విమాన ప్రయాణికులకు పేపర్‌లెస్ సర్వీసులు అందించడమే లక్ష్యంగా 'డిజి యాత్ర (Digi Yatra)' పేరుతో డిజిటల్ ప్రాసెసింగ్ ఫెసిలిటీని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫెసిలిటీని వాడుకోవడానికి ఫేషియల్ రికగ్నిషన్ వంటి డిజిటల్ వివరాలను ప్రజలు అందించాల్సి ఉంటుంది. అయితే వివిధ సెక్టార్లలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (FRT) వినియోగంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్యాసింజర్ డేటా స్టోరేజ్ గురించి, చట్టాలకు లోబడి ఉండటం గురించి, డిజి యాత్ర అనే ఫ్లైట్ బోర్డింగ్ని నియంత్రించే ఏకోసిస్టమ్ విశ్వసనీయత గురించి నీతి ఆయోగ్ (NITI Aayog) ప్రభుత్వం నుంచి స్పష్టత కోరింది.
డిజి యాత్ర పాలసీ అనేది ఈ విభాగాన్ని పూర్తి స్వచ్ఛంద పథకంగా పరిగణిస్తోంది. చెక్-ఇన్, బోర్డింగ్ బెనిఫిట్స్ కోసం ప్రయాణికులు ఈ సదుపాయం కోసం సైన్ అప్ చేసుకోవచ్చు. డిజి యాత్ర సేవలను ఉపయోగించడానికి అంగీకరిస్తే.. ఆ ప్యాసింజర్ల డేటాను తాత్కాలికంగా సేకరించి స్టోర్ చేస్తారు. డేటా వినియోగం కోసం ప్యాసింజర్లు సైన్ చేసి ఇచ్చే స్వచ్ఛంద ఒప్పందం అనేది చట్టపరమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది.
ఈ ఒప్పందం డేటా ప్రైవసీపై ఇప్పటికే ఉన్న చట్టాలు, నియమాలకు అనుగుణంగా ఉండాలని నీతి ఆయోగ్‌కి చెందిన ‘రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్’ అనే డిస్కషన్ పేపర్ సూచించింది. నవంబర్ 2న విడుదలైన ఈ డిస్కషన్ పేపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-బేస్డ్ టూల్స్.. FRT వంటి టెక్నాలజీల బాధ్యతాయుత వినియోగంపై దృష్టి సారిస్తుంది.
చట్టాల్లో ఏముంది?
ప్రస్తుతం FRT కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (రీజనబుల్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్.. ప్రాజిసర్స్.. సెన్సిటివ్ పర్సనల్ డేటా & ఇన్ఫర్మేషన్) నియమాలు, 2011 (SPDI రూల్స్) ప్రకారం పేపర్లో నియమాలు నిర్దేశించారు. “డిజి యాత్ర సెంట్రల్ ఎకోసిస్టమ్‌ను అమలు చేసిన డిజి యాత్ర ఫౌండేషన్ కంపెనీల చట్టం, 2013 ప్రకారం ఏర్పాటు అయింది కాబట్టి SPDI నిబంధనల ప్రయోజనాల కోసం అది ఒక బాడీ కార్పొరేట్‌గా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి, డిజి యాత్ర SPDI నిబంధనలను పాటించడం అవసరం." అని పేపర్ పేర్కొంది. ప్రయాణికుల విమానం బయలుదేరిన 24 గంటల తర్వాత లోకల్ ఎయిర్పోర్ట్ డేటాబేస్ నుంచి ఫేషియల్ బయోమెట్రిక్స్ డేటా రిమూవ్ అవుతుందని డిజి యాత్రా పాలసీ పేర్కొంది.
అయితే నీతి ఆయోగ్ ప్రయాణికుల నుంచి సేకరించిన ఇతర సమాచారాన్ని తొలగించడానికి సంబంధించిన నియమాలు, అలాగే ఇతర రిజిస్ట్రీలలో స్టోర్ అయ్యే ఏదైనా ఫేషియల్ బయోమెట్రిక్‌లను డిజి యాత్రా విధానంలో స్పష్టంగా ఏర్పాటు చేయాలని కోరింది. డిజి యాత్రా పాలసీలో ప్యాసింజర్లు ఎయిర్‌పోర్ట్‌లో వాల్యూ యాడెడ్ సర్వీస్‌ల కోసం అంగీకారాన్ని కూడా అందించవచ్చని పేర్కొంది. అయితే ఈ సేవల కోసం ప్యాసింజర్లు డేటా క్యాబ్ ఆపరేటర్లు, ఇతర కమర్షియల్ సంస్థల వంటి ఇతర సంస్థలతో షేర్ చేయవచ్చు. ప్యాసింజర్ల అంగీకారాన్ని నిర్దేశిత వినియోగం కోసమే తీసుకున్నామని నిర్ధారించేలా నిర్దిష్ట జాగ్రత్తలు తీసుకోవాలని నీతి ఆయోగ్ సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, Niti Aayog