దీపావళి పండుగకు కంపెనీలు తమ ఉద్యోగులకు బహుమతులు ఇస్తుంటాయి. కొన్ని కంపెనీలు దివాళీ బోనస్ (Diwali Bonus) కూడా ప్రకటిస్తుంటాయి. కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బోనస్ వస్తుంది. కనీసం ఒక నెల వేతనం బోనస్‌గా లభిస్తుంది. పండుగ సందర్భంగా ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం నింపేందుకు కంపెనీలు బోనస్‌లు, బహుమతులు (Diwali Gifts) అందించడం మామూలే. అయితే ఇలా బోనస్‌గా వచ్చిన డబ్బుల్ని ఫెస్టివల్ సీజన్‌లో ఖర్చు చేస్తుంటారు. ఇంట్లోకి కొత్త స్మార్ట్ టీవీ తీసుకొస్తుంటారు. లేదా రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ లాంటివి కొంటుంటారు. బోనస్ వచ్చింది కదా అని అవసరం లేని వస్తువులు కొంటే ఆ డబ్బులు వృథాగా ఖర్చవుతాయి. ప్రతీ నెలా వచ్చే జీతం కాకుండా అదనంగా వచ్చే డబ్బులు కాబట్టి, వాటిని ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందొచ్చు. మరి మీ బోనస్ డబ్బుల్ని ఏం చేయాలో తెలుసుకోండి.
ఇటీవల వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లు పెంచుతుండటంతో ఈఎంఐలు భారం అవుతున్నాయి. మీరు హోమ్ లోన్ లేదా ఇతర ఫ్లోటింగ్ రేట్ లోన్ తీసుకొని ఈఎంఐ కడుతున్నారా? మీకు వచ్చిన బోనస్ డబ్బుల్ని లోన్ ఈఎంఐలో కొంత భాగం చెల్లించండి. దీని వల్ల మీరు ఈఎంఐ కొంత తగ్గించుకోవచ్చు. లేదా చెల్లించాల్సిన వాయిదాలను తగ్గించుకోవచ్చు. ఈఎంఐ తగ్గించుకోవడం కన్నా, టెన్యూర్ తగ్గించుకోవడం ద్వారా ఎక్కువ లాభం ఉంటుంది.
Diwali Gift Scam: దీపావళి గిఫ్ట్ పేరుతో మెసేజ్ వచ్చిందా? బీ అలర్ట్
మీకు వచ్చిన బోనస్ కొంత మొత్తం అయినా, ఎక్కువ అయినా ఐదేళ్ల గడువుతో పెట్టుబడి పెట్టండి. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆప్షన్ ఎంచుకొని, డబ్బులు దాచుకోవచ్చు. హాలిడే టూర్ , పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులు, ఇలా వేటికోసమైనా మీరు డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
ఎక్కువ రిటర్న్స్ వచ్చేలా పెట్టుబడులు పెట్టాలనుకుంటే లాంటి ఈక్విటీ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఆప్షన్స్ ఎంచుకుంటే రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి. అయితే రిస్క్ కూడా అలాగే ఉంటుంది. మీరు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారైతే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ ఎంచుకోవచ్చు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
Tax on Gold: ధంతేరాస్, దివాళీకి బంగారం కొంటున్నారా? ట్యాక్స్ రూల్స్ తెలుసుకోండి
మీరు ఇప్పటివరకు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోలేదా? అయితే మీ బోనస్ డబ్బులతో ఆరోగ్య బీమా తీసుకోవడం సరైన ఆప్షన్. ఎలాగూ ప్రతీ ఏటా బోనస్ వస్తుంది కాబట్టి రెన్యువల్ కోసం మీరు టెన్,న్ పడాల్సిన అవసరం లేదు. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటే టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న ఇన్స్యూరెన్స్‌కు కవరేజీ తక్కువగా ఉన్నా మీ బోనస్ డబ్బులతో కవరేజీ పెంచుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diwali, Diwali 2022, Investment Plans, Investments, Personal Finance