ముఖ్యమైన డాక్యుమెంట్స్(Documents)ను భద్రపరచుకోవడం చాలా ముఖ్యం. వాటిని పొరపాటున పోగొట్టుకుంటే.. తిరిగి పొందడం చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో అవసరానికి డాక్యుమెంట్స్ కనిపించవు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు డిజిలాకర్(DigiLocker) అప్లికేషన్‌ను తీసుకొచ్చారు. ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నీ ఒకే చోట భద్రపరచుకోవడానికి డిజిలాకర్ ఉపయోగపడుతుంది. ఇది భారత ప్రభుత్వం అందిస్తున్న క్లౌడ్-బేస్డ్ సర్వీస్. వినియోగదారులు వర్చువల్‌గా తమ డాక్యుమెంట్స్‌ను ఉపయోగించుకొనే సదుపాయం కల్పించింది. తాజాగా హెల్త్ రికార్డులను స్టోర్ చేసుకునే సదుపాయం కూడా దీంట్లో అందుబాటులోకి వచ్చింది.
డిజిలాకర్ ద్వారా ఆధార్ కార్డ్ , డ్రైవింగ్ లైసెన్స్, ఎడ్యేకేషన్ సర్టిఫికేట్లు వంటి డాక్యుమెంట్స్ సేవ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సేవలు పెన్షన్ సర్టిఫికేట్లకు కూడా విస్తరించాయి. తాజాగా డిజిలాకర్ యూజర్లు హెల్త్ రికార్డులను కూడా స్టోర్ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. వాటిని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్(ABHA)తో లింక్ చేయవచ్చని నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) ప్రకటించింది.
ఆ డాక్యుమెంట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో NHA పని చేస్తుంది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ విజన్‌ని సాధించడం దీని లక్ష్యం. నేషనల్ హెల్త్ పాలసీ 2017లో భాగంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్ఠాత్మక ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడానికి ఈ నోడల్ ఏజెన్సీ ఏర్పాటైంది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిజిలాకర్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM)తో సెకండ్ లెవల్ ఇంటిగ్రేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిజిలాకర్‌లో ఇప్పుడు టీకా రికార్డులు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు, ల్యాబ్ రిపోర్ట్లు, హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీలు వంటి హెల్త్ రికార్డులను స్టోర్ చేయవచ్చని, యాక్సెస్ చేసుకోవచ్చని పేర్కొంది.
పర్సనల్ హెల్త్ రికార్డ్స్ యాప్‌గా సేవలు
ABDMతో DigiLocker ఫస్ట్ లెవల్ ఇంటిగ్రేషన్ తర్వాత, 130 మిలియన్లమంది యూజర్లకు ABHAని క్రియేట్ చేసే సదుపాయం కలిగింది. తాజా ఇంటిగ్రేషన్ డిజిలాకర్ను పర్సనల్ హెల్త్ రికార్డ్స్(PHR) యాప్‌గా ఉపయోగించుకొనే అవకాశం కల్పించింది. ABHA హోల్డర్లు తమ హెల్త్ రికార్డ్లను వివిధ ABDM రిజిస్టర్డ్ హెల్త్ ఫెసిలిటీస్ అయిన హాస్పిటల్స్, ల్యాబ్‌ల నుంచి లింక్ చేయవచ్చు. వాటిని డిజిలాకర్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. వినియోగదారులు తమ పాత హెల్త్ రికార్డులను యాప్‌లో స్కాన్ చేసి, అప్లోడ్ చేయవచ్చు. అవసరమైన రికార్డులను ABDM-రిజిస్టెర్డ్ ఆరోగ్య సంరక్షణ నిపుణులతో కూడా పంచుకోవచ్చు.
కోట్ల మందికి ప్రయోజనం
NHA చీఫ్ ఎగ్జిక్యూటివ్ RS శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ABDM కింద, ఇంటర్-ఆపరబుల్ హెల్త్ ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ABDMతో అనుసంధానమైన ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల భాగస్వాముల నుంచి విభిన్న అప్లికేషన్లు మరింత మంది వినియోగదారులకు స్కీమ్ చేరువచేయడంలో సహాయపడుతున్నాయన్నారు. డిజిలాకర్ డాక్యుమెంట్స్ స్టోర్ చేయడానికి విశ్వసనీయమైన యాప్ అని చెప్పారు. వినియోగదారులు ఇప్పుడు దీనిని PHR యాప్‌గా ఉపయోగించుకోవడం, పేపర్‌లెస్ రికార్డ్ కీపింగ్ ప్రయోజనాలను పొందడం ముఖ్యమైన పరిణామమని చెప్పారు.
130 మిలియన్ల మంది రిజిస్టర్డ్ వినియోగదారులకు ABDM ప్రయోజనాలను విస్తరించడం గర్వకారణమని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ మేనేజింగ్ ఎడిటర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అభిషేక్ సింగ్ అన్నారు. డిజిలాకర్‌లో రిజిస్టర్ అయిన వినియోగదారులందరికీ ఇప్పుడు హెల్త్ లాకర్ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Digilocker, Google documents