు లొంగిపోకండి. సందేహం ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ కస్టమర్ సర్వీస్‌కు కాల్ చేసి తనిఖీ చేయండి. విశ్వసనీయ సమాచారం నుండి లేదా ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయండి. ఇన్సూరెన్స్ సంస్థ నుండి ధృవీకరణ కాల్‌ను జాగ్రత్తగా వినడం ద్వారా అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వండి.

కస్టమర్లకు తీపి కబురు అందించింది గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ. ముందుగా ఉన్న నిర్ధిష్ట వ్యాధులకు, అనారోగ్యాలకు ఒక ఏడాది వెయిటింగ్ పీరియ‌డ్‌తో ఆరోగ్య బీమా అందించడం ప్రారంభిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.

కస్టమర్లకు తీపి కబురు అందించింది గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ. ముందుగా ఉన్న నిర్ధిష్ట వ్యాధులకు, అనారోగ్యాలకు ఒక ఏడాది వెయిటింగ్ పీరియ‌డ్‌తో ఆరోగ్య బీమా అందించడం ప్రారంభిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ బంపరాఫర్‌తో ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారు డిజిట్ ఇన్సూరెన్స్‌లో ఆరోగ్య బీమా తీసుకుని ఒక సంవత్సరం దాటగానే క్లెయిమ్‌లు చేయవచ్చు. ఈ కంపెనీలో ఆల్రెడీ పాలసీ తీసుకున్న వారు కూడా ఏడాది పూర్తయ్యాక క్లెయిమ్‌లు చేయవచ్చు. వెయిటింగ్ పీరియ‌డ్‌ను ఒక ఏడాదికి తగ్గించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని సంస్థ పేర్కొంది.

Year Ender 2021: భారత మార్కెట్​లో రూ. 1 లక్షలోపు లభిస్తున్న టాప్ మోటార్‌సైకిళ్లు ఇవే.. ఈ బైక్స్​పై ఓలుక్కేయండి..


సాధారణంగా బీమా సంస్థలు నిర్దిష్ట అనారోగ్యాలకు రెండు సంవత్సరాల పాటు వెయిటింగ్ పీరియడ్ విధిస్తాయి. ముందస్తు అనారోగ్యాలకు సంబంధించి పాలసీదారుల బీమా క్లెయిమ్‌ల‌ను రెండేళ్లు పూర్తయిన తర్వాతనే బీమా సంస్థలు అంగీకరిస్తాయి. ముందుగా ఉన్న నిర్ధిష్ట వ్యాధులకైతే వెయిటింగ్ పీరియ‌డ్‌ను 4 సంవత్సరాల వరకు విధిస్తున్నాయి. అయితే ఇలా 2-4 ఏళ్ల పాటు నిరీక్షణ లేకుండా ఎక్కువమంది ప్రజలు క్లెయిమ్‌లను చేసి ఆసుపత్రిలో చేరేలా ప్రోత్సహించడమే తమ ఆఫర్ ముఖ్య ఉద్దేశమని డిజిట్ కంపెనీ వివరించింది.

బీమారంగంలో అతి తక్కువ వెయిటింగ్ పీరియడ్‌తో ముందస్తు వ్యాధులు,అనారోగ్యాలకు ఆరోగ్య బీమా అందిస్తున్న సంస్థగా డిజిట్ ఇన్సూరెన్స్ నిలవడం విశేషం. "నిర్దిష్ట జబ్బులకు సాధారణంగా రెండు సంవత్సరాల నిరీక్షణ వ్యవధి ఉంటుంది. అయితే ముందుగా ఉన్న వ్యాధులకు నాలుగు సంవత్సరాల వరకు నిరీక్షణ వ్యవధి ఉంటుంది. అలా కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ మంది వ్యక్తులు ఆసుపత్రిలో చేరేందుకు క్లెయిమ్ చేసేలా ఎంకరేజ్ చేయడమే ఈ ఆఫర్ లక్ష్యం. నాలుగు సంవత్సరాల వరకు వేచి ఉండకుండా ముందుగా ఉన్న అనారోగ్యాలు, నిర్దిష్ట వ్యాధులకు సంబంధించిన క్లెయిమ్‌లను ఏడాది కాలంలో అంగీకరిస్తాం" అని డిజిట్ సంస్థ మీడియా ప్రకటన పేర్కొంది.

“ఆరోగ్య బీమా వెయిటింగ్ పీరియ‌డ్‌ను ఒక ఏడాదికి తగ్గించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే నిర్దిష్ట అనారోగ్యాలను ప్రాథమిక దశలోనే నిర్ధారించడం కష్టం. కొనుగోలు చేసిన రెండేళ్లలోపు క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఒక ఫ్లాట్-ఇయర్ వెయిటింగ్ పీరియడ్ అనేది మా కస్టమర్‌లలో ఎక్కువ మందికి ఆరోగ్య సంరక్షణను పొందేలా చేస్తుంది." అని డిజిట్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వివేక్ చతుర్వేది అన్నారు.

ఆర్థరైటిస్, గ్యాస్ట్రిక్, డ్యూడెనల్ ఎరోషన్స్/అల్సర్స్, లివర్ సిర్రోసిస్, ఫైబ్రాయిడ్స్, అండాశయ తిత్తి, హేమోరాయిడ్స్, ఫిషర్స్, సైనసైటిస్, టాన్సిలిటిస్ మొదలైన అత్యంత సాధారణ నిర్దిష్ట అనారోగ్యాలు సాధారణంగా రెండు సంవత్సరాల వెయిటింగ్ పీరియ‌డ్‌ను కలిగి ఉంటాయి. కానీ తాజా ఆఫర్ తో ఒక సంవత్సరం తరువాత కవర్ ప్రారంభమవుతుంది.

Bandi Vs Rajender: బీజేపీలో ముదురుతున్న పోరు.. బండి వర్సెస్ రాజేందర్ వర్గాలు.. విబేధాలకు కారణం ఏంటంటే..


“శుక్లాలు, లివర్ సిర్రోసిస్, ప్యాంక్రియాటైటిస్, అండాశయ తిత్తి, హెర్నియా మొదలైన 30కి పైగా నిర్దిష్ట అనారోగ్యాలు వెయిటింగ్ పీరియ‌డ్‌లో కవర్ అందదని చాలా మందికి తెలియదు. ఈ విధానాలు చాలా ఖరీదైనవి. ఒక సంవత్సరం తర్వాత ఆసుపత్రిలో చేరాల్సి వస్తుందనుకుంటే.. తక్కువ వెయిటింగ్ పీరియడ్‌ని ఎంచుకోవడం వ్యక్తులకు సహాయపడుతుంది" అని చతుర్వేది చెప్పారు.

బీమాదారు పాలసీని జారీ చేసే ముందు కేస్-టు-కేస్ ప్రాతిపదికన వైద్య పరీక్షను కోరవచ్చు. అలాగే, పాలసీదారుడు పాలసీని కొనుగోలు చేసే సమయంలో ముందుగా ఉన్న అన్ని వ్యాధులు తెలియజేయాల్సి ఉంటుంది. పాలసీని జారీ చేసే సమయంలో ఏదైనా సమాచారాన్ని దాచిపెడితే, క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ.

First published:

Tags: Health, Health Insurance

ఉత్తమ కథలు