Home /News /business /

DID YOU FIND ANY ERRORS AFTER RETURNING THE IT NOTHING ELSE IF YOU DO THIS AGAIN YOU CAN FILE EASILY UMG GH

ITR: ఐటీ రిటర్న్‌ చేశాక తప్పులు కనిపించాయా ? మరేం పర్లేదు.. మళ్లీ ఇలా చేస్తే సులువుగా ఫైల్ చేయొచ్చు..!

ఐటీ రిటర్న్‌ చేశాక తప్పులు కనిపించాయా ? మరేం పర్లేదు.. మళ్ళీ ఇలా చేస్తే  సులువుగా ఫైల్ చేయొచ్చు ..

ఐటీ రిటర్న్‌ చేశాక తప్పులు కనిపించాయా ? మరేం పర్లేదు.. మళ్ళీ ఇలా చేస్తే సులువుగా ఫైల్ చేయొచ్చు ..

ప్రస్తుత ఆదాయ పన్ను చట్టాలు రిటర్న్‌ను ఫైల్ చేస్తున్నప్పుడు చేసిన తప్పులను సరిదిద్దడానికి మదింపుదారునికి అవకాశం కల్పిస్తున్నాయి. ఆదాయ పన్ను సెక్షన్ 139(5) రివైజ్డ్‌ రిటన్న్‌ను ఫైల్‌ చేసేందుకు అనుమతిస్తుంది. ఐటీఆర్‌(ITR) దాఖలు చేస్తున్నప్పుడు తప్పులు దొర్లినట్లు అనిపిస్తే మళ్ళీ తప్పులు సరిదిద్దుకొని ఫైల్ చేయవచ్చు.

ఇంకా చదవండి ...
ఐటీఆర్‌ (ITR)దాఖలు చేయడానికి గడువు సమీపిస్తోంది. చాలా మంది ఐటీఆర్‌ను చివరి నిమిషం వరకు దాఖలు చేయరు. హడావిడిగా దాఖలు చేసే సమయంలో తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత ఆదాయ పన్ను చట్టాలు(Act) రిటర్న్‌ను ఫైల్ చేస్తున్నప్పుడు చేసిన తప్పులను సరిదిద్దడానికి మదింపుదారునికి అవకాశం కల్పిస్తున్నాయి. ఆదాయ పన్ను సెక్షన్ 139(5) రివైజ్డ్‌ రిటన్న్‌ను ఫైల్‌ చేసేందుకు అనుమతిస్తుంది. ఐటీఆర్‌ దాఖలు చేస్తున్నప్పుడు తప్పులు దొర్లినట్లు ఎవరైనా గుర్తిస్తే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

గత ITR లోపాలను సరిదిద్దవచ్చా?
2021-22 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి గడువులోపు ఐటీఆర్‌ని ఫైల్ చేసి, ఇప్పుడు ఐటీఆర్‌లో తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే.. ఇప్పటికీ 2021-22 అసెస్‌మెంట్ ఇయర్‌ ITRని సవరించగలరా? అనే ప్రశ్నలు చాలా మంది అడుగుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇది సాధ్యం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయ పన్ను చట్టం ప్రకారం, రివైజ్డ్ రిటర్న్‌ను సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరానికి మూడు నెలల ముందు లేదా అసెస్‌మెంట్ పూర్తి చేసే ముందు, ఏది ముందుగా అయితే అది ఫైల్ చేయవచ్చు.

2021-22 అసెస్‌మెంట్ సంవత్సరానికి, సవరించిన రిటర్న్‌ను దాఖలు చేయడానికి ప్రభుత్వం గడువును 2022 మార్చి 31 వరకు పొడిగించింది. ఆ విండో పూర్తయింది. అయితే, సెక్షన్ 139(8A) ప్రకారం అప్‌డేట్(Update) చేసిన రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ఇంకా అవకాశం ఉందని టాక్స్‌మన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నవీన్ వాధ్వా తెలిపారు. ఆయన CNBC-TV18.comతో మాట్లాడుతూ..‘ఫైనాన్స్ యాక్ట్, 2022 మదింపుదారులకు ఆదాయ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ఎక్కువ వ్యవధిని ఇవ్వడానికి అప్‌డేటెడ్‌ రిటర్న్ విధానం ప్రవేశపెట్టింది. సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన 24 నెలలలోపు (కొన్ని షరతులకు లోబడి) అప్‌డేట్‌ చేసిన రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. ఆలస్యమైన రిటర్న్ లేదా రివైజ్డ్ రిటర్న్ దాఖలు కోసం ఇచ్చిన కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు" అని వాధ్వా చెప్పారు.

అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను ఫైల్ చేయడానికి సంబంధించి నియమాలు ఇవే..
పన్ను చెల్లింపుదారులందరూ అప్‌డేట్‌ చేసిన రిటర్న్‌ను ఫైల్ చేయడానికి అర్హులు. అయితే, కింది పరిస్థితులలో అటువంటి రిటర్న్ దాఖలు చేయలేరు..

- రిటర్న్‌ ఆఫ్‌ లాస్‌ను అప్‌డేట్‌ చేసినప్పుడు

- అప్‌డేట్ చేసిన రిటర్న్ లోయర్‌ ట్యాక్స్‌ లయబిలిటీ కిందకు వచ్చినపుడు

- అప్‌డేట్ చేసిన రిటర్న్ ద్వారా రీఫండ్‌ పెరిగినప్పుడు

- మదింపుదారుల అకౌంట్ బుక్స్ లేదా ఆస్తులు స్వాధీనం చేసుకున్నపుడు

- అసెస్సీకి వ్యతిరేకంగా సర్వే జరిగినప్పుడు

- అసెస్సీకి చెందిన ఇతర వ్యక్తి విషయంలో పత్రాలు లేదా ఆస్తులు స్వాధీనం చేసుకున్నప్పుడు

- ఒకవేళ ఇప్పటికే అప్‌డేట్ చేసిన రిటర్న్ ఫైల్ చేసి ఉన్నప్పుడు

- అసెస్‌మెంట్ పెండింగ్‌లో ఉన్నప్పుడు లేదా పూర్తయినప్పుడు

- CBDT ద్వారా సమాచారం అందిన వ్యక్తి లేదా వ్యక్తుల తరగతి విషయంలో..

జరిమానా చెల్లించాలా?
పన్ను(Tax)చెల్లింపుదారుడు అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను దాఖలు చేయాలంటే ఎలాంటి రుసుము లేదా జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 140B ప్రకారం అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదనపు పన్ను అనేది ఒక వ్యక్తి అప్‌డేట్ చేసిన రిటర్న్ ఫైల్‌పై చెల్లించాల్సిన మొత్తం పన్ను, వడ్డీలో 25 శాతానికి సమానం.
గడువు తేదీ ముగిసిన తర్వాత అప్‌డేట్‌ రిటర్న్‌ దాఖలు చేసేవారు చెల్లించాల్సి వస్తుంది. సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసినప్పటి నుంచి 12 నెలల వ్యవధి ఉంటుంది.

ఇదీ చదవండి:  Air Ambulance: అద్భుతం..గుండె ఆపరేషన్ కోసం .. అమెరికా నుంచి చెన్నైకు ఎయిర్ అంబులెన్స్.. చదివితే చేతులెత్తి మొక్కుతారు !



సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం 12 నెలల గడువు ముగిసిన తర్వాత, అలానే సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం 24 నెలల వ్యవధి పూర్తి కాక ముందు అప్‌డేట్ రిటర్న్‌ను ఫైల్‌ చేస్తే అదనపు పన్ను మొత్తంలో 50 శాతం పన్ను, వడ్డీ చెల్లించాలి. అటువంటి వ్యక్తి అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను అందజేస్తున్న ఆ అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయ రిటర్న్‌ను అందించకపోతే సెక్షన్ 234F కింద రుసుము విధిస్తారు.



అప్‌డేట్ చేసిన రిటర్న్ ఫైల్ చేయడానికి ఎలాంటి ప్రత్యేక ఫారమ్ లేదని నిపుణులు చెబుతున్నారు. ఒక పన్ను చెల్లింపుదారు ఆ ITR ఫారమ్‌లలో అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను అందించాల్సి ఉంటుంది. ఆ సంవత్సరానికి అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను అందించాల్సి ఉంటుంది. అటువంటి ITR ఫారమ్‌ను కొత్తగా నోటిఫై చేసిన ITR-U ఫారమ్‌తో పాటు ఫైల్ చేయాలి.
Published by:Mahesh
First published:

Tags: Business plan, Inflation, Itr deadline, ITR Filing

తదుపరి వార్తలు