హోమ్ /వార్తలు /బిజినెస్ /

Fact Check: కేంద్ర ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచిందా..? ఆ లెటర్ నిజమైనదేనా?

Fact Check: కేంద్ర ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచిందా..? ఆ లెటర్ నిజమైనదేనా?

Fact Check: కేంద్ర ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచిందా..? ఆ లెటర్ నిజమైనదేనా?

Fact Check: కేంద్ర ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచిందా..? ఆ లెటర్ నిజమైనదేనా?

FACT CHECK : డియర్నెస్‌ అలవెన్స్ అనేది ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లిస్తున్న కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అడ్జస్ట్‌మెంట్‌. జీతంలోని డియర్నెస్‌ అలవెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిబంధనల ప్రకారం సవరిస్తుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల (Central Government Employees)కు డియర్నెస్‌ అలవెన్స్‌ను (DA) ప్రస్తుతం ఉన్న 34 శాతం నుంచి 38 శాతానికి పెంచినట్లు వాట్సాప్‌లో ఓ నోటీస్ సర్క్యులేట్ అవుతోంది. అయితే ఈ లెటర్ నకిలీదని, అలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని కేంద్ర ప్రభుత్వం (Central Goverment) గురువారం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ఓ ట్వీట్‌ చేసింది. అందులో.. ‘డియర్నెస్‌ అలవెన్స్ అడిషనల్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ 01.07.2022 నుంచి అమలులోకి వస్తుందని వాట్సాప్‌లో నకిలీ ఉత్తర్వులతో ఉన్న లేఖ సర్క్యులేట్ అవుతోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండీచర్ అటువంటి ఉత్తర్వును ఇప్పటి వరకు జారీ చేయలేదు.’ అని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానాలు/పథకాలపై తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, అధికారికంగా ప్రకటించిన వివరాలను మాత్రమే నమ్మాలని సూచించింది.


వాట్సాప్‌లో విస్తృతంగా సర్క్యులేట్‌ అవుతున్న లేఖలో.. ‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డియర్నెస్‌ అలవెన్స్‌ను 2022 జులై 1 నుంచి అమలులోకి వచ్చేలా ప్రస్తుత బేసిక్ పేలో 34 శాతం నుంచి 38 శాతానికి పెంచాలని నిర్ణయించడంపై రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు.’ అని ఉంది.* డియర్నెస్‌ అలవెన్స్ అంటే ఏంటి?
డియర్నెస్‌ అలవెన్స్ అనేది ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లిస్తున్న కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అడ్జస్ట్‌మెంట్‌. జీతంలోని డియర్నెస్‌ అలవెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిబంధనల ప్రకారం సవరిస్తుంది.


* రాబోయే నెలల్లో నిర్ణయం?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణం అంచనాను 6.7 శాతం వద్ద ఉంచింది. మానిటరీ పాలసీ కమిటీ ప్రకటన ప్రకారం..‘ద్రవ్యోల్బణం అంచనా 2022-23లో 6.7 శాతం వద్ద, రెండో క్వార్టర్‌లో 7.1 శాతంగా, మూడో క్వార్టర్‌లో 6.4 శాతం, నాలుగో క్వార్టర్‌లో 5.8 శాతంగా ఉంది. 2023-24లో CPI ద్రవ్యోల్బణం 5.0 శాతంగా అంచనా వేశారు.


ఇది కూడా చదవండి : ఈ స్కీమ్ లో చేరండి.. 124 నెలల్లో మీ డబ్బును రెట్టింపు చేసుకోండి..


ద్రవ్యోల్బణం రేట్లు అలాగే ఉంచడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాబోయే నెలల్లో డియర్నెస్‌ అలవెన్స్‌ పెంపును ఆశించవచ్చు. నివేదికల ప్రకారం.. ప్రభుత్వం డియర్నెస్‌ అలవెన్స్‌, డియర్నెస్‌ రిలీఫ్‌ను 4 శాతం పెంచవచ్చు. డీఏ, డీఆర్‌ను రిటైల్ ద్రవ్యోల్బణం ఆధారంగా సవరిస్తారు. ఇది చాలా కాలంగా 7 శాతానికి పైగా ఉంది.


* డీఏ పెంపు ఎంత ఉండవచ్చు?

2022 జనవరి, ఫిబ్రవరిలో AICPI వరుసగా 125.1, 125 ఉండగా.. మార్చిలో అది 126కి పెరిగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఏప్రిల్‌లో AICPI 127.7కి చేరింది. మేలో AICPI 129కి జంప్ అయింది. AICPI ఆ స్థాయిలో కొనసాగితే, 4 శాతం డీఏ పెంపును పొందే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి చేరుకుంది. అయితే జూన్‌లో 7.01 శాతానికి తగ్గింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Central Government, DA Hike, Fact Check, Whatsapp

ఉత్తమ కథలు