DID YOU LINK YOUR MOBILE NUMBER TO AADHAAR NUMBER KNOW HOW TO DO AT AADHAAR SEVA KENDRA SS
Aadhaar Card Update: మీ ఆధార్ కార్డులో ఈ వివరాలు లేకపోతే ఇబ్బందులు తప్పవు
Aadhaar Card Update: మీ ఆధార్ కార్డులో ఈ వివరాలు లేకపోతే ఇబ్బందులు తప్పవు
(ప్రతీకాత్మక చిత్రం)
Aadhaar Card Update | మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేశారా? అసలు ఏ మొబైల్ నెంబర్ లింక్ చేశారో తెలుసా? ఆధార్ డేటాలో (Aadhaar Data) మొబైల్ నెంబర్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసుకోండి.
మీ ఆధార్ కార్డులో వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారా? ఆధార్ కార్డ్ (Aadhaar Card) వివరాలు అప్డేట్గా లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ మొబైల్ నెంబర్‌ను తప్పనిసరిగా ఆధార్ నెంబర్‌కు లింక్ చేయాలి. అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) డేటా బేస్‌లో మీ ఆధార్ నెంబర్‌కు మీ మొబైల్ నెంబర్ లింకై ఉండాలి. మీరు పలు సందర్భాల్లో ఓటీపీ అందుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆధార్ సేవలు పొందడానికి కూడా మీ ఆధార్ కార్డు వివరాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ అయి ఉండాలి. ఒకవేళ మీరు పాత మొబైల్ నెంబర్ ఇచ్చినట్టైతే లేటెస్ట్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఆధార్ వివరాలను పరిగణలోకి తీసుకుంటున్నాయి.
కరోనా వైరస్ విజృంభించినప్పుడు లాక్డౌన్ సమయంలో ప్రజలకు రేషన్ సరుకుల నుంచి నగదు పంపిణీ వరకు ప్రతీసారి ఆధార్ వివరాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ పథకాలను అందించారు. పీఎం కిసాన్ పథకంలో కూడా (PM Kisan Scheme) ఆధార్ డేటా ప్రకారమే లబ్ధిదారులకు డబ్బులు జమ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, సేవలు, సబ్సిడీ, పెన్షన్, స్కాలర్షిప్, ఇతర సామాజిక పథకాలు, బ్యాంకింగ్ సేవలు, ఇన్స్యూరెన్స్ సేవలు లాంటి సర్వీసుల కోసం ఆధార్ డేటాను అప్డేట్గా ఉంచాలని UIDAI తెలిపింది.
కాబట్టి మీ ఆధార్ కార్డు వివరాలన్నీ అప్డేట్గా ఉంచడం అవసరం. మీరు ఇప్పటికే మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసినట్టైతే ఆ మొబైల్ నెంబర్ పనిచేస్తూ ఉండాలి. మీ ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ లింక్ చేశారో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా ఈ స్టెప్స్ ఫాలో అవండి.
Step 1- ముందుగా మీకు దగ్గర్లోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లండి.
Step 2- అక్కడ ఆధార్ అప్డేట్, కరెక్షన్ ఫామ్ పూర్తి చేయండి.
Step 3- అందులో మీ లేటెస్ట్ మొబైల్ నెంబర్ రాయాలి.
Step 4- ఇతర వివరాలు ఏవైనా అప్డేట్ చేయాలనుకుంటే ఈ ఫామ్‌లో రాయాలి.
Step 5- మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం ఛార్జీలు చెల్లించి ఫామ్ సబ్మిట్ చేయాలి.
Step 6- బయోమెట్రిక్ ఆథెంటికేషన్ పూర్తి చేయాలి.
Step 7- మీకు అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్‌తో (URN) అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ వస్తుంది.
Step 8- URN తో మీ అప్డేట్ రిక్వెస్ట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.