Buyback | కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. షేర్ బైబ్యాక్ చేస్తోంది. దీంతో ఆ షేర్లు కలిగిన వారి పంట పండిందని చెప్పుకోవచ్చు. ధనుక అగ్రిటెక్ కంపెనీ షేర్ బైబ్యాక్ చేయనుంది. రూ. 85 కోట్ల విలువైన షేర్లను (Stocks) కంపెనీ ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయనుంది. డిసెంబర్ 26 నుంచి ధనుక అగ్రిటెక్ షేర్ల (Shares) బైబ్యాక్ ప్రారంభం కానుంది. కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీలకు ఈ విషయాన్ని వెల్లడించింది. 2023 జనవరి 6 వరకు ఈ బైబ్యాక్ కొనసాగుతుంది.
కంపెనీ షేర్లు ప్రస్తుతం రూ. 710 వద్ద కదలాడుతున్నాయి. అర్హత కలిగిన ఇన్వెస్టర్లు ఒక్కో షేరుపై ఏకంగా రూ. 140 మేర లాభం పొందొచ్చు. కంపెనీ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 855గా ఉంది. అలాగే కనిష్ట స్థాయి రూ. 631 వద్ద ఉంది. ఈ కంపెనీ షేర్లు గత ఆరు నెలల కాలంలో 5 శాతం మేర పెరిగాయి. అదే ఏడాది ఆరంభం నుంచి చూస్తే మాత్రం షేరు ధర దాదాపు 10 శాతం మేర పతనమైంది.
వారెవ్వా అనిపించే ఫీచర్లతో హీరో కొత్త బైక్ .. రూ.2,500తో బుక్ చేసుకోండి!
ధనుక అగ్రోటెక్ కంపెనీ 10 లక్షల షేర్లను బైబ్యాక్ చేయనుంది. షేరు బైబ్యాక్ విలువ రూ. 850గా ఉంది. అంటే ప్రస్తుత ధరతో పోలిస్తే దాదాపు రూ. 140 మేర ప్రాఫిట్ పొందొచ్చు. అందువల్ల ఈ షేర్లు కలిగిన వారికి కొత్త ఏడాది ఆరంభంలోనే బంపర్ రిటర్న్ లభించిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే కేవలం ఈ కంపెనీ మాత్రమే కాకుండా ఇతర కంపెనీలు కూడా షేర్ల బైబ్యాక్ చేస్తూ ఉంటాయి.
కొత్త ఏడాదిలో డబ్బుల వర్షం కురిపించే 6 స్టాక్స్ ఇవే!
హిందూజ గ్లోబల్ కంపెనీ కూడా షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. రూ. 1020 కోట్ల విలువైన షేర్లను ఈ కంపెనీ బైబ్యాక్ చేయనుంది. 60 లక్షల షేర్లను తిరిగి కొననుంది. షేరు బైబ్యాక్ విలువ రూ. 1700గా ఉంది. ఫిబ్రవరి నెలలో ఈ షేర్ల బైబ్యాక్ ఉండనుంది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ. 1370 వద్ద ఉంది. ప్రస్తుత ధరతో పోలిస్తే ఒక్కో షేరుపై రూ.330 వరకు ప్రీమియం లభిస్తుందని చెప్పుకోవచ్చు.
ఇంకా త్రివేణి ఇంజినీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ కూడా షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. రికార్డు డేట్‌ను డిసెంబర్ 23గా ఫిక్స్ చేశారు. రూ. 800 కోట్ల విలువైన షేర్లను కంపెనీ బైబ్యాక్ చేయనుంది. ఒక్కో షేరుకు బైబ్యాక్ విలువ రూ. 350గా ఉంది. షుగర్, పవర్, ఆల్కహాల్, ఇథనల్, గేర్ బాక్స్, డిఫెన్స్ ఎక్విప్‌మెంట్, వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ వంటి విభాగాల్లో సేవలు అందిస్తున్న ఈ కంపెనీ షేరు ధర ఏడాదిలో 30 శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుతం షేరు ధర రూ. 295 వద్ద ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Money, Share Market Update, Stock Market, Stocks