సిబిల్ రిపోర్ట్... ఆర్థిక లావాదేవీలు జరిపేవారిలో ఈ రిపోర్ట్ గురించి తెలియని వారుండరు. బ్యాంకు నుంచి ఏ లోన్ మంజూరు కావాలన్నా సిబిల్ రిపోర్ట్ లేదా ఇతర ఏజెన్సీలు ఇచ్చే క్రెడిట్ రిపోర్ట్ కీలకం. ఓ వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణను తెలిపే రిపోర్ట్ ఇది. క్రెడిట్ రిపోర్టుల్ని ఇచ్చేందుకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు చాలానే ఉన్నాయి. TransUnion CIBIL, CRIF Highmark, Equifax, Experian లాంటి సంస్థలు క్రెడిట్ రిపోర్టుల్ని ఇస్తుంటాయి. ప్రజలకు ఎక్కువగా తెలిసింది TransUnion CIBIL ఇచ్చే సిబిల్ రిపోర్ట్, సిబిల్ స్కోర్ గురించే. తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలన్నా, లోన్ అప్లికేషన్ రిజెక్ట్ చేయాలన్నా బ్యాంకులు క్రెడిట్ రిపోర్టును పరిగణలోకి తీసుకుంటూ ఉంటాయి.
ఇటీవల క్రెడిట్ రిపోర్టులో తప్పులు వస్తుండటంతో రుణాలకు దరఖాస్తు చేసినవారికి ఇబ్బందులు తప్పట్లేదు. సడెన్‌గా స్కోర్ పడిపోవడం, తీసుకోని రుణాలు సిబిల్ రిపోర్టులో కనిపిస్తుండటం లాంటి అనేక పొరపాట్లు బయటపడుతున్నాయి. దీని వల్ల రుణాలు, క్రెడిట్ కార్డులు పొందలేకపోతున్నారు. ఎక్కువ వడ్డీకి రుణాలు పొందాల్సిన పరిస్థితి వస్తోంది. వారి ఆర్థిక లావాదేవీలకు ఇబ్బందులు వస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణపై ఇలాంటివి ఓ మచ్చలా మారుతున్నాయి.
Aadhaar Center Near Me: ఆధార్ సెంటర్ ఎక్కడుంది? సింపుల్‌గా తెలుసుకోండి ఇలా
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ఇచ్చే రిపోర్టుల్లో ఏవైనా తప్పులు కనిపిస్తే ఫిర్యాదు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏర్పాటు చేసిన వ్యవస్థ ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్‌కు కస్టమర్లు ఫిర్యాదు చేయొచ్చు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలపై ఫిర్యాదు చేసేందుకు ఇది ఖర్చులేని ప్రత్యామ్నాయ మార్గమని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. దీంతో పాటు TransUnion CIBIL, CRIF Highmark, Equifax, Experian కంపెనీలన్నీ ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాల్సిందే.
క్రెడిట్ రిపోర్టులో ఉన్న తప్పులపై క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఫిర్యాదు చేసినా కొన్నిసార్లు స్పందన రాకపోవడంతో రుణగ్రహీతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి ఆర్‍బీఐ ఏర్పాటు చేసిన అంబుడ్స్‌మన్ అందుబాటులో ఉండటం ఊరటనిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్‌కు వచ్చిన ఫిర్యాదులకు పరిష్కారం కూడా త్వరగా అందుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పరిధిలోకి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు మాత్రమే కాదు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, అర్బన్ కోఆపరేటీవ్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, రూ.50 కోట్ల కన్నా ఎక్కువ డిపాజిట్లు ఉన్న నాన్ షెడ్యూల్డ్ కోఆపరేటీవ్ బ్యాంకులు వస్తాయి.
Savings Scheme: రూ.5 లక్షల రిటర్న్స్ కోసం నెలకు రూ.1,000 పొదుపు చేస్తే చాలు
రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసేందుకు వేర్వేరు పద్ధతులు ఉన్నాయి. https://cms.rbi.org.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. లేదా CRPC@rbi.org.in ఇమెయిల్ ఐడీకి ఫిర్యాదు పంపవచ్చు. లేదా 14448. టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఆర్‌బీఐ చండీగఢ్‌లో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ రిసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదును పంపవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loan, Cibil score, Credit cards, Credit score, Personal Finance