బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసినా ఛార్జీలు పడతాయ్.. నివారించేందుకు ఇలా చేయండి..

Bank Account closing charges: బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 14 రోజుల లోపు ఖాతాను క్లోజ్ చేస్తే ఎలాంటి ఛార్జీలు పడవు. ఆ తర్వాత నుంచి సంవత్సరం లోపు ఎప్పుడు ఖాతాను క్లోజ్ చేసినా ఛార్జీలు కట్టాల్సిందే.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 14, 2019, 2:32 PM IST
బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసినా ఛార్జీలు పడతాయ్.. నివారించేందుకు ఇలా చేయండి..
(ప్రతీకాత్మక చిత్రం)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 14, 2019, 2:32 PM IST
బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే మినిమమ్ బ్యాలెన్స్ ఖచ్చితం. కనీస బ్యాలెన్స్ లేకపోతే ఛార్జీలు పడతాయి. వీటిపై బ్యాంకులు చాలా కఠినంగా వ్యవహరిస్తాయి. అయితే బ్యాంకు అకౌంటు క్లోజ్ చేసినా బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయన్న విషయం మీకు తెలుసా? అవునండీ.. కొంత కాల వ్యవధిలో బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేస్తే ఛార్జీలు పడతాయి. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 14 రోజుల లోపు ఖాతాను క్లోజ్ చేస్తే ఎలాంటి ఛార్జీలు పడవు. ఆ తర్వాత నుంచి సంవత్సరం లోపు ఎప్పుడు ఖాతాను క్లోజ్ చేసినా ఛార్జీలు కట్టాల్సిందే. అదే, ఖాతా తెరిచి సంవత్సరం దాటితే ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఉదాహారణకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో బ్యాంక్ ఖాతా తెరిచి సంవత్సరం దాటితే ఎలాంటి ఛార్జీలు కట్టనవసరం లేదు. ఒకవేళ ఆలోపే ఖాతాను మూసేస్తే.. ఆ బ్యాంకు జీఎస్టీతో కలిపి రూ.500 ఛార్జీ వసూలు చేస్తుంది. అందుకే ఆ టైమ్ పీరియడ్‌లో ఖాతా మూసివేయకపోవడమే మంచిది.

బ్యాంకులను బట్టి రూ.500 నుంచి రూ.1000 వరకు ఛార్జీలు పడతాయి. బ్యాంకు ఖాతా ఓపెనింగ్ కిట్, చెక్‌బుక్, డెబిట్ కార్డు.. తదితర సదుపాయాలు కల్పించినందుకు గానూ ఈ ఛార్జీలను బ్యాంకులను వసూలు చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఆర్బీఐ ఈ ఛార్జీల వసూలుపై ఎలాంటి గైడ్‌లైన్స్ విధించలేదు. ఛార్జీల వసూలు నిర్ణయాన్ని బ్యాంకులకే వదిలేసింది.

First published: August 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...