హోమ్ /వార్తలు /బిజినెస్ /

ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా? సింపుల్‌గా ఇ-వెరిఫై చేయండి ఇలా

ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా? సింపుల్‌గా ఇ-వెరిఫై చేయండి ఇలా

ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా? సింపుల్‌గా ఇ-వెరిఫై చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా? సింపుల్‌గా ఇ-వెరిఫై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

ITR Filing | ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసినవారికి అలర్ట్. రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత నిర్ణీత గడువులోగా ఇ-వెరిఫికేషన్ (ITR e-Verify) ప్రాసెస్ పూర్తి చేయడం తప్పనిసరి. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో వెరిఫికేషన్ చేయొచ్చు.

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ (ITR Filing) చేయడం ట్యాక్స్‌పేయర్స్‌కి ఓ పెద్ద పని. చాలావరకు చివరి రోజే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి చెందిన అంటే 2022-23 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన రిటర్న్స్ ఫైల్ చేసే గడువు 2022 జూలై 31న ముగిసిన సంగతి తెలిసిందే. చివరి రోజే 72.42 లక్షల ఐటీఆర్ ఫైలింగ్స్ జరిగినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) వెల్లడించింది. 2022 జూలై 31 నాటికి 5.83 కోట్ల రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. హడావుడిగా రిటర్న్స్ ఫైల్ చేయడం, హమ్మయ్య పని అయిపోయిందని అనుకోవడం మామూలే. కానీ రిటర్న్స్ ఫైల్ చేయడంతోనే సరిపోదు. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత ఇ-వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడం తప్పనిసరి.

ట్యాక్స్‌పేయర్స్ ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఇ-వెరిఫై చేయడం మర్చిపోతుంటారు. దీంతో చిక్కులు తప్పవు. ఐటీఆర్ ఫైల్ చేసినవారికి ఇ-వెరిఫికేషన్ కోసం 120 రోజుల గడువు ఉంటుంది. అయితే తాజాగా ఈ గడువును తగ్గించింది సీబీడీటీ. ఆగస్ట్ 1 నుంచి రిటర్న్స్ ఫైల్ చేసేవారందరూ ఐటీఆర్ ఫైలింగ్ పూర్తైన 30 రోజుల్లోనే ఇ-వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. 2022 జూలై 31 వరకు రిటర్న్స్ ఫైల్ చేసినవారికి 120 రోజుల గడువు ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేసినవారు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఇ-వెరిఫై చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారికి షాక్... 30 రోజుల్లో ఈ పనిచేయాల్సిందే

లాగిన్ చేయకుండా ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఇ-వెరిఫై పూర్తి చేయండిలా


Step 1- ముందుగా ఇ-ఫైలింగ్ పోర్టల్ https://www.incometax.gov.in/ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో e-Verify Return పైన క్లిక్ చేయాలి.

Step 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పాన్ నెంబర్, అసెస్‌మెంట్ ఇయర్,

Step 4- అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Continue పైన క్లిక్ చేయాలి.

Step 5- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి.

Submit పైన క్లిక్ చేయాలి.

లాగిన్ చేసి ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఇ-వెరిఫై పూర్తి చేయండిలా


Step 1- ముందుగా ఇ-ఫైలింగ్ పోర్టల్ https://www.incometax.gov.in/ ఓపెన్ చేయాలి.

Step 2- మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.

Step 3- ఆ తర్వాత e-File సెక్షన్‌లో Income tax return సెక్షన్‌లో e-Verify Return పైన క్లిక్ చేయాలి.

Step 4- మీరు వెరిఫై చేయని రిటర్న్ సెలెక్ట్ చేయాలి.

Step 5- 120 రోజుల తర్వాత ఇ-వెరిఫికేషన్ చేస్తున్నట్టైతే ఆలస్యానికి గల కారణాన్ని వివరించాలి.

Pension Scheme: నెలకు రూ.5,000 పెన్షన్ కావాలంటే ఈ స్కీమ్‌లో చేరండి

ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ఇ-వెరిఫై చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్, ఏటీఎం, నెట్‌బ్యాంకింగ్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ లాంటి వేర్వేరు పద్ధతుల ద్వారా ఇ-వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. ఇ-వెరిఫికేషన్ పూర్తైన తర్వాత రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి, మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది.

ఆఫ్‌లైన్‌లో కూడా రిటర్న్స్ వెరిఫై చేయొచ్చు. స్పీడ్ పోస్టు ద్వారా ఐటీఆర్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సిఉంటుంది. సీబీడీటీ సూచించిన ఫార్మాట్‌లో ఐటీఆర్ వెరిఫికేషన్ ఫామ్ పూర్తి చేసి Centralised Processing Centre, Income Tax Department, Bengaluru - 560500, Karnataka అడ్రస్‌కు స్పీడ్ పోస్టులో పంపాలి.

రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత గడువులోగా వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే మీరు రిటర్న్స్ ఫైల్ చేసినట్టు పరిగణలోకి తీసుకోరు. కాబట్టి రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే తగిన కారణం చూపడం ద్వారా వెరిఫికేషన్ ఆలస్యం అయినందుకు క్షమించమని అభ్యర్థిస్తూ వెరిఫికేషన్ పూర్తి చేయొచ్చు.

First published:

Tags: Income tax, ITR, Itr deadline, ITR Filing, Personal Finance

ఉత్తమ కథలు