PAN Aadhaar Link Status: మీ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ లింక్ అయిందా? ఇలా తెలుసుకోండి

PAN Aadhaar Link Status: మీ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ లింక్ అయిందా? ఇలా తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

PAN Aadhaar Link Status | మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ గతంలో లింక్ చేశారా? అయితే ఓసారి స్టేటస్ చెక్ చేయండి ఇలా.

  • Share this:
    పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేసేందుకు గడువును అనేక సార్లు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. 2021 మార్చి 31న ముగిసిన గడువును 2021 జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు సమస్యలు తలెత్తుతున్నందున పాన్ కార్డ్ హోల్డర్లకు మరో అవకాశం ఇచ్చేందుకు ఆదాయపు పన్ను శాఖ మరోసారి గడువు పెంచింది. అంటే పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి మరో నెల రోజులు మాత్రమే గడువుంది. అయితే ఇప్పటికే కోట్లాది మంది తమ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేశారు. మరి మీరు కూడా మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేశారా? పాన్, ఆధార్ నెంబర్లు లింక్ చేసినట్టు గుర్తు లేదా? అయితే ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ లింక్ స్టేటస్ సులువుగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఈ స్టెప్స్ ఫాలో అవండి.

    SBI Account KYC: మీరు ఎస్‌బీఐ కస్టమరా? మే 31 లోగా ఈ వివరాలు ఇవ్వకపోతే అకౌంట్ పనిచేయదు

    Money Transfer: డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? 14 గంటలు ఆ సేవలు బంద్


    మీ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html ఓపెన్ చేయాలి. అందులో రెండు బాక్సులు కనిపిస్తాయి. PAN అని ఉన్న బాక్సులో మీ పాన్ నెంబర్, Aadhaar Number అని ఉన్న బాక్సులో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఓసారి సరిచూసుకోవాలి. ఆ తర్వాత View Link Aadhaar Status పైన క్లిక్ చేయాలి. Your PAN linked to Aadhaar Number అని మెసేజ్ కనిపిస్తే ఆధార్ నెంబర్‌కు పాన్ నెంబర్ లింక్ అయినట్టే. ఒకవేళ పాన్, ఆధార్ నెంబర్ లింక్ కానట్టైతే ఎలా లింక్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Gold Hallmarking: హాల్‌మార్కింగ్ అంటే ఏంటీ? ఎలా గుర్తించాలి? తెలుసుకోండి

    EPF Withdrawal: కరోనాతో మరణించినవారి ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు డ్రా చేయండిలా

    ఈ ప్రాసెస్ ద్వారా మీ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుస్తుంది. అంతేకాదు మీ పాన్ కార్డ్ ఏ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిందో కూడా తెలుస్తుంది. ఆధార్ నెంబర్‌లో చివరి నాలుగు అంకెలు కనిపిస్తాయి. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ కాకుండా ఎస్ఎంఎస్ ద్వారా కూడా పాన్, ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకోవచ్చు. UIDPAN < 12 digit Aadhaar number> < 10 digit Permament Account Number> అని టైప్ చేసి 567678 లేదా 56161 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది.
    Published by:Santhosh Kumar S
    First published: