హోమ్ /వార్తలు /బిజినెస్ /

హైపర్ ఆదికి ఢీ డాన్సర్ అక్సా ఖాన్ వార్నింగ్...సుధీర్ జోలికొస్తే అంటూ...అందరూ చూస్తుండగానే...

హైపర్ ఆదికి ఢీ డాన్సర్ అక్సా ఖాన్ వార్నింగ్...సుధీర్ జోలికొస్తే అంటూ...అందరూ చూస్తుండగానే...

సుధీర్, అక్సా ఖాన్, హైపర్ ఆది

సుధీర్, అక్సా ఖాన్, హైపర్ ఆది

అక్సా ఖాన్ సుధీర్ పట్ల తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ అక్సా ఖాన్ పై మరో జబర్దస్త్ కమెడియన్, ఢీ షోలో సుధీర్ రైవల్ టీమ్ యాంకర్ హైపర్ఆది కూడా ఈ మధ్య కాలంలో తన స్కిట్స్ లో స్థానం కల్పిస్తూ, ఓ కన్నేసినట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

జబర్దస్త్ ద్వారా పరిచయం అయిన సుధీర్ ప్రస్తుతం తెలుగు టెలివిజన్ పై సూపర్ స్టార్ స్థాయిని అందుకున్నాడు. జబర్దస్త్ లో ఎదురు లేని సుధీర్ ప్రస్తుతం ఢీ షోలో కూడా అదే స్థాయిలో రెచ్చిపోవడం అలవాటే. అటు సినిమాల్లో కూడా చాన్సులు సంపాదిస్తూ నెమ్మదిగా షారుఖ్ ఖాన్ తరహాలో బుల్లితెర నుంచి వెండితెర సూపర్ స్టార్ అయ్యేందుకు పయనిస్తున్నాడు. సుధీర్ క్రేజ్ సినిమాల్లోకి వెళ్లిన తర్వాత అమాంతం పెరిగిపోయింది. ఇదిలా ఉంటే రష్మీ విష్ణుప్రియ అనంతరం ఢీ షో ద్వారా డాన్సర్ గా పరిచయం అయిన ప్రస్తుతం స్టార్ స్టేటస్ అందుకున్న అక్సాఖాన్ సైతం సుడిగాలి సుధీర్ భామల జాబితాలో చేరింది. అయితే స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండే అక్సా ఖాన్ ఓ యూట్యూబ్ ఛానెల్ లో సుధీర్ కి ఇష్టం ఐతే రష్మీని ఒప్పించి పెళ్లి చేసుకుంటా ఓపెన్ అయిపోయింది. అయితే సుధీర్ కూడా అక్సా పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. తాజాగా సుడిగాలి సుధీర్ నటిస్తున్న సినిమాలో అక్సా ఖాన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సుధీర్, అక్సాఖాన్

అయితే అక్సా ఖాన్ సుధీర్ పట్ల తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ అక్సా ఖాన్ పై మరో జబర్దస్త్ కమెడియన్, ఢీ షోలో సుధీర్ రైవల్ టీమ్ యాంకర్ హైపర్ఆది కూడా ఈ మధ్య కాలంలో తన స్కిట్స్ లో స్థానం కల్పిస్తూ, ఓ కన్నేసినట్లు తెలుస్తోంది. దీనిపై సుధీర్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ అక్సా ఖాన్ మాత్రం సుధీర్ అంటే ఎప్పటికప్పుడు తన ఇష్టాన్ని చాటుకుంటోంది. అయితే ఈ మధ్య జబర్దస్త్ లోనూ, అలాగే ఢీలో కూడా హైపర్ ఆది, ముందు వెనక చూస్కోకుండా సుధీర్ పై ఇష్టం వచ్చినట్లు పంచులు వేస్తున్నాడని, దీంతో అక్సా ఖాన్ తన ఫేవరెట్ యాంకర్ సుధీర్ పట్ల హైపర్ ఆది ఇలా డీగ్రేడ్ చేయడం నచ్చలేదని సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. అయితే అక్సాఖాన్ మాత్రం తనకు హైపర్ ఆది కనపిస్తే వార్నింగ్ ఇస్తానని సన్నిహితులతో చెప్పింది. దీనిపై హైపర్ ఆది కూడా ఈ వ్యవహారం ఎంత వరకూ పోతుందో అర్థం కాక సైలెంట్ అయిపోయాడని టాక్, అటు సుధీర్ పై నిజంగానే హైపర్ ఆది ఇలా పంచులు వేయడంపై అభిమానులు హర్ట్ అవుతున్నారని నెట్టింట వినిపిస్తోంది. బుల్లితెరపై పవర్ స్టార్ గా పేరొందిన సుడిగాలి సుధీర్ అంటే సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇవేవీ పట్టించుకోకుండా హైపర్ ఆది నోరు జారడం ఒకరకంగా తప్పేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

First published:

Tags: Dhee Dance Reality Show, Hyper Aadi, Jabardasth, Jabardasth comedy show, Sudigali sudheer, Sudigali Sudhir

ఉత్తమ కథలు