ధంతేరాస్ రోజున రికార్డు స్థాయిలో బంగారం అమ్మకాలు జరిగాయి. ధంతేరాస్ సందర్భంగా రెండు రోజుల్లో 39 టన్నుల అంటే 39,000 కిలోల బంగారాన్ని అమ్మారు నగల వ్యాపారులు. కస్టమర్లు కొన్న మొత్తం బంగారం విలువ రూ.19,500 కోట్లు ఉంటుందని ఇండియా బిలియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ధంతేరాస్ రోజున బంగారం కొంటే అదృష్టం కలిసొస్తుందన్న విశ్వాసంతో కస్టమర్లు పసిడిని కొన్నారు. మరి మీరు కూడా ధంతేరాస్, దీపావళి సందర్భంగా గోల్డ్ కొన్నారా? మరి బిల్లు తీసుకున్నారా? మీరు తీసుకున్న బిల్లులో అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా? అసలు నగలు కొన్నప్పుడు తీసుకునే బిల్లులో ఏఏ వివరాలు ఉండాలి? తెలుసుకోండి.
బంగారం కొనేప్పుడు కొంత ఉత్సాహం, సంతోషం ఉంటుంది. అయితే ఆ సంతోషంలో బంగారం అప్రమత్తంగా లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. లేదా చిక్కుల్లో పడొచ్చు. ఛార్జీలు, పన్నుల విషయంలో కొన్ని షాపులు తప్పుదారి పట్టిస్తుంటాయి. అందుకే అన్ని వివరాలు పక్కాగా తెలుసుకోవడం మంచిది. మీరు నగల షాపులో ఆభరణాలు కొన్నప్పుడు ప్రామాణికమైన, ఒరిజినల్ బిల్స్ తీసుకోవాలని, తర్వాత ఏదైనా వివాదం వచ్చినప్పుడు ఫిర్యాదు చేయడానికి ఈ బిల్ తప్పనిసరి అని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చెబుతోంది.
New Rules: నవంబర్లో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే... మీ జేబుకు చిల్లు పెట్టేవి కూడా ఉన్నాయి
మీరు నగలు కొన్నప్పుడు అవి హాల్మార్క్ నగలేనా కాదా అని చెక్ చేయాలి. బిల్లులో హాల్మార్క్ అని ఉంటే సరిపోదు. నగలపైనా హాల్మార్క్ ముద్ర తప్పనిసరిగా చెక్ చేయాలి. హాల్మార్క్ ఎన్ని క్యారెట్లకు ఉందో కూడా చెక్ చేయాలి. 18K, 22K అని వేర్వేరుగా ఉంటాయి. మీ దగ్గర 22 క్యారెట్ డబ్బులు వసూలు చేసి, 18 క్యారెట్ల నగల్ని అమ్మితే మీరు మోసపోయినట్టే. అందుకే మీ నగల వివరాలన్నీ బిల్లులో తప్పనిసరిగా ఉండాలి.
బిల్లులో నగల గురించి పూర్తి వివరాలు ఉండాలి. నగల తయారీకి ఉపయోగించిన బంగారం స్వచ్ఛత ఎంత అని ఉండాలి. అంటే ఎన్ని క్యారెట్ల బంగారం అన్న వివరాలు స్పష్టంగా ఉండాలి. బంగారం బరువు ఎంతో రాయాలి. నగ బరువులో రాళ్ల బరువు తీసేయించి, బంగారం బరువు ఎంత ఉందో రాయించాలి. రాళ్ల బరువు ఎంత, రాళ్లకు ఎంత ఛార్జీలు ఉంటాయో రాయాలి. హాల్మార్క్ వేయించడానికి ఎంత ఛార్జీలు చెల్లించారో కూడా రాయాలి. మేకింగ్ ఛార్జీలు, పన్నులు ఎంత వేశారో కూడా వేరుగా రాయించాలి.
IRCTC Tour: హైదరాబాద్ ఖజురహో టూర్ ... ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
ఈ నగలకు ఇంత మొత్తం అయింది అని మొత్తం కలిపి ఒకే అమౌంట్ రాయించకూడదు. తప్పనిసరిగా బ్రేకప్ బిల్ తీసుకోవాలి. అంటే దేని కోసం ఎంత ఛార్జ్ చేశారో వేర్వేరుగా రాస్తే తర్వాత ఏ ఇబ్బంది ఉండదు. ఇలా వివరాలన్నీ వేర్వేరుగా రాసి, ఒరిజినల్ బిల్ తీసుకుంటే, తర్వాత ఆభరణాల్లో ఏదైనా తేడా ఉన్నట్టు మీకు అనిపిస్తే ఫిర్యాదు చేయడానికి సులువు అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dhanteras, Gold jewellery, Gold price in hyderabad, Gold Prices, GST