హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tax Benefits : ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్..ఈ రూల్స్ పాటించకపోతే ఆదాయ పన్ను ప్రయోజనాలు రద్దు!

Tax Benefits : ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్..ఈ రూల్స్ పాటించకపోతే ఆదాయ పన్ను ప్రయోజనాలు రద్దు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐటీఆర్ విషయంలో ట్యాక్స్ పేయర్స్‌ కొన్ని విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా పన్ను చెల్లింపు, డిడక్షన్స్‌(Deductions)కు సంబంధించిన నియమాలను పాటించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Tax Benefits : ఐటీఆర్(ITR) విషయంలో ట్యాక్స్ పేయర్స్‌(Tax Payers) కొన్ని విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా పన్ను చెల్లింపు, డిడక్షన్స్‌(Deductions)కు సంబంధించిన నియమాలను పాటించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరైన అవగాహన లేకుండా చేసిన క్లెయిమ్‌ల ద్వారా పొందిన ప్రయోజనాలకు రెట్టింపు మొత్తంలో కోల్పేయే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో చాలా మంది యజమానులు ఉద్యోగులకు ఇన్వెస్ట్‌మెంట్‌ డిక్లరేషన్‌ ఫారం అందజేయడం లేదు. దీంతో చాలా మంది పన్ను చెల్లింపుదారులు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సెక్షన్ 80c కింద డిడక్షన్స్‌ క్లెయిమ్ చేయడం ద్వారా పన్ను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పన్నులను ఆదా చేసేందుకు అదొక్కటే సరిపోదు. సెక్షన్ 80c కింద పన్ను ప్రయోజనాలను అందజేసే రైడర్‌ల గురించి కూడా తెలుసుకోవాలి.

సాధారణంగా ట్యాక్స్ డిడక్షన్స్‌ కొన్ని షరతులతో వస్తాయి. వీటిని ఉల్లంఘిస్తే మునుపటి సంవత్సరంలో క్లెయిమ్ చేసిన మొత్తం డిడక్షన్‌ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇన్‌కంగా పరిగణిస్తారని ఆన్‌లైన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కన్సల్టెన్సీ అయిన Tax2Win సీఈవో, సహ వ్యవస్థాపకుడు అభిషేక్ సోనీ మనీ కంట్రోల్‌తో చెప్పారు. పథకాల నుంచి ముందస్తు ఉపసంహరణ, అనర్హమైన ప్రయోజనాల కోసం చేసిన ఖర్చు, నిర్దేశిత షరతులకు ముందు పెట్టుబడి లేదా ఆస్తులను బదిలీ చేయడం వంటి కారణాల వల్ల డిడక్షన్స్‌ రిజెక్ట్ కావచ్చని తెలిపారు.

గృహ రుణాలు(Home Loan)

సంవత్సరంలో చెల్లించిన గృహ రుణాల ప్రిన్సిపల్‌ అమౌంట్‌కు సెక్షన్ 80c కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఈ నియమం వర్తించాలంటే ఇంటిని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఐదేళ్ల వరకు విక్రయించకూడదు. ఇంటిని ముందే విక్రయిస్తే, పన్ను ప్రయోజనాన్ని కోల్పోతారు. క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను చెల్లించాలి.

ఇన్సూరెన్స్‌ రద్దు

పన్ను చెల్లింపుదారులు మార్చి 31 గడువును చేరుకోవడానికి ఫిబ్రవరిలోపు ఇన్సూరెన్స్‌ పాలసీలు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రీమియం అనేది ఒకసారి చేసే ఖర్చు కాదు, తదుపరి సంవత్సరాల్లో కూడా చెల్లించాలి. అయితే రెండేళ్లలోపు ఏదైనా ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ల ప్రీమియం చెల్లించడం మానేస్తే, సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనంగా క్లెయిమ్ చేసిన ప్రీమియం రివర్స్ అవుతుంది.

ప్రీమియం తగ్గించాలి

ఇన్సూరెన్స్‌ పాలసీని ఎంచుకునే సమయంలో, మెచ్యూరిటీ అమౌంట్‌పై విధించే పన్ను గురించి కూడా తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్‌ మొత్తంలో 10 శాతం వరకు ప్రీమియం చెల్లించిన పాలసీలకు మాత్రమే సెక్షన్ 80C కింద డిడక్షన్‌ అందుబాటులో ఉంది. ఈ పరిమితులు 2012 ఏప్రిల్ 1 తర్వాత జారీ చేసిన పాలసీలకు వర్తిస్తాయి. దీనికి ముందు ప్రీమియం పరిమితి మొత్తం హామీలో 20 శాతంగా ఉంది.

పన్ను శ్లాబులో మార్పు

రద్దు అయిన ట్యాక్స్‌ డిడక్షన్స్‌ కారణంగా ఆదాయం పెరగవచ్చు కాబట్టి ఈ పరిస్థితులు చెల్లించాల్సిన పన్నుపై కూడా ప్రభావం చూపుతాయి. పన్ను శ్లాబు మారే అవకాశం ఉంది కాబట్టి అదనంగా పన్ను చెల్లించాల్సి రావచ్చు.

హాస్పిటల్ లో పేషెంట్ కి ఎమర్జెన్సీ..ట్రాఫిక్ జామ్ లో డాక్టర్..అతడి పనికి దేశం సెల్యూట్

పెన్షన్ ప్లాన్స్‌ ఉపసంహరణ

రెండు సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించకుండా పెన్షన్ ప్లాన్‌ను సరెండర్ చేయడం వల్ల సెక్షన్ 80c కింద క్లెయిమ్ చేసిన పన్ను ప్రయోజనం తిరిగి తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు టెన్యూర్ మారుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పథకం కనీసం మూడు సంవత్సరాల నిర్ణీత వ్యవధిలో ఉండాలి. మూడు సంవత్సరాలలోపు ఉపసంహరించుకుంటే క్లెయిమ్ చేసిన డిడక్షన్స్‌ రద్దు అవుతాయి.

 ప్రీమెచూర్ విత్‌డ్రాలు వెల్లడించాలి

ఇన్‌కమ్ ట్యాక్స్‌ డిడక్షన్స్‌ క్లెయిమ్ చేసిన తర్వాత పెట్టుబడులను ఉపసంహరించుకుంటే, ఇంతకు ముందు క్లెయిమ్ చేసిన ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ రద్దు చేయడం గురించి ప్రభుత్వానికి తెలిసే అవకాశం లేదు. అటువంటి ఉపసంహరణలను ప్రకటించాల్సిన బాధ్యత పన్ను చెల్లింపుదారులపై ఉంటుంది. అలా చేయకపోతే అన్ని రుజువులను అందించాల్సి ఉంటుంది.

డాక్యుమెంట్స్ భద్రపరచండి

ఆదాయ పన్ను శాఖ అసెస్‌మెంట్ ప్రొసీడింగ్స్‌లో దాఖలు చేసిన పన్ను రిటర్న్‌ను స్క్రూటినీ చేస్తే, పెట్టుబడులను ట్రేస్ చేయడానికి రుజువును కూడా పన్ను చెల్లింపుదారు సమర్పించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి 2022-23 ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80C కింద పొందిన క్లెయిమ్‌లకు సంబంధించిన పత్రాల రుజువులను, 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసే ఆరు సంవత్సరాల వరకు, అంటే 2029-30 చివరి వరకు భద్రపరచాలి. అంటే అటువంటి రికార్డులను మొత్తం ఎనిమిది సంవత్సరాల పాటు భద్రపరచాలి.

పెనాల్టీ రేటు పన్ను మొత్తంలో 50-200 శాతం ఉండవచ్చు

సెక్షన్ 80c కింద పేర్కొన్న అనేక పెట్టుబడులు ప్రభుత్వ పథకాలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆదాయపు పన్ను అధికారులకు డేటాను సేకరించడం, ఉల్లంఘనలను గుర్తించడం చాలా సులభం అవుతుంది. అసెస్సీలు తమ శాశ్వత ఖాతా నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేశారు.

అయితే ట్యాక్స్ బెనిఫిట్స్‌ రివర్సల్ చెక్ చేయడానికి ప్రాక్టికల్‌గా ఎలాంటి మార్గాలు లేవంటున్నారు ముంబైకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ మెహుల్ సేత్. ట్యాక్స్ పేయర్ సవరించిన రిటర్న్‌లను అసెస్‌మెంట్ సంవత్సరం డిసెంబర్ 31 లోపు దాఖలు చేయాలనే రూల్ ఉండటం ఇందుకు కారణమని చెబుతున్నారు. అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పరిశీలన తర్వాత, కొన్ని రకాల పెట్టుబడుల గురించి మిమ్మల్ని ప్రత్యేకంగా అడిగితే, మీరు అదనపు పన్ను, వడ్డీ, పెనాల్టీ ఖర్చులను భరించాల్సి ఉంటుందని మెహుల్ మనీకంట్రోల్‌తో మాట్లాడుతూ వివరించారు. ఈ విషయంపై మరిన్ని సలహాలు, సూచనల కోసం నిపుణులను సంప్రదించడం మంచిదని సూచించారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Income tax, ITR, ITR Filing

ఉత్తమ కథలు